Sri Vidya Niketan
-
మంచు మోహన్‌బాబు కీలక ప్రకటన.. మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి
Mohan Babu University: విభిన్నమైన పాత్రలు చేసుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచుకున్నారు సీనియర్ హీరో మంచు మోహన్ బాబు. విలన్ పాత్రల నుంచి హీరోగా ఎదిగి ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగాను సక్సెస్ అయ్యారు. ఇలా వెండితెరపై రాణిస్తున్నానే.. మరోవైపు విద్యారంగంలోకి ప్రవేశించారు. తిరుపతిలో ప్రసిద్ధ శ్రీ విద్యా నికేతన్‌ను అనే విద్యాసంస్థ స్థాపించి కులమతాలకు అతీతంగా విద్య అందిస్తున్నారు. తాజాగా మంచు మోహన్ బాబు మరో కీలక ప్రకటన చేశారు. “మోహన్ బాబు యూనివర్సిటీ” ప్రారంభిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ‘శ్రీ విద్యానికేతన్‌లో వేసిన విత్తనాలు ఇప్పుడు కల్పవృక్షంగా మారాయి. మీ 30 సంవత్సరాల విశ్వాసం, నా జీవిత లక్ష్యం ఇప్పుడు వినూత్న అభ్యాస విశ్వంలోకి చేరుకుంది. కృతజ్ఞతతో తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీని మీకు అందిస్తున్నాను. మీ ప్రేమే నా బలం, మీరు కూడా ఈ కలకి మద్దతు ఇస్తారని నేను విశ్వసిస్తున్నాను’అని మోహన్ బాబు ట్వీట్ చేశారు. 1993లో శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థను ప్రారంభించారు. ఆ తర్వాత్ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్, కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, ఫార్మసీ, పీజీ కాలేజ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ‘మోహన్ బాబు యూనివర్సిటీ’ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. With the blessings of my parents, all my fans and well wishers, I am a humbled and honored to announce #MBU #MohanBabuUniversity pic.twitter.com/K8HZTiGCUA — Mohan Babu M (@themohanbabu) January 13, 2022 -
‘రెచ్చగొడితే.. అన్నయ్యకు చేసిన మోసాలు బయటపెడ్తా’
సాక్షి, తిరుపతి : తనని రెచ్చగొడితే అన్నయ్య.. దివంగత ఎన్టీఆర్‌కు చేసిన మోసాలు, జరిగిన ఘోరాలను బయటపెడ్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని నటుడు మోహన్‌బాబు హెచ్చరించారు. తన కుటుంబంపై చంద్రబాబు కక్షసాధింపు చర్యలు మొదలుపెట్టారని ఆయన ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ గురించి అడిగితే చెప్పే ధైర్యం లేక జోకర్ల చేత మాట్లాడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా జీవితం తెరచిన పుస్తకం.. ‘నా జీవితం తెరచిన పుస్తకం. నీది అవినీతి చరిత్ర. ఎనీటైం.. ఎనీ ప్లేస్.. నువ్వే నేరుగా నాతో చర్చకు రా.. నిజానికి నా స్థాయికి నువ్వు తగవు. మాకు వచ్చిన ప్రతి రూపాయికి లెక్కలు ఉన్నాయి. నువ్వు వసూలు చేసిన వేల కోట్లకు లెక్కలు చెప్పగలవా? 2013 సంవత్సరంలో అధికారంలో లేని చంద్రబాబును నా విద్యాసంస్థలకు తీసుకొచ్చాను. నా ఫంక్షన్స్, సినిమా ఓపనింగ్స్ ఎన్ని జరిగాయో అన్నింటిలోనూ ఆయన ఉన్నారు. కావాలంటే ఇంటర్నెట్లో చూసుకోండి. ట్విటర్, యూట్యూబుల్లో అవి వసూలు చేశావ్.. ఇవి వసూల్ చేశావ్ అంటూ నీ తరఫున కొంతమంది వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నారు. నువ్వు చేసిన వసూళ్ల గురించి కూడా వాళ్లను చెప్పమను. మాకు ఇచ్చిన విరాళాలకు లెక్కలున్నాయి. మరి నువ్వు వసూలు చేసిన వేల కోట్లకు లెక్కలున్నాయా? నీ అడుగులకు మడుగులొత్తితే సైలెంట్‌గా ఉంటావ్. లేకపోతే లేనిదానిని ఉన్నట్టుగా అపనిందలు వేయిస్తావా? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. పదవులు ఉంటాయి పోతాయి. డబ్బు సంపాదన ఎంతవరకు జాగ్రత్త.. అన్న ఎన్టీఆర్‌కు ఏమీ చేశావో అవన్నీ చెబితే బాగుండదు. నువ్వు చెయ్యగలిగితే ఒక్కటే చెయ్యగలవు. అది నన్ను చంపించడం అంతే. అంతకంటే ఏమీ చెయ్యలేవు. జీవితంలో భయపడాలి కానీ భయమే జీవితం కాకూడదు. నా జీవితం తెరచి ఉన్న పుస్తకం. అందులోని ప్రతి పేజీ, ప్రతి పేరా,ప్రతి వాక్యం, ప్రతి అక్షరమూ ఎవ్వరైనా చదువుకోవచ్చు. కానీ నీ జీవితం మూసి ఉన్న పస్తకం. అది తెరిస్తే ఏ అవినీతి బయటపడుతుందో అని నువ్వు వణికిపోతున్నావ్. నీ మోచీతి నీళ్లు తాగేవాళ్లు కాదు.. నువ్వు నేనే. ఎనీటైమ్, ఎనీ ప్లేస్, ఎనీ వేర్ చర్చకు సిద్ధం. తెలగుదేశం తమ్ముళ్లూ.. మీలో కూడా నన్ను అభిమానించే వాళ్లు చాలా మంది ఉన్నారు. మీరు కూడా పార్టీలో ఎందుకున్నారంటే అన్నయ్య మీద ఉన్న ప్రేమతో. అది మీ అభిమానం. నేను కాదనను. ఇక వద్దు మొదలుపెడితే చాలా దూరం పోతుంది. నాకు, నా కుటుంబానికి, నా విద్యాసంస్థలకు ఏమి జరిగినా దానికి అతడే (చంద్రబాబు) కారణం’ అని పేర్కొన్నారు. It starts now pic.twitter.com/LCaweTB3e4 — Mohan Babu M (@themohanbabu) March 23, 2019 ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చంద్రబాబు సర్కారు చెల్లించకపోవడంపై మోహన్‌బాబు విద్యార్థులతో కలిసి గత శుక్రవారం రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపిన విషయం తెలిసిందే. దివంగత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజురీయంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను అమలుచేయను, రద్దు చేస్తున్నానని చెప్పి ఎన్నికల్లోకి రాగలవా? అని ఈ సందర్భంగా ఆయన చంద్రబాబును నిలదీశారు. దీనికి కౌంటర్‌గా టీడీపీ మోహన్‌బాబు చెప్పెవన్నీ అసత్యాలని చెబుతూ.. ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా అనుకూల మీడియాతో ప్రచారం మొదలెట్టింది. దీనికి మోహన్ బాబు తనయుడు హీరో మంచు మనోజ్ కౌంటర్ ఇవ్వగా.. పచ్చదళం మరింత దాడిని పెంచింది. దీంతో చివరకు మోహన్‌బాబే రంగంలోకి దిగి కౌంటర్ ఇచ్చారు. చదవండి : టీడీపీకీ మంచు మనోజ్ సవాల్ -
కుటుంబరావు నిజం తెలుసుకో
-
మోహన్‌బాబు ఆరోపణలన్నీ అవాస్తవాలే
-
టీడీపీకీ మంచు మనోజ్ సవాల్
సాక్షి, తిరుపతి : నటుడు మోహన్‌బాబు విద్యాసంస్థలు నడుపుతున్నారా? లేక వ్యాపారం చేస్తున్నారా? అని విమర్శించిన టీడీపీనేత, ప్రణాళిక సంఘం ఉఫాధ్యక్షుడు కుటుంబరావుపై మంచు మనోజ్ ఫైర్ అయ్యారు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో తాము చెప్పిన అమౌంట్ తప్పని నిరూపిస్తే మొత్తం ఫీజురియింబర్స్‌మెంట్ వదులు కుంటామని సవాల్ విసిరారు. కుటుంబరావు ఆంధ్రప్రజల కుటుంబం తరఫున కాకుండా కేవలం నారా కుటుంబం తరఫున వకాల్తా పుచ్చుకోని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు మనోజ్ శుక్రవారం ఓ ప్రతికా ప్రకటనను విడుదల చేశారు. దానికి వారి విద్యాసంస్థలకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కింద కేటాయించాల్సిన బకాయిలకు సంబంధించిన ఆధారాలను జత చేశారు. ‘అయ్యా పెద్దమనిషి.. ఫిబ్రవరిలోనే తమ కాలేజీకి రావాల్సిన బకాయిలను ఐఏఎస్ రావత్‌కు లిఖిత పూర్వకంగా తెలియజేశాం. ఒక్కవారంలో పంపుతామని చెప్పారు. వారు చెప్పిన తేదీల్లో రానందున మరోసారి సమావేశమై డబ్బులు అందలేదని చెప్పాం. దానికీ కూడా సమాధానం రాకపోవడంతో మీడియా ముందుకు వచ్చాం. జ్ఞానభూమి స్కాలర్షిప్ స్టేట్మెంట్ 2018-19 అని ఒక కరపత్రం విద్యార్థులకు అందజేశారు. దానిలో మూడో విడత ఫీజు రియంబర్స్మెంట్ ఫిబ్రవరిలో అందజేస్తారని ఉంది. తొలి విడత బకాయికే దిక్కులేదు. రెండవ విడత పూర్తి కాలేదు. కానీ మూడో విడత అందజేస్తామని డబ్బా కొట్టుకున్నారు. ఓ పెద్దమనిషీ.. 2017-18 ఏడాదిలో రూ.2 కోట్ల పదహారు లక్షల బకాయి ఉంది. మీరు చదువుకున్న వ్యక్తి కాబట్టే అసలు నిజాన్ని దాచి పెట్టి మాట్లాడారు. వక్రబుద్ది మంతుడా.. ఈ కాలేజీ పెట్టింది ఎప్పుడు? ఎప్పటి నుంచి మా నాన్నగారు 25 శాతం ఫ్రీ ఎడ్యుకేషన్ కుల మతాలకు అతీతంగా అందిస్తున్నారు? మా విద్యానికేత డాక్యుమెంట్లు అందజేస్తాం. తెలుసుకో.. నోరు విప్పే ముందు కళ్లు విప్పి చూడు. 25 శాతం మీరిచ్చే సొమ్ముతో కాదు.. మా నాన్న సినిమాల్లో సంపాదించిన సొమ్ముతో అన్న నిజాన్ని తెలుసుకో. అనుమానం ఉంటే ఆదాయపు పన్ను పత్రాలు పరీక్షించుకో. ఇది ఓపెన్ చాలెంజ్. ఇది అడ్డదారి డబ్బు కాదు.. ప్రజలు మోసం చేసి సంపాదించిన సొమ్ము అంతకంటే కాదు. ఏదో పార్టీ తరఫున మాట్లాడుతున్నామని, పార్టీ టికెట్లు అడిగామని లేనిపోని నిందలు వేస్తున్నారు. నేను, మా అక్క రాజకీయ టికెట్టు కాదు కదా.. సినిమా టికెట్లు కూడా అడగలేదు’ అని మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చంద్రబాబు సర్కారు చెల్లించకపోవడంపై మోహన్‌బాబు విద్యార్థులతో కలిసి శుక్రవారం రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపిన విషయం తెలిసిందే. దివంగత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజురీయంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను అమలుచేయను, రద్దు చేస్తున్నానని చెప్పి ఎన్నికల్లోకి రాగలవా? అని ఈ సందర్భంగా ఆయన చంద్రబాబును నిలదీశారు. చదవండి: చంద్రబాబు పాపం పండింది! -
చంద్రబాబు పాపం పండింది!
చంద్రగిరి (చిత్తూరు జిల్లా) : నంబరు వన్ హీరోగా ఉన్న ఎన్టీఆర్.. నిద్రహారాలు మానేసి టీడీపీని స్థాపించి అధికారంలోకి వస్తే ఆయన సభ్యత్వాన్నే తొలగించిన వ్యక్తి చంద్రబాబు అని శ్రీ విద్యా నికేతన్ విద్యాసంస్థల అధినేత, సినీ నటుడు డాక్టర్ మోహన్‌బాబు మండిపడ్డారు. ఈ విద్యా సంస్థలకు సుమారు రూ.19 కోట్ల మేర ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చంద్రబాబు సర్కారు చెల్లించకపోవడంపై ఆయన శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బకాయిలపై పలుమార్లు బాబుకు ఉత్తరాలు రాసినా స్పందన లేకపోవడంతో ఉ.8.30 గంటలకు పది వేల మంది విద్యార్థులతో కలసి నిరసనకు దిగారు. తిరుపతిలో నిరసన చేపట్టడానికి నిర్ణయించినప్పటికీ పోలీసులు ఆయన్ను గృహనిర్బంధం చేయడానికి యత్నించారు. దీంతో మోహన్‌బాబు.. ‘మీరు మీ ఉద్యోగాలను చేయండి.. నా నిరసన మాత్రం ఆగదు’అని పోలీసులకు స్పష్టంచేశారు.తనయులు మంచు విష్ణు, మనోజ్‌లతో కలసి మోహన్‌బాబు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యా సంస్థ ల్లోని ఇంటర్నేషనల్ పాఠశాల నుంచి కాలినడకన ఇంజనీరింగ్ కళాశాల వద్దకు చేరుకున్నారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. నాలుగున్నరేళ్ల పాటు రైతులు, మహిళలు గుర్తురాలేదా ఎన్నికల వేళ ఫీజు రియంబర్స్మెంట్ నిధులను చంద్రబాబు దారి మళ్లించారని.. ఓట్ల కోసం వాటిని రైతులకు, మహిళలకు ఇచ్చారని ఆరోపించారు. అధికారంలో ఉన్న నాలుగున్నరేళ్లలో ఆయనకు రైతులు, మహిళలు గుర్తుకు రాలేదా అని మోహన్‌బాబు ప్రశ్నించారు. దివంగత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజురీయంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను అమలుచేయను, రద్దు చేస్తున్నానని చెప్పి ఎన్నికల్లోకి రాగలవా అని నిలదీశారు. చంద్రబాబు పాపం పండిందన్నారు. ‘ఎన్టీఆర్ స్థాపిం చిన టీడీపీలో నీ కన్నా ముందే నేను చేరాను చంద్రబాబు’.. అని తెలిపారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి పార్టీను లాక్కున్నాడని..ఎన్టీఆర్‌తో పాటు తన సభ్యత్వాన్ని తొలగించింది నిజం కాదా అన్నారు. బకాయిలు చెల్లించకుంటే కోర్టుకు.. శ్రీ విద్యా సంస్థల బకాయిలను చెల్లించకుంటే న్యాయ పోరాటానికైనా వెనుకాడబోనని మోహన్‌బాబు హెచ్చరించారు. రాష్ట్రంలో ఏ విద్యా సంస్థకు లేనంతగా తమ సంస్థలకు సుమారు రూ.19 కోట్ల మేర ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని.. వాటిని వెంటనే చెల్లించాలని కోరారు. -
పరిశోధనలకు పదును పెట్టాలి
చంద్రగిరి, న్యూస్‌లైన్: ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న భారత్‌లో శాస్త్రవేత్తలు పరిశోధనలకు పదును పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ శాస్త్రవేత్త, ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ పిలుపునిచ్చారు. శ్రీవిద్యానికేతన్ విద్యా సంస్థల్లో బుధవారం గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కస్తూరి రంగన్ మాట్లాడుతూ సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదిగే లక్ష్యంతో చదవాలని సూచించారు. భారత ప్రభుత్వం పరిశోధనలకు పెద్దపీట వేస్తోందని, శాస్త్రవేత్తలకు మంచి గుర్తింపు ఇస్తోందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం 300 మంది ఎంటెక్, ఎంసీఏ విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేశారు. అంతకుముందు శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల చైర్మన్, సినీనటుడు మోహన్‌బాబు, విద్యాసంస్థల సీఈవో మంచు విష్ణువర్ధన్‌బాబు, చెన్నైకి చెందిన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ డెరైక్టర్ ప్రొఫెసర్ నారాయణరావు మాట్లాడుతూ భావితరానికి వెలుగును అందించేందుకు పరిశోధనలు తప్పకుండా జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ ప్రొఫెసర్ శశిధర్, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల ప్రత్యేకాధికారి గోపాలరావు, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పీసీ కృష్ణమాచారి, సినీ నటుడు మంచు మనోజ్‌కుమార్, పలువురు విభాగాధిపతులు పాల్గొన్నారు.