Manchu Mohan Babu: Senior Actor Announces MB University In Tirupati, Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

Mohan Babu University: మంచు మోహన్‌ బాబు కీలక ప్రకటన

Published Thu, Jan 13 2022 12:17 PM | Last Updated on Thu, Jan 13 2022 12:35 PM

Manchu Mohan Babu Announces Mohan Babu University In Tirupati - Sakshi

Mohan Babu University: విభిన్నమైన పాత్రలు చేసుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచుకున్నారు సీనియర్‌ హీరో మంచు మోహన్ బాబు. విలన్‌ పాత్రల నుంచి హీరోగా ఎదిగి ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగాను సక్సెస్‌ అయ్యారు. ఇలా వెండితెరపై రాణిస్తున్నానే.. మరోవైపు విద్యారంగంలోకి ప్రవేశించారు. తిరుపతిలో ప్రసిద్ధ శ్రీ విద్యా నికేతన్‌ను అనే విద్యాసంస్థ స్థాపించి కులమతాలకు అతీతంగా విద్య అందిస్తున్నారు. తాజాగా మంచు మోహన్‌ బాబు మరో కీలక ప్రకటన చేశారు. “మోహన్ బాబు యూనివర్సిటీ” ప్రారంభిస్తున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. 

‘శ్రీ విద్యానికేతన్‌లో వేసిన విత్తనాలు ఇప్పుడు కల్పవృక్షంగా మారాయి. మీ 30 సంవత్సరాల విశ్వాసం, నా జీవిత లక్ష్యం ఇప్పుడు వినూత్న అభ్యాస విశ్వంలోకి చేరుకుంది. కృతజ్ఞతతో తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీని మీకు అందిస్తున్నాను. మీ ప్రేమే నా బలం, మీరు కూడా ఈ కలకి మద్దతు ఇస్తారని నేను విశ్వసిస్తున్నాను’అని మోహన్‌ బాబు ట్వీట్‌ చేశారు.

1993లో శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థను ప్రారంభించారు. ఆ తర్వాత్ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్, కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, ఫార్మసీ, పీజీ కాలేజ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ‘మోహన్ బాబు యూనివర్సిటీ’ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement