
జనవరి 1న అందరూ కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ చేసుకుంటారు. అయితే మంచు ఫ్యామిలీలో మాత్రం ఓ బర్త్‌డే వేడుక కూడా జరుపుకుంటారు.

అయితే మంచు ఫ్యామిలీలో మాత్రం ఓ బర్త్‌డే వేడుక కూడా జరుపుకుంటారు. ఈ రోజు మంచు విష్ణు కుమారుడు అవ్రమ్ పుట్టినరోజు.

ఈ సందర్భంగా విష్ణు సతీమణి విరాణిక తన పిల్లాడి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో అవ్రమ్ బెలూన్లతో ఎంతో సంతోషంగా ఆడుకుంటున్నాడు.


కాగా ఈ బుడ్డోడు సినిమాల్లోనూ ఎంట్రీ ఇవ్వనున్నాడు.

కన్నప్ప సినిమాలో తిన్నడుగా కనిపించనున్నాడు.

ఈ తిన్నడే పెద్దయ్యాక భక్త కన్నప్పగా మారతాడు.

ఆ మధ్య తిన్నడి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ మంచు విష్ణు ఎమోషనలయ్యాడు.

అవ్రమ్ ఈ ప్రపంచానికి నటుడిగా పరిచయం అవుతున్నందుకు మాటలు రావడం లేదని భావోద్వేగానికి లోనయ్యాడు. కన్నప్ప మూవీ ఏప్రిల్ 25న విడుదల కానుంది.




