Mohan Babu University
-
తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్ క్యాంపస్ వద్ద టెన్షన్ వాతావరణం
-
మంచు మనోజ్ అభిమానులపై మోహన్‌బాబు బౌన్సర్ల దాడి
నటుడు మోహన్ బాబు (Mohan Babu) ఫ్యామిలీలో మరోసారి వివాదం రాజుకుంది. తిరుపతిలో మోహన్‌బాబుకు చెందిన శ్రీవిద్యానికేతన్ క్యాంపస్‌లోకి మనోజ్ (Manchu Manoj)- మౌనిక దంపతులు వెళ్లేందుకు ప్రయత్నించారు. మనోజ్ వస్తాడన్న సమాచారంతో యూనివర్సిటీ గేట్లను సిబ్బంది పూర్తిగా మూసివేశారు. సెక్యురిటీ సిబ్బంది ఎవరినీ లోనికి అనుమతించడం లేదు. మోహన్‌బాబు, విష్ణు (Manchu Vishnu) యూనివర్సిటీ వద్దే ఉన్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి యూనివర్సిటీకి మనోజ్ భారీ ర్యాలీతో రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా భారీగా మెహరించారు. క్యాంపస్‌కు చేరుకున్న మంచు మనోజ్‌ను సిబ్బంది లోనికి అనుమతించలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మనోజ్.. అవ్వ, తాతల సమాధుల వద్దకు అనుమతించరా, గేట్లు తియ్యండి అంటూ కేకలు పెట్టాడు. ఈ క్రమంలో అవ్వ, తాతల సమాధుల వద్దకు వెళ్లేందుకు గేట్లు ఎక్కిన మనోజ్ అభిమానులపై మోహన్‌బాబు బౌన్సర్లు దాడి చేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పలువురికీ గాయాలయ్యాయి.ఏం జరిగిందంటే?కొద్దిరోజులుగా మంచు ఫ్యామిలీలో కలహాలు జరుగుతున్న విషయం తెలిసిందే! విష్ణు- మనోజ్‌కు మధ్య సత్సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. తండ్రితో సైతం గొడవలు తారా స్థాయికి చేరాయి. ఇదిలా ఉంటే మోహన్‌బాబు.. విష్ణుతో కలిసి తిరుపతిలో సంక్రాంతి పండగ సెలబ్రేట్ చేసుకున్నాడు. అటు మనోజ్.. మెగా హీరోలు సాయిధరమ్ తేజ్, పంజా వైష్ణవ్‌తేజ్‌తో సంక్రాంతి జరుపుకున్నాడు.ఫ్లెక్సీల దగ్గర మొదలైన గొడవ?పండగ సందర్భంగా మోహన్‌బాబు యూనివర్సిటీ నుంచి నారావారిపల్లె మనోజ్, విష్ణు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నిన్న రాత్రికి రాత్రి మనోజ్‌కు సంబంధించిన ఫ్లెక్సీలను తొలగించారట! ఈ నేపథ్యంలోనే మనోజ్.. యూనివర్సిటీకి ప్రయాణమవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మనోజ్ కాలేజీలోకి రావొద్దంటూ మోహన్‌బాబు ఇదివరకే కోర్టులో ఇంజెక్షన్ పిటిషన్ వేశారు. దీన్ని కోర్టు పరిగణలోకి తీసుకుని అనుమతిచ్చింది. అనుమతి లేదని చెప్పినా..అటు పోలీసులు సైతం మనోజ్‌కు నోటీసులు జారీ చేశారు. శాంతిభ్రదతల దృష్ట్యా యూనివర్సిటీలోకి అనుమతి లేదని నోటీసుల్లో పేర్కొన్నారు. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు విశ్వ విద్యాలయం ప్రాంగణంలోకి అనుమతి లేదంటూ అందుకు సంబంధించిన న్యాయస్థాన ఉత్తర్వులను మనోజ్‌కు అందజేశారు. దీంతో యూనివర్సిటీ లోపలకు వెళ్లకుండానే మనోజ్ నారావారి పల్లెకు చేరుకున్నాడు. అక్కడ మంత్రి లోకేశ్‌తో భేటీ అయ్యాడు. ప్రస్తుతం తన ఇంట్లో జరుగుతున్న పరిణామాలపై లోకేశ్‌తో చర్చించినట్లు సమాచారం. అనంతరం అభిమానులతో కలిసి మళ్లీ క్యాంపస్‌కు చేరుకున్నాడు.చదవండి: నెట్‌ఫ్లిక్స్‌లో పవన్ కల్యాణ్ ‘ఓజీ’.. రాబోయే తెలుగు సినిమాలివే! -
వ్యోమగావిునవుతా
తిరుపతి సిటీ: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో తిరుపతికి చెందిన ఓ విద్యార్థిని వ్యోమగామి కావాలన్న తన కలను నెరవేర్చుకునే దిశగా ఓ అడుగు ముందుకేసింది. ‘నాసా’ అందిస్తున్న ఐఏఎస్పీ కోర్సును విజయవంతంగా పూర్తి చేసింది. ఔత్సాహిక విద్యార్థులను ప్రోత్సహించేందుకు అమెరికాలోని ఎయిర్ స్పేస్ అండ్ రాకెట్ సెంటర్, నాసా సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నవంబర్ నెలలో ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాం(ఐఏఎస్పీ) అందిస్తోంది. విద్యార్థులకు పది రోజులపాటు వ్యోమ గావిుకి సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు శిక్షణ ఇస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 50 మందికే ఈ అవకాశం లభిస్తుంది. ఈ ఏడాది భారత్ నుంచి కేవలం నలుగురే ఎంపికయ్యారు. ఇందులో తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీలో బీటెక్ ఈసీఈ సెకండియర్ చదువుతున్న కాలువ జోషితారెడ్డికి అవకాశం దక్కింది. కానీ తగినంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో.. ఎంపీ మిథున్‌రెడ్డి ద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వం దృష్టికి తన సమస్యను తీసుకెళ్లింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి.. రూ.25 లక్షల ఆర్థిక సాయం చేయడంతో జోషితా అమెరికా వెళ్లింది. ఈనెల 11 నుంచి ప్రారంభమైన ఐఏఎస్పీ శిక్షణను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. నాసా నుంచి ధ్రువపత్రంతో పాటు శిక్షణలో ప్రతిభ కనబరిచినందుకు యూఎస్ స్పేస్ అండ్ రాకెట్ సెంటర్ ప్రతినిధుల నుంచి బెస్ట్ ట్రైనర్ అవార్డు కూడా అందుకుంది. అమెరికా నుంచి తిరుపతికి వచ్చిన ఆమె ఆదివారం తల్లి శ్రీలతారెడ్డితో కలసి ‘సాక్షి’తో మాట్లాడారు. సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటా ‘నాకు చిన్న వయసు నుంచి వ్యోమగామి కావాలని కోరిక ఉంది. అందుకు సంబంధించిన వీడియోలు, ఆర్టికల్స్ చదువుతూ ఉండేదాన్ని. యూఎస్ స్పేస్ సెంటర్, నాసా ఏటా ప్రపంచవ్యాప్తంగా 50 మందిని ఐఏఎస్పీ ప్రోగ్రామ్‌కు ఎంపిక చేస్తుందని తెలియడంతో దరఖాస్తు చేశాను. అన్ని ఇంటర్వూ్యల్లో సెలెక్ట్ అయ్యాను. కానీ తగినంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో అమ్మతో పాటు స్థానిక నాయకుడు ప్రతాప్‌రెడ్డి సహకారంతో ఎంపీ మిథున్‌రెడ్డి దృష్టికి నా సమస్య తీసుకెళ్లాను. ఆ తర్వాత నాకు సీఎం జగన్ రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించారు. దీంతో అమెరికా స్పేస్ సెంటర్లో శిక్షణ పూర్తి చేశాను. శిక్షణ పూర్తిగా వ్యోమగాములు, శాస్త్రవేత్తల పర్యవేక్షణలో జరిగింది. ఇందులో ముఖ్యంగా పైలెట్ డ్రైవింగ్, మూన్ గ్రావిటీ, స్కూబా డైవింగ్, మల్టీయాక్సిస్ చైర్, స్పేస్ రిలేటెడ్ వర్క్‌షాప్ తదితరాలపై శిక్షణలిచ్చారు. ఈ అరుదైన అవకాశం కల్పించిన జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటా. భవిష్యత్‌లో వ్యోమగామిగా ప్రపంచానికి సేవలందించాలని ఉంది’ అని జోషిత చెప్పారు. ప్రభుత్వ సాయం మరువలేనిది.. జోషితా తల్లి శ్రీలతారెడ్డి మాట్లాడుతూ.. ‘మా స్వస్థలం అన్నమయ్య జిల్లా కలికిరి. భర్త లేకున్నా.. పిల్లల చదువు కోసం తిరుపతిలో ఉంటున్నాం. చిన్నప్పటి నుంచి జోషితకు స్పేస్‌పై ఆసక్తిగా ఉండడంతో ప్రోత్సహించాను. నాసా ఐఏఎస్పీ ప్రొగ్రామ్‌కు పాప ఎంపికైన విషయం తెలియగానే.. ఖర్చు విషయాన్ని ఎంపీ మిథున్‌రెడ్డి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశాం. ఆ వెంటనే సీఎం జగన్మోహన్రెడ్డి పెద్ద మనస్సుతో రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఆయన అందించిన సాయం మరువలేనిది. చదువులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం’ అని చెప్పారు. -
మంచు మోహన్‌బాబు కీలక ప్రకటన.. మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి
Mohan Babu University: విభిన్నమైన పాత్రలు చేసుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచుకున్నారు సీనియర్ హీరో మంచు మోహన్ బాబు. విలన్ పాత్రల నుంచి హీరోగా ఎదిగి ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగాను సక్సెస్ అయ్యారు. ఇలా వెండితెరపై రాణిస్తున్నానే.. మరోవైపు విద్యారంగంలోకి ప్రవేశించారు. తిరుపతిలో ప్రసిద్ధ శ్రీ విద్యా నికేతన్‌ను అనే విద్యాసంస్థ స్థాపించి కులమతాలకు అతీతంగా విద్య అందిస్తున్నారు. తాజాగా మంచు మోహన్ బాబు మరో కీలక ప్రకటన చేశారు. “మోహన్ బాబు యూనివర్సిటీ” ప్రారంభిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ‘శ్రీ విద్యానికేతన్‌లో వేసిన విత్తనాలు ఇప్పుడు కల్పవృక్షంగా మారాయి. మీ 30 సంవత్సరాల విశ్వాసం, నా జీవిత లక్ష్యం ఇప్పుడు వినూత్న అభ్యాస విశ్వంలోకి చేరుకుంది. కృతజ్ఞతతో తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీని మీకు అందిస్తున్నాను. మీ ప్రేమే నా బలం, మీరు కూడా ఈ కలకి మద్దతు ఇస్తారని నేను విశ్వసిస్తున్నాను’అని మోహన్ బాబు ట్వీట్ చేశారు. 1993లో శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థను ప్రారంభించారు. ఆ తర్వాత్ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్, కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, ఫార్మసీ, పీజీ కాలేజ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ‘మోహన్ బాబు యూనివర్సిటీ’ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. With the blessings of my parents, all my fans and well wishers, I am a humbled and honored to announce #MBU #MohanBabuUniversity pic.twitter.com/K8HZTiGCUA — Mohan Babu M (@themohanbabu) January 13, 2022