నటుడు మోహన్‌బాబు విద్యాసంస్థలు నడుపుతున్నారా? లేక వ్యాపారం చేస్తున్నారా? అని విమర్శించిన టీడీపీనేత, ప్రణాళిక సంఘం ఉఫాధ్యక్షుడు కుటుంబరావుపై మంచు మనోజ్ ఫైర్ అయ్యారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో తాము చెప్పిన అమౌంట్ తప్పని నిరూపిస్తే మొత్తం ఫీజురియింబర్స్‌మెంట్ వదులు కుంటామని సవాల్ విసిరారు. కుటుంబరావు ఆంధ్రప్రజల కుటుంబం తరఫున కాకుండా కేవలం నారా కుటుంబం తరఫున వకాల్తా పుచ్చుకోని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు మనోజ్ శుక్రవారం ఓ ప్రతికా ప్రకటనను విడుదల చేశారు. దానికి వారి విద్యాసంస్థలకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద కేటాయించాల్సిన బకాయిలకు సంబంధించిన ఆధారాలను జత చేశారు.