
రేణిగుంట (చిత్తూరు): ఈనెల 11న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 130 అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంటుందని.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం తథ్యమని సినీనటుడు, వైఎస్సార్‌సీపీ నేత మంచు మోహన్‌బాబు అన్నారు. కుమారుడు మంచు విష్ణుతో కలిసి శనివారం సాయంత్రం ఆయన హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ పార్టీ నాయకులు, యువకులు పెద్దసంఖ్యలో ఆయనకు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మోహన్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అసమర్థ పాలనతో ప్రజలు విసుగెత్తి ఉన్నారని, వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చి ప్రజారంజక పాలన అందిస్తుందన్నారు. అనంతరం భారీ ర్యాలీ మధ్య ఆయన తిరుపతికి బయల్దేరి వెళ్లారు. ఆయన వెంట జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షుడు ఖాద్రి, రైతు విభాగం నేతలు ఆదికేశవులరెడ్డి, హైకోర్టు న్యాయవాది పేరూరు మునిరెడ్డితో పాటు పార్టీ సీనియర్ నేతలు అన్నా రామచంద్రయ్య యాదవ్, వై.సురేష్, ఎన్‌వీ సురేష్, నైనారు మధుబాల, ఎంవీఎస్ మణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment