3 టీ20లు, 3 వన్డేల సిరీస్‌ల కోసం భారత మహిళల క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. ఇందులో భాగంగా బంగ్లాదేశ్-టీమిండియాల మధ్య ఇవాళ (జులై 11) రెండో టీ20 జరుగుతుంది. ఢాకా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాను బంగ్లాదేశ్ బౌలర్లు కట్టడి చేశారు. బంగ్లా బౌలర్లు మూకుమ్మడిగా రాణించి టీమిండియాకు చుక్కలు చూపించారు.
వీరి ధాటికి టీమిండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 95 పరుగలు మాత్రమే చేయగలిగింది. బంగ్లా బౌలర్లలో సుల్తానా ఖాతూన్ 3 వికెట్లతో రెచ్చిపోగా.. ఫాతిమా ఖాతూన్ 2, మరూఫా అక్తెర్, నమిద అక్తెర్, రబెయా ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. భారత బ్యాటర్లలో ఒక్కరు కూడా కనీసం 20 పరుగుల మార్కును దాటలేకపోయారు. ఓపెనర్ షఫాలీ వర్మ చేసిన 19 పరుగులే టాప్ భారత ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర్‌గా నిలిచింది.
షఫాలీ సహా స్మృతి మంధన (13), యస్తిక భాటియా (11), దీప్తి శర్మ (10), అమన్‌జోత్ కౌర్ (14) రెండంకెల స్కోర్లు చేశారు. టీమిండియా స్టార్ బ్యాటర్లు హర్మన్‌ప్రీత్ కౌర్ డకౌట్ కాగా.. జెమీమా రోడ్రిగెజ్ (8), హర్లీన్ డియోల్ (6) నిరాశపరిచారు. కాగా, ఈ సిరీస్‌లో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇదే వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
Comments
Please login to add a commentAdd a comment