దైవ సన్నిధానంలో శ్రీ స్వరూపానందేంద్ర | Swaroopanandendra Saraswati honored by Mohan Babu at Daiva Sannidhanam | Sakshi
Sakshi News home page

దైవ సన్నిధానాన్ని సందర్శించిన విశాఖ శారదాపీఠాధిపతి

Published Thu, Jun 27 2019 4:20 PM | Last Updated on Thu, Jun 27 2019 4:27 PM

Swaroopanandendra Saraswati honored by Mohan Babu at Daiva Sannidhanam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి శ్రీ  స్వాత్మానందేంద్ర సరస్వతి గురువారం ఫిలిం నగర్ దైవ సన్నిధానాన్ని సందర్శించి పూజా కార్యక్రామాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫిలిం నగర్ దైవసన్నిధానం చైర్మన్ డా. మోహన్ బాబు, కళాబంధు టి. సుబ్బిరామిరెడ్డి, పరుచూరి బ్రదర్స్, శ్రీమతి సురేఖ, ఎస్. గోపాల్ రెడ్డి, దర్శకుడు బి . గోపాల్ , హీరో శ్రీకాంత్, ఊహ, మంచు విష్ణు, మంచు లక్ష్మి, మంచు నిర్మల,  చాముండేశ్వరినాథ్  తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా.. ఫిలిం నగర్ దైవసన్నిధానం చైర్మన్ డా. మోహన్ బాబు మాట్లాడుతూ - ‘రెండు రాష్ట్రాలతో పాటు యావత్ భారత దేశం గర్వించదగ్గ మహోన్నత స్వామి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర స్వామి వారు. నేను రజినీకాంత్ గారు ఒక సారి వారి పీఠానికి వెళ్లి దర్శనం చేసుకోవడం జరిగింది. నిజమైన ప్రశాంతత కోరుకునే వ్యక్తులు ఎవరైనా ఒక్కసారి వైజాగ్ లోని శ్రీ శ్రీ శ్రీ శారదా పీఠం ని దర్శించుకోవాల్సిందిగా మనవి. అలాంటి బృహత్తర రూపం గల శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు ఉత్తరాధికారిగా శ్రీ  స్వాత్మానందేంద్ర సరస్వతి  స్వామివారికి భాద్యతలు ఇవ్వడం మంచి పరిణామం. వారికి దాదాపు  భారతదేశం లో 108 మఠాలు ఉన్నాయి. వారి ఆశీస్సులు  ఫిలిం నగర్ దైవసన్నిదానానికి ఎల్లవేళలా ఉంటాయి’ అన్నారు.

శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ.. ‘ఈరోజు ఫిలిం నగర్ దైవసన్నిధానంలో సినిమా వారు ముఖ్యంగా నేనంటే ప్రాణం ఇచ్చే మోహన్ బాబు గారు ఈ కార్యక్రమాన్ని రెండు రాష్ట్రాలకు ఒక పరిచయ వేదికగా  ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా అనిపించింది. విశాఖ శ్రీ శారదా పీఠం అంటే ధర్మ ప్రతిష్టాపన కోసం 21 సంవత్సరాలుగా అవిశ్రామంగా కృషి చేస్తుంది. మా పీఠానికి శ్రీ సుబ్బిరామి రెడ్డి గారు ఎంతో చేయూత నిస్తున్నారు. ఆయన నేను లేకుండా ఏ కార్యక్రమం చేయడానికి ఇష్టపడరు. నా తరువాత ఆది శంకరాచార్యుల దృక్పథాన్ని నిలబెట్టడానికి 5వ యావత్ భారత దేశానికి ఉత్తరాధికారిగా శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి గారిని నియమించడం జరిగింది. ఫిలిం నగర్ దైవసన్నిధానం నుండి విస్తృతమైన ధర్మ ప్రచారానికి నాంది ఇక్కడి నుండి ప్రారంభమవుతుంది’ అన్నారు.

కళాబంధు టి సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ.. ‘ఫిలిం నగర్ దైవసన్నిధానం ఎల్లప్పుడూ కలకలడానికి కారణం భారత దేశంలో అతి  తక్కువ సమయంలోనే అన్ని చోట్లా పీఠాలను నెలకొల్పిన శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు. వారి జీవిత లక్ష్యం ప్రతి ఒక్కరికి ధార్మిక జీవితాన్ని ప్రసాదించడం. అలాగే  స్వాత్మానందేంద్ర సరస్వతి  స్వామి వారు మహా జ్ఞాని. ఆయన నాకు చాలా కాలంగా పరిచయం. నేను గత 27 సంవత్సరాలుగా ఏ కార్యక్రమం చేసిన వారు, వారి ఆశీస్సులు నాతోనే ఉంటాయి’ అన్నారు.
శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి  మాట్లాడుతూ.. ‘మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా ఏళ్ళక్రితం ఇక్కడే గణపతి ప్రదక్షిణాలు చేసి స్వామి వారి దగ్గర పాఠాలు నేర్చుకునే వాడిని. నాకు ఈ  ఫిలిం నగర్ దైవసన్నిధానం తో చాలా అభినాభావ సంభందం ఉంది. రెండు సంవత్సరాల క్రితం మా గురువు గారు ఉత్తరాఖండ్‌లో తపస్సు చేయమని చెప్పారు. చాలా క్లిష్ట మైన ప్రదేశం. అక్కడ జవాన్‌లు మాత్రమే ఉండగలరు. అక్కడ కూడా తెలుగు వారు వచ్చి ఫిలిం షూటింగ్ లు జరుపుతున్నారు. ప్రేక్షకులకు రెండు మూడు గంటలు ఆనందం ఇవ్వడం కోసం అంత కస్టపడి సినిమాలు తీస్తారా? అని ఆశ్చర్యానికి లోనయ్యాను. అలా సైనికులు ఉండగలిగే ప్రదేశాలలో షూటింగ్ చేయడం సినిమా వారికే చెల్లింది’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement