అంజలి శర్వాణి- యష శ్రీ
Women Cricketers From Telugu States In WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్ వేలం-2023లో ఆరుగురు తెలుగు అమ్మాయిలు మంచి ధర దక్కించుకున్నారు. అంజలి శర్వాణి, సబ్బినేని మేఘన, షబ్నమ్ షకీల్, సొప్పదండి యషశ్రీ, అరుంధతి రెడ్డి, స్నేహ దీప్తి ఆటతో సత్తా చాటి ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించారు. వేలంలో వీరికి పలికిన ధర, వీరు ఏయే జట్లకు ఆడబోతున్నారన్న అంశాలు సంక్షిప్తంగా..
అంజలి శర్వాణి
►లెఫ్టార్మ్ పేస్ బౌలర్. కర్నూల్ జిల్లా ఆదోని స్వస్థలం. భారత్ తరఫున 6 టి20లు మ్యాచ్‌లు ఆడింది.
►జట్టు: యూపీ వారియర్జ్
►ధర: 55 లక్షలు
సబ్బినేని మేఘన
►బ్యాటర్, స్వస్థలం విజయవాడ. భారత్ తరఫున 3 వన్డేలు, 17 టి20 మ్యాచ్‌లు ఆడింది.
►జట్టు: గుజరాత్ జెయింట్స్
►ధర: రూ.30 లక్షలు
షబ్నమ్ షకీల్
►రైట్ ఆర్మ్ పేస్ బౌలర్. స్వస్థలం విశాఖపట్నం. ఇటీవల అండర్–19 ప్రపంచకప్‌లో ఆడింది.
►జట్టు- గుజరాత్ జెయింట్స్
►ధర: రూ.10 లక్షల
సొప్పదండి యషశ్రీ
►పేస్ బౌలర్. హైదరాబాద్ స్వస్థలం. ఇటీవల అండర్–19 ప్రపంచ కప్‌లో ఆడింది.
►జట్టు: యూపీ వారియర్స్
►ధర: రూ.10 లక్షలు
అరుంధతి రెడ్డి
►రైట్ ఆర్మ్ పేస్ బౌలర్. స్వస్థలం హైదరాబాద్. భారత్ తరఫున 26 టి20లు ఆడింది.
►జట్టు: ఢిల్లీ క్యాపిటల్స్
►ధర: రూ.30 లక్షలు
వి. స్నేహ దీప్తి
►బ్యాటర్. స్వస్థలం విశాఖపట్నం. భారత్ తరఫున 1 వన్డే, 2 టి20లు ఆడింది.
►జట్టు: ఢిల్లీ క్యాపిటల్స్
►ధర: రూ.30 లక్షలు.
వీరిలో అంజలి శర్వాణి అత్యధికంగా 55 లక్షలు పలికింది. ఇదిలా ఉంటే... అండర్-19 మహిళల ప్రపంచకప్-2023లో సత్తా చాటిన తెలంగాణ అమ్మాయి, భద్రాచలానికి చెందిన గొంగడి త్రిష మాత్రం వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయింది.
చదవండి: WPL 2023 Auction: స్మృతికి అంత ధరెందుకు? వాళ్లకేం తక్కువ కాలేదు.. హర్మన్ విషయంలో మాత్రం..
WPL Auction 2023: అన్ సోల్డ్‌గా మిగిలిపోయిన తెలంగాణ అమ్మాయి
Comments
Please login to add a commentAdd a comment