నటుడు మోహన్ బాబు (Mohan Babu) ఫ్యామిలీలో మరోసారి వివాదం రాజుకుంది. తిరుపతిలో మోహన్‌బాబుకు చెందిన శ్రీవిద్యానికేతన్ క్యాంపస్‌లోకి మనోజ్ (Manchu Manoj)- మౌనిక దంపతులు వెళ్లేందుకు ప్రయత్నించారు. మనోజ్ వస్తాడన్న సమాచారంతో యూనివర్సిటీ గేట్లను సిబ్బంది పూర్తిగా మూసివేశారు. సెక్యురిటీ సిబ్బంది ఎవరినీ లోనికి అనుమతించడం లేదు.
మోహన్‌బాబు, విష్ణు (Manchu Vishnu) యూనివర్సిటీ వద్దే ఉన్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి యూనివర్సిటీకి మనోజ్ భారీ ర్యాలీతో రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా భారీగా మెహరించారు. క్యాంపస్‌కు చేరుకున్న మంచు మనోజ్‌ను సిబ్బంది లోనికి అనుమతించలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మనోజ్.. అవ్వ, తాతల సమాధుల వద్దకు అనుమతించరా, గేట్లు తియ్యండి అంటూ కేకలు పెట్టాడు. ఈ క్రమంలో అవ్వ, తాతల సమాధుల వద్దకు వెళ్లేందుకు గేట్లు ఎక్కిన మనోజ్ అభిమానులపై మోహన్‌బాబు బౌన్సర్లు దాడి చేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పలువురికీ గాయాలయ్యాయి.
ఏం జరిగిందంటే?
కొద్దిరోజులుగా మంచు ఫ్యామిలీలో కలహాలు జరుగుతున్న విషయం తెలిసిందే! విష్ణు- మనోజ్‌కు మధ్య సత్సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. తండ్రితో సైతం గొడవలు తారా స్థాయికి చేరాయి. ఇదిలా ఉంటే మోహన్‌బాబు.. విష్ణుతో కలిసి తిరుపతిలో సంక్రాంతి పండగ సెలబ్రేట్ చేసుకున్నాడు. అటు మనోజ్.. మెగా హీరోలు సాయిధరమ్ తేజ్, పంజా వైష్ణవ్‌తేజ్‌తో సంక్రాంతి జరుపుకున్నాడు.
ఫ్లెక్సీల దగ్గర మొదలైన గొడవ?
పండగ సందర్భంగా మోహన్‌బాబు యూనివర్సిటీ నుంచి నారావారిపల్లె మనోజ్, విష్ణు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నిన్న రాత్రికి రాత్రి మనోజ్‌కు సంబంధించిన ఫ్లెక్సీలను తొలగించారట! ఈ నేపథ్యంలోనే మనోజ్.. యూనివర్సిటీకి ప్రయాణమవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మనోజ్ కాలేజీలోకి రావొద్దంటూ మోహన్‌బాబు ఇదివరకే కోర్టులో ఇంజెక్షన్ పిటిషన్ వేశారు. దీన్ని కోర్టు పరిగణలోకి తీసుకుని అనుమతిచ్చింది.
అనుమతి లేదని చెప్పినా..
అటు పోలీసులు సైతం మనోజ్‌కు నోటీసులు జారీ చేశారు. శాంతిభ్రదతల దృష్ట్యా యూనివర్సిటీలోకి అనుమతి లేదని నోటీసుల్లో పేర్కొన్నారు. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు విశ్వ విద్యాలయం ప్రాంగణంలోకి అనుమతి లేదంటూ అందుకు సంబంధించిన న్యాయస్థాన ఉత్తర్వులను మనోజ్‌కు అందజేశారు. దీంతో యూనివర్సిటీ లోపలకు వెళ్లకుండానే మనోజ్ నారావారి పల్లెకు చేరుకున్నాడు. అక్కడ మంత్రి లోకేశ్‌తో భేటీ అయ్యాడు. ప్రస్తుతం తన ఇంట్లో జరుగుతున్న పరిణామాలపై లోకేశ్‌తో చర్చించినట్లు సమాచారం. అనంతరం అభిమానులతో కలిసి మళ్లీ క్యాంపస్‌కు చేరుకున్నాడు.
చదవండి: నెట్‌ఫ్లిక్స్‌లో పవన్ కల్యాణ్ ‘ఓజీ’.. రాబోయే తెలుగు సినిమాలివే!
Comments
Please login to add a commentAdd a comment