
కె.చంద్రశేఖర రావు
హైదరాబాద్: తెలుగు పరిశ్రమకు హైదరాబాద్‌లో వచ్చిన ఇబ్బందేమీ లేదని తెలుగు సినిమా ప్రముఖులకు కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు హామీ ఇచ్చారు. తెలుగు సినీ ప్రముఖుల పలువురు ఈ రోజు కేసీఆర్‌ను కలిశారు. కొద్దిసేపు ఆయనతో సమావేశమయ్యారు. వారి సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ తెలుగు సినిమా పరిశ్రమకు హైదరాబాద్లో ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. త్వరలో ప్రభుత్వ బాధ్యతలు చేపట్టిన తరువాత మళ్లీ మరోసారి సమావేశమవుదామని కెసిఆర్ వారికి చెప్పారు. కెసిఆర్ను కలిసినవారిలో డి.రామానాయుడు, మురళీమోహన్తోపాటు పలువురు నిర్మాతలు, నటులు ఉన్నారు.
ఆ తరువాత సినీనటుడు, నిర్మాత మోహన్ బాబు కూడా కెసిఆర్ను కలిశారు. అనంతరం మోహన్ బాబు మాట్లాడుతూ కెసిఆర్ ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితుడని చెప్పారు. తెలంగాణకు చెందిన పేద ప్రజల భూములను, ప్రభుత్వ భూములను ఎంతో మంది ఆక్రమించారన్నారు. వాటిని స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలని కేసీఆర్‌ను కోరినట్లు తెలిపారు.