

వారసత్వంతో టాలీవుడ్‌లో హీరోలు అయినవాళ్లు చాలామంది ఉన్నారు.

ఇందులో మంచు విష్ణు ఒకరు. మోహన్ బాబు పెద్ద కుమారుడిగా ఈయన అందరికీ తెలుసు.

ఈరోజు (నవంబర్ 23) మంచు విష్ణు పుట్టినరోజు. ఈ సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు.

మోహన్ బాబు పెద్ద కొడుకు విష్ణు.. తన పేరుతో తీసిన 'విష్ణు' మూవీతోనే హీరోగా పరిచయమయ్యారు.

తొలి మూవీ అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. అయితేనేం ఒక్కో చిత్రం చేస్తూ నటుడిగా ఎదిగారు.

'ఢీ' మూవీ మంచు విష్ణు కెరీర్‍లో టర్నింగ్ పాయింట్. అద్భుతమైన కామెడీతో తన మార్క్ చూపించారు.

'దేనికైనా రెడీ', 'దూసుకెళ్తా', 'పాండవులు పాండవులు తుమ్మెద' లాంటి కామెడీ సినిమాలతో ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించారు.

ఆ తర్వాత మళ్లీ సీరియస్ మూవీస్ చేస్తూ ఊహించని ఫెయిల్యూర్స్ చూడాల్సి వచ్చింది.

మంచు విష్ణుకి ప్లస్ అయినవి కామెడీ సినిమాలే. కానీ సీరియస్ మూవీస్ చేయడం పొరపాటు లాంటిదని చెప్పొచ్చు.

'ఢీ' సినిమాతో మంచు విష్ణు హీరోగా ఎక్కడికో వెళ్లిపోయాడు. తర్వాత కొన్ని తప్పిదాల్లాంటి చిత్రాలు ఇతడికి వెనక్కి లాగేశాయమో!

గత కొన్నాళ్లుగా చూస్తే విష్ణుకి సరైన మూవీ పడట్లేదు. ఇప్పుడు ఆశలన్నీ పాన్ ఇండియా 'కన్నప్ప'పైనే.

మరి మంచు విష్ణు ఆశపడుతున్నట్లు 'కన్నప్ప' మూవీతో కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి?


