Kutumbarao
-
టీడీపీ నేత కుటుంబరావు భూ కబ్జా
-
కుటుంబరావు భూ కబ్జా ఆటకట్టు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో.. అండదండలతో విజయవాడ నగర నడి»ొడ్డున రూ.200 కోట్ల విలువ చేసే 5.10 ఎకరాలను కబ్జా చేసిన రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు, ఆయన సోదరుల ఆట కట్టించింది రెవెన్యూ శాఖ. ఆ కుటుంబీకుల కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూమిని అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఏకకాలంలో పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టాన్ని, భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించి మోసానికి పాల్పడిన కుటుంబరావు, ఆయన సోదరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. చంద్రబాబు అండతో కబ్జా :ప్రతి సోమవారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘స్పందన’ కార్యక్రమంలో వచి్చన ఫిర్యాదు మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ చేపట్టిన విచారణలో కుటుంబరావు సోదరుల బండారం బట్టబయలైంది. దీనిపై ‘కుటుంబరావు ఖాతాలో రూ.200 కోట్లు’ శీర్షికన ఈ నెల 8న ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించగా.. రెవె న్యూ అధికారులు చేపట్టిన విచారణలో విస్మయకర వాస్తవాలు వెలుగు చూశాయి. కుటుంబరావు, ఆయన సోదరులు పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టాన్ని, భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించి విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డుకు సమీపంలోని భూమిని కబ్జా చేశారని నిర్ధారించారు. రెవెన్యూ, రైల్వే శాఖలను మోసం చేయడంతోపాటు న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించారని నిర్ధారించారు. దీన్ని అడ్డుకోవాల్సిన అప్పటి చంద్రబాబు ప్రభు త్వం ఉద్దేశపూర్వకంగా ఉదాసీనంగా వ్యవహరించి కుటుంబరావు కుటుంబానికి పూర్తిగా సహకరించింది. దాంతో ప్రస్తుత రూ.200 కోట్లకు పైగా ఉన్న 5.10 ఎకరాలను కుటుంబరావు కుటుంబం దర్జాగా ఆక్రమించి ప్రహరీ గోడతోపాటు దాని లోపల నిర్మాణాలు చేపట్టింది. జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవీలత శుక్రవారం రెవెన్యూ సిబ్బందితో వెళ్లి ఆ భూమిని పరిశీలించారు. వెంటనే ఆక్ర మణలను తొలగించాలని ఆదేశాలివ్వడంతో ప్రహ రీ గోడను, లోపలి నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూలి్చవేయించారు. ఆ భూమి ప్రభుత్వానికి చెందినదని పేర్కొంటూ బోర్డు ఏర్పాటు చేశారు. కబ్జాదారులపై క్రిమినల్ కేసులు.. కుటుంబరావు, ఆయన సోదరులు చట్టాలను ఉల్లంఘించి 5.10 ఎకరాల భూమిని కబ్జా చేసినట్టు విచారణలో వెల్లడైందని కృష్ణాజిల్లా జేసీ మాధవీలత చెప్పారు. కుటుంబరావు, ఆయన సోదరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తహసీల్దార్‌ను ఆదేశించామని ఆమె తెలిపారు. -
కుటుంబరావు కబ్జా చేసిన ప్రభుత్వ భూమి స్వాధీనం
-
కుటుంబరావు కబ్జా చేసిన ప్రభుత్వ భూమి స్వాధీనం
సాక్షి, విజయవాడ: గత చంద్రబాబు నాయుడుప్రభుత్వం అండదండలతో టీడీపీ నేతల కబ్జాల పర్వం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. విజయవాడ మధురానగర్‌లో టీడీపీ నేత, రాష్ట్ర్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు కుటుంబం కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని శుక్రవారం రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కబ్జా చేసిన స్థలానికి కుటుంబరావు సోదరుడు పెట్టిన బోర్డులను అధికారులు తొలగించారు. చదవండి: కుటుంబరావు ఖాతాలో రూ.200 కోట్లు కుటుంబరావు కుటుంబీకుల చేతుల్లో కబ్జాకు గురైన స్థలం గేటుకు జేసీ మాధవీలత నోటీసులు అంటించారు. టీడీపీ హయాంలో కుటుంబరావు కుటుంబీకులు రూ.200 కోట్లకు పైగా విలువ గల ప్రభుత్వ భూమిని చేజిక్కించుకున్నారు. న్యాయస్థానాలకు వాస్తవాలు తెలుపకుండా వివిధ శాఖలను మేనేజ్ చేసి భారీగా లబ్ధి పొందిన విషయం ఇటీవల ‘స్పందన’ కార్యక్రమానికి అందిన ఫిర్యాదుల ద్వారా వెలుగు చూసింది. నీతిమంతుడినని ప్రగల్భాలు పలికిన కుటుంబరావు కబ్జా వెలుగులోకి రావడంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. కలెక్టర్ ఆదేశాలతో రికార్డులు పరిశీలించి విచారణ జరిపినట్లు జేసీ మాధవీలత తెలిపారు. అర్బన్ ల్యాండ్ చట్టాన్ని ఉల్లంఘించి ప్రభుత్వ మిగులు భూమిని ఆక్రమించారని తేలిందన్నారు. రెవెన్యూ, రైల్వే అధికారులను తప్పుదారి పట్టించి పట్టాభూమిగా స్వాధీనం చేసుకున్నారన్నారు. కబ్జాదారులపై ఐపీసీ సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు పెట్టామని వెల్లడించారు. ఎవరైనా ఆ భూమిలోకి చొరబడాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని జేసీ హెచ్చరించారు. -
కుటుంబరావు కబ్జా చేసిన ప్రభుత్వ భూమి స్వాధీనం
-
టీడీపీ నేత కుటుంబరావు భూ కబ్జా
-
కుటుంబరావు ఖాతాలో రూ.200 కోట్లు
అనగనగా ఓ నక్క. ఆ నక్క అడవి నిబంధనలకు విరుద్ధంగా అపారంగా ఆహారం సంపాదించింది. అడవి రాజు దృష్టికి ఈ విషయం వెళితే తన ఆహారాన్ని లాక్కుంటాడని జిత్తుల మారి తనాన్ని ప్రదర్శించింది. ‘నా ఆహారంలో కొంత మీకిస్తాను..’ అని మరో జంతువుకు ఇచ్చింది. ఆ వెంటనే తగిన పరిహారం ఇవ్వాలని కోరింది. ఇచ్చినట్టే ఇచ్చి పరిహారం కోరేసరికి.. అది నీ ఆహారమే అని గ్యారంటీ ఏమిటి? అని ఆ జంతువు ప్రశ్నిస్తే నక్క పంచాయితీ పెట్టింది. ఇలాగైతే ‘నీ ఆహారమే నాకొద్ద’నిఆ జంతువు వెనక్కు ఇచ్చేసింది. దీంతో ఆ మిగులు ఆహారం అడవి రాజు బారిన పడకుండా నక్క తన మాయాజాలంతో ఎట్టకేలకు సొంతం చేసుకుంది. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు భూ వ్యవహారం అచ్చం ఈ కథను మరిపిస్తోంది. సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు, ఆయన సోదరులు ఒక తరానికి పైగా ప్రభుత్వ అధికారులను గుప్పిట్లో పెట్టుకుని అనేక ఎత్తులు వేసి రూ.200 కోట్లకు పైగా విలువ చేసే 5.10 ఎకరాల భూమిని చేజిక్కించుకున్న వైనమిది. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు పక్కన మధురానగర్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఈ భూమిని ఎట్టకేలకు వారి ఖాతాలో వేసుకున్నారు. న్యాయస్థానాలకు వాస్తవాలు తెలుపకుండా వివిధ శాఖలను మేనేజ్ చేసి భారీగా లబ్ధి పొందిన విషయం ఇటీవల ‘స్పందన’కు అందిన ఫిర్యాదుల ద్వారా వెలుగు చూసింది. 1976లో వచి్చన అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం కింద మిగులు భూమిని కోల్పోకుండా కుటుంబరావు కుటుంబం రైల్వే శాఖకు ఆ భూమిని ఇస్తూ రెవెన్యూ శాఖ సహాయంతో పరిహారం పొందాలని భావించింది. రైల్వే ఉద్యోగులకు స్టాఫ్ క్వార్టర్లు, ఎలక్ట్రికల్ ట్రెయినింగ్ స్కూల్ ఏర్పాటుకు విజయవాడలో స్థలం అవసరమైంది. అప్పటి విజయవాడ తాలూకా మాచవరం గ్రామ పరిధిలోని ’న్యూ టౌన్ సర్వే నంబర్ (ఎన్‌టిఎస్) 1 నుంచి 29 వరకు 22.19 ఎకరాలు (14 మందికి చెందిన పట్టా, ప్రభుత్వ భూమి) కావాలని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజనల్ సూపరింటెండెంట్ రెవెన్యూ విభాగానికి 1977 మార్చి 5వ తేదీన లేఖ రాశారు. 1979 నవంబరు 5న భూసేకరణకు రెవెన్యూ శాఖ అనుమతించింది. 1980 మార్చి 31న 22.19 ఎకరాల భూసేకరణకు డ్రాఫ్ట్ నోటిíÙకేషన్ (డీఎన్), డ్రాఫ్ట్ డిక్లరేషన్ (డీడీ) ప్రచురితమైంది. అయితే ఈ లోపే 18.58 ఎకరాలను సంబంధితుల నుంచి రైల్వే శాఖ తీసుకుంది. రైల్వేకి అప్పగించిన ఈ భూమిలో కుటుంబరావు కుటుంబానికి చెందిన భూమి కూడా ఉండేలా చూసుకున్నారు. మధురానగర్ సమీపంలో రైల్వే స్టేషన్, కేంద్రీయ విద్యాలయం, రైల్వే క్వార్టర్స్‌ను (వృత్తాల్లో ఉన్నవి) ఆనుకుని ఉన్న రైల్వే భూమి. కుటుంబరావు కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉన్న భూమి ఇదే.. నష్టపరిహారంలో తిరకాసు 1984 నుంచి 1996 వరకు నాలుగు విడతలుగా 18.58 ఎకరాల్లో 10.52 ఎకరాలకు నష్టపరిహారం లభించింది. మిగిలిన 8.06 ఎకరాల్లో కుటుంబరావు కుటుంబానికి చెందిన 5.10 ఎకరాలు ఉంది. ఈ భూమికి ఎన్వోసీ ఇస్తేనే పరిహారం ఇస్తామని చెప్పి అవార్డు పాస్ చేయలేదు. దీంతో భూమి సేకరణకు 1996 ఆక్టోబర్ 15న తిరిగి అనుమతి వచ్చేలా చక్రం తిప్పారు. అనంతరం రైల్వే శాఖ అవసరాల కోసం తమ భూమిని 1980లోనే తీసుకుని (ఎక్కువమంది రైతులే స్వచ్ఛందంగా రైల్వేకు స్వా«దీనం చేశారు) నష్టపరిహారం చెల్లించలేదని కుటుంబరావు, ఆయన సోదరులు సి.నాగేంద్ర, సి.ప్రవీణ్ కుమార్, సి.ప్రదీప్ కుమార్‌లు 1996లో హైకోర్టును ఆశ్రయించారు. ఎన్‌టిఎస్ నెం:1 లోని 5.10 ఎకరాలకు ఎన్వోసీ ఇవ్వనందునే కుటుంబరావు కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లించలేదని, మిగతా రైతులకు పరిహారం ఇచ్చామని రైల్వే శాఖ చెప్పింది. గత ప్రభుత్వ సహకారం.. భూమి హస్తగతం ఇది మిగులు భూమి కాబట్టే ఎన్వోసీ ఇవ్వడం లేదని ఆయా శాఖల అధికారులు కోర్టుకు స్పష్టంగా చెప్పి సాక్ష్యా ధారాలు అందించలేకపోయారు. దీంతో కుటుంబరావు కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు 1997లో డైరెక్షన్ ఇచి్చంది. ఇది మిగులు భూమి అని.. రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం అప్పీలుకు వెళ్లగా గత తీర్పును సమరి్థంచింది. దీంతో ఆ భూమి తమకు అవసరం లేదని, ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని 2012లో రైల్వే శాఖ కోర్టుకు తెలిపింది. సరిగ్గా అప్పుడే ఈ భూమి మాదేనన్న ప్రభుత్వం మిన్నకుండిపోయింది. ఈ పరిణామం వెనుక కుటుంబరావు కుటుంబ సభ్యులు వ్యవస్థలను మేనేజ్ చేసినట్లు యూఎల్సీ, రెవెన్యూ విభాగాల అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 2018 సెపె్టంబర్ 12న రైల్వే శాఖ 5.10 ఎకరాలను కుటుంబరావు కుటుంబ సభ్యులకు అప్పగించింది. ఈ వ్యవహారం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జరగాలి. కానీ రైల్వే శాఖే నేరుగా భూమిని వ్యక్తులకు ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీని వెనుక అప్పటి సీఎం చంద్రబాబు మౌఖిక ఆదేశాలు ఉన్నాయని ఆర్డీఓ, తహశీల్దారు కార్యాలయాల ఉద్యోగులు చెబుతున్నారు. భూమి తమ ఆధీనంలో ఉన్నట్టు ఏర్పాటు చేసిన బోర్డు ప్రభుత్వానికి నివేదిక : కలెక్టర్ మాచవరం పరిధిలోని ఎన్‌టిఎస్ ఒకటవ నంబరులోని 5.10 ఎకరాల భూమి ప్రభుత్వానికి చెందినది. ఆ భూమిని ఆక్రమించుకుని ప్రహరీ నిర్మించారని ’స్పందన’లో ఫిర్యాదులు వచ్చాయి. ఈ విషయంపై క్షుణ్ణంగా పరిశీలించి విచారించాలని ఆదేశించాం. అన్ని వివరాలు పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం. – ఎండీ ఇంతియాజ్, కృష్ణా జిల్లా కలెక్టర్ రెంటికీ చెడ్డ రేవడి రైల్వే శాఖ రైల్వే అధికారుల తప్పిదమో, పైనుంచి వచ్చిన ఒత్తిడో తెలియదు కాని ఆ శాఖ బాగా నష్టపోయింది. కుటుంబరావు కుటుంబానికి తిరిగి ఇచ్చిన భూమిలో రూ.13 కోట్లతో ఎలక్ట్రికల్ ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్ భవనాన్ని నిర్మించింది. వివాదాల నేపథ్యం దాన్ని కూల గొట్టింది. లీజుకింద కుటుంబరావుకు రూ.25 లక్షలు చెల్లించింది. 1996 నుంచి కోర్టు కేసులు, ఖర్చులు దీనికి అదనం. అంతా చేసి ఇపుడు భూమి తమకొద్దని అప్పగించింది. వేయి మందికిపైగా ఉన్న రైల్వే ఉద్యోగుల పిల్లలు కేంద్రీయ విద్యాలయానికి వెళ్లడానికి దారికూడా లేకుండా చేసింది. భూసేకరణ చట్టం 1984 సెక్షన్ 48(1), ఇన్వోకింగ్ ఆఫ్ అర్జన్సీ క్లాస్ సెక్షన్ 17 (4) ప్రకారం ఈ భూమి ప్రభుత్వానికి చెందినది. ఈ భూమిని తిరిగి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ బదలాయించడానికి వీల్లేదు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1976 ప్రకారం.. ప్రధాన నగరాలలో మేజర్ అయిన ఏ వ్యక్తికైనా 1,500 చదరపు మీటర్లు, లేదా 1,800 చదరపు గజాల భూమి మాత్రమే కలిగి ఉండాలి. అంతకు మించి ఉంటే మిగులు భూమిగా పరిగణిస్తారు. సెక్షన్ 10(3) ప్రకారం ఆ భూమి ప్రభుత్వపరం అవుతుంది. ఇటువంటి భూమికి నష్టపరిహారం చెల్లించాల్సి వస్తే అందుకు యూఎల్సీ అథారిటీ నుంచి నో అబ్జక్షన్ సరి్టఫికెట్ తప్పనిసరి. -
‘కార్వీ’కి నిధుల కానుక!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ(ఆర్టీజీఎస్) పేరిట గత మూడేళ్లుగా ప్రైవేట్ దోపిడీ భారీ ఎత్తున జరిగిపోయింది. రియల్ టైమ్ గవర్నెన్స్ అంటే ఏదో ఘనకార్యం అన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారం చేశారు. వాస్తవం ఏమిటంటే 1100 నెంబర్‌కు ప్రజలు ఫోన్‌చేసి, తమ సమస్యలు చెప్పుకోవచ్చు. దీన్నే ఆర్టీజీఎస్ అంటారు. ఆర్జీజీఎస్‌లో పనిచేస్తున్న సిబ్బంది ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారులకు ఫోన్ చేసి, టీడీపీ సర్కారు పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నారా? లేదా? అని అడుగుతారు. దాని ఆధారంగా పథకాల సంతృప్తి స్థాయిని లెక్కిస్తారు. దీనిపై ముఖ్యమంత్రి సమీక్షిస్తూ ఉంటారు. ఈ విధంగా అధికార తెలుగుదేశం పార్టీకి ఆర్టీజీఎస్ సర్వేలను నిర్వహించింది. మొత్తం మీద ఆర్టీజీఎస్ అనేది ఒక కాల్ సెంటర్‌గా పనిచేస్తోంది. ఇందుకుగాను గత మూడేళ్లుగా ఖజానా నుంచి ప్రైవేట్ సంస్థకు రూ.వందల కోట్లు దోచిపెట్టారు. అందులో నుంచి ముఖ్యమంత్రి తన వాటా కమీషన్లు దండుకున్నారు. సింగిల్ టెండర్‌కు ఆమోదం ఆర్టీజీఎస్ పేరుతో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావుకు బాగా కావాల్సిన కార్వీ సంస్థకు కాల్ సెంటర్ నిర్వహణను నామినేషన్‌పై అప్పగించేశారు. తొలుత కుటుంబరావు ఆధ్వర్యంలోనే పరిష్కార వేదిక పేరుతో 1100 కాల్ సెంటర్ ఏర్పాటైంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తొలుత 750 మందితో ఈ కాల్‌సెంటర్ నెలకొల్పారు. ఇందుకోసం టెండర్లను ఆహ్వానించగా కార్వీ సంస్థ ఒక్కటే ముందుకొచ్చింది. అలాంటప్పుడు నిబంధనల ప్రకారం ఆ టెండర్‌ను రద్దు చేసి, మళ్లీ కొత్తగా టెండర్లను ఆహ్వానించాలి. కానీ, ఆ నిబంధనను తుంగలో తొక్కారు. రూ.109.66 కోట్లకు కార్వీ సంస్థకు కాల్ సెంటర్ సర్వీసును కట్టబెట్టారు. ఈ మేరకు 2016 డిసెంబర్ 29న కార్వీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ తతంగం మొత్తం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సీహెచ్ కుటుంబరావు నడిపించారు. కార్వీ సంస్థ కళటుంబరావు బంధువుకు చెందినది కావడంతో సింగిల్ టెండర్‌కు 1100 కాల్ సెంటర్ సర్వీసును అప్పగించారు. ఆ తరువాత 2017 జూలై 29న పరిష్కార వేదిక, కాల్ సెంటర్ పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ఆదేశాలు, అనుమతులు లేకుండానే... సీఎం సూచన మేరకు కుటుంబరావు 1100 కాల్ సెంటర్‌ను విస్తరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మళ్లీ అదే కార్వీ సంస్థ నుంచి ప్రతిపాదనలు తీసుకుని రూ.185.73 కోట్లకు కాల్ సెంటర్ విస్తరణ సర్వీసులను కూడా అప్పగించేశారు. దీనికి ఆర్టీజీఎస్ అని పేరుపెట్టారు. తొలుత 750 మంది నుంచి ఉద్యోగులను తీసుకున్నారు. తర్వాత 2,064 మందికి పెంచారు. ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు, పరిపాలనాపరమైన అనుమతులు, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా కేవలం కుటుంబరావు నోటి మాటపై కార్వీ సంస్థకు తొలుత రూ.109.66 కోట్లు, తరువాత రూ.185.73 కోట్లు కలిపి మొత్తం రూ.295.39 కోట్లను అప్పనంగా దోచిపెట్టారు. -
టీడీపీలో యనమల వర్సస్ కుటుంబరావు
-
‘ఔను.. నేను బ్రోకర్‌నే’
సాక్షి, అమరావతి: తాను బ్రోకర్‌నే అని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, టీడీపీ నాయకుడు కుటుంబరావు అంగీకరించారు. ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద బుధవారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్లో తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మాట్లాడారు. తాను స్టాక్ బ్రోకర్‌గా 15 ఏళ్లు పని చేశానని, ఆ పని చేయడం తప్పు కాదన్నారు. తాను ఎప్పుడూ ఆర్థిక శాఖ సమావేశాల్లో పాల్గొనలేదని చెప్పారు. తాను 12 కమిటీల్లో సభ్యునిగా ఉన్నానని, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షునిగా తనకు ఆహ్వానం ఉన్న సమావేశాల్లోనే పాల్గొన్నానని తెలిపారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడిని విమర్శించడం సరికాదన్నారు. విజయసాయిరెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానన్నారు. -
‘కుటుంబరావు ఒక బ్రోకర్’
సాక్షి, విజయవాడ : కుటుంబరావు ఒక బ్రోకర్.. ఆయన నోటీసులకు భయపడమంటూ ఆర్టీఐ మాజీ కమిషనర్, బీజేపీ నేత విజయ్ బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ఎంపీల మీద బెట్టింగ్ కాయడానికి కుటుంబ రావుకి రూ.1.30 కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ప్రజల సొమ్ము తింటూ టీడీపీ తరఫున మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. కుటుంబరావు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవికి అపఖ్యాతి తెచ్చారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా బెట్టింగ్ గురించి మాట్లాడటం కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని.. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఆర్థిక నేరాలు చేసిన కుటుంబ రావుకు బీజేపీ నాయకుల గురించి మాట్లాడే అర్హత లేదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై కుటుంబ రావు వెంటనే క్షమాపణలు చెప్పాలని లేదంటే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. మరో బీజేపీ నాయకుడు శ్రీనివాస్ రాజు మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కేఏ పాల్ కుమ్మక్కయ్యి ఈ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టారని ఆరోపించారు. పాల్‌కు చంద్రబాబు డబ్బులిచ్చి మరి వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలిన అభ్యర్థులను నిలబెట్టారని పేర్కొన్నారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గతంలో చంద్రబాబు కోరిక మేరకు ఎన్నికల కమిషన్ ఎస్ ఎస్ సీ యాదవ్‌ను మార్చారని గుర్తు చేశారు. ఏబీ వెంకటేశ్వర రావు మీద చంద్రబాబుకు ఎందుకంత ప్రేమని ప్రశ్నించారు. ఆయన లేక పోతే చంద్రబాబు ఎన్నికలకు వెళ్లలేరా ఏంటి అంటూ ఎద్దేవా చేశారు. -
‘రెచ్చగొడితే.. అన్నయ్యకు చేసిన మోసాలు బయటపెడ్తా’
సాక్షి, తిరుపతి : తనని రెచ్చగొడితే అన్నయ్య.. దివంగత ఎన్టీఆర్‌కు చేసిన మోసాలు, జరిగిన ఘోరాలను బయటపెడ్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని నటుడు మోహన్‌బాబు హెచ్చరించారు. తన కుటుంబంపై చంద్రబాబు కక్షసాధింపు చర్యలు మొదలుపెట్టారని ఆయన ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ గురించి అడిగితే చెప్పే ధైర్యం లేక జోకర్ల చేత మాట్లాడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా జీవితం తెరచిన పుస్తకం.. ‘నా జీవితం తెరచిన పుస్తకం. నీది అవినీతి చరిత్ర. ఎనీటైం.. ఎనీ ప్లేస్.. నువ్వే నేరుగా నాతో చర్చకు రా.. నిజానికి నా స్థాయికి నువ్వు తగవు. మాకు వచ్చిన ప్రతి రూపాయికి లెక్కలు ఉన్నాయి. నువ్వు వసూలు చేసిన వేల కోట్లకు లెక్కలు చెప్పగలవా? 2013 సంవత్సరంలో అధికారంలో లేని చంద్రబాబును నా విద్యాసంస్థలకు తీసుకొచ్చాను. నా ఫంక్షన్స్, సినిమా ఓపనింగ్స్ ఎన్ని జరిగాయో అన్నింటిలోనూ ఆయన ఉన్నారు. కావాలంటే ఇంటర్నెట్లో చూసుకోండి. ట్విటర్, యూట్యూబుల్లో అవి వసూలు చేశావ్.. ఇవి వసూల్ చేశావ్ అంటూ నీ తరఫున కొంతమంది వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నారు. నువ్వు చేసిన వసూళ్ల గురించి కూడా వాళ్లను చెప్పమను. మాకు ఇచ్చిన విరాళాలకు లెక్కలున్నాయి. మరి నువ్వు వసూలు చేసిన వేల కోట్లకు లెక్కలున్నాయా? నీ అడుగులకు మడుగులొత్తితే సైలెంట్‌గా ఉంటావ్. లేకపోతే లేనిదానిని ఉన్నట్టుగా అపనిందలు వేయిస్తావా? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. పదవులు ఉంటాయి పోతాయి. డబ్బు సంపాదన ఎంతవరకు జాగ్రత్త.. అన్న ఎన్టీఆర్‌కు ఏమీ చేశావో అవన్నీ చెబితే బాగుండదు. నువ్వు చెయ్యగలిగితే ఒక్కటే చెయ్యగలవు. అది నన్ను చంపించడం అంతే. అంతకంటే ఏమీ చెయ్యలేవు. జీవితంలో భయపడాలి కానీ భయమే జీవితం కాకూడదు. నా జీవితం తెరచి ఉన్న పుస్తకం. అందులోని ప్రతి పేజీ, ప్రతి పేరా,ప్రతి వాక్యం, ప్రతి అక్షరమూ ఎవ్వరైనా చదువుకోవచ్చు. కానీ నీ జీవితం మూసి ఉన్న పస్తకం. అది తెరిస్తే ఏ అవినీతి బయటపడుతుందో అని నువ్వు వణికిపోతున్నావ్. నీ మోచీతి నీళ్లు తాగేవాళ్లు కాదు.. నువ్వు నేనే. ఎనీటైమ్, ఎనీ ప్లేస్, ఎనీ వేర్ చర్చకు సిద్ధం. తెలగుదేశం తమ్ముళ్లూ.. మీలో కూడా నన్ను అభిమానించే వాళ్లు చాలా మంది ఉన్నారు. మీరు కూడా పార్టీలో ఎందుకున్నారంటే అన్నయ్య మీద ఉన్న ప్రేమతో. అది మీ అభిమానం. నేను కాదనను. ఇక వద్దు మొదలుపెడితే చాలా దూరం పోతుంది. నాకు, నా కుటుంబానికి, నా విద్యాసంస్థలకు ఏమి జరిగినా దానికి అతడే (చంద్రబాబు) కారణం’ అని పేర్కొన్నారు. It starts now pic.twitter.com/LCaweTB3e4 — Mohan Babu M (@themohanbabu) March 23, 2019 ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చంద్రబాబు సర్కారు చెల్లించకపోవడంపై మోహన్‌బాబు విద్యార్థులతో కలిసి గత శుక్రవారం రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపిన విషయం తెలిసిందే. దివంగత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజురీయంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను అమలుచేయను, రద్దు చేస్తున్నానని చెప్పి ఎన్నికల్లోకి రాగలవా? అని ఈ సందర్భంగా ఆయన చంద్రబాబును నిలదీశారు. దీనికి కౌంటర్‌గా టీడీపీ మోహన్‌బాబు చెప్పెవన్నీ అసత్యాలని చెబుతూ.. ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా అనుకూల మీడియాతో ప్రచారం మొదలెట్టింది. దీనికి మోహన్ బాబు తనయుడు హీరో మంచు మనోజ్ కౌంటర్ ఇవ్వగా.. పచ్చదళం మరింత దాడిని పెంచింది. దీంతో చివరకు మోహన్‌బాబే రంగంలోకి దిగి కౌంటర్ ఇచ్చారు. చదవండి : టీడీపీకీ మంచు మనోజ్ సవాల్ -
కుటుంబరావు నిజం తెలుసుకో
-
మోహన్‌బాబు ఆరోపణలన్నీ అవాస్తవాలే
-
టీడీపీకీ మంచు మనోజ్ సవాల్
సాక్షి, తిరుపతి : నటుడు మోహన్‌బాబు విద్యాసంస్థలు నడుపుతున్నారా? లేక వ్యాపారం చేస్తున్నారా? అని విమర్శించిన టీడీపీనేత, ప్రణాళిక సంఘం ఉఫాధ్యక్షుడు కుటుంబరావుపై మంచు మనోజ్ ఫైర్ అయ్యారు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో తాము చెప్పిన అమౌంట్ తప్పని నిరూపిస్తే మొత్తం ఫీజురియింబర్స్‌మెంట్ వదులు కుంటామని సవాల్ విసిరారు. కుటుంబరావు ఆంధ్రప్రజల కుటుంబం తరఫున కాకుండా కేవలం నారా కుటుంబం తరఫున వకాల్తా పుచ్చుకోని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు మనోజ్ శుక్రవారం ఓ ప్రతికా ప్రకటనను విడుదల చేశారు. దానికి వారి విద్యాసంస్థలకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కింద కేటాయించాల్సిన బకాయిలకు సంబంధించిన ఆధారాలను జత చేశారు. ‘అయ్యా పెద్దమనిషి.. ఫిబ్రవరిలోనే తమ కాలేజీకి రావాల్సిన బకాయిలను ఐఏఎస్ రావత్‌కు లిఖిత పూర్వకంగా తెలియజేశాం. ఒక్కవారంలో పంపుతామని చెప్పారు. వారు చెప్పిన తేదీల్లో రానందున మరోసారి సమావేశమై డబ్బులు అందలేదని చెప్పాం. దానికీ కూడా సమాధానం రాకపోవడంతో మీడియా ముందుకు వచ్చాం. జ్ఞానభూమి స్కాలర్షిప్ స్టేట్మెంట్ 2018-19 అని ఒక కరపత్రం విద్యార్థులకు అందజేశారు. దానిలో మూడో విడత ఫీజు రియంబర్స్మెంట్ ఫిబ్రవరిలో అందజేస్తారని ఉంది. తొలి విడత బకాయికే దిక్కులేదు. రెండవ విడత పూర్తి కాలేదు. కానీ మూడో విడత అందజేస్తామని డబ్బా కొట్టుకున్నారు. ఓ పెద్దమనిషీ.. 2017-18 ఏడాదిలో రూ.2 కోట్ల పదహారు లక్షల బకాయి ఉంది. మీరు చదువుకున్న వ్యక్తి కాబట్టే అసలు నిజాన్ని దాచి పెట్టి మాట్లాడారు. వక్రబుద్ది మంతుడా.. ఈ కాలేజీ పెట్టింది ఎప్పుడు? ఎప్పటి నుంచి మా నాన్నగారు 25 శాతం ఫ్రీ ఎడ్యుకేషన్ కుల మతాలకు అతీతంగా అందిస్తున్నారు? మా విద్యానికేత డాక్యుమెంట్లు అందజేస్తాం. తెలుసుకో.. నోరు విప్పే ముందు కళ్లు విప్పి చూడు. 25 శాతం మీరిచ్చే సొమ్ముతో కాదు.. మా నాన్న సినిమాల్లో సంపాదించిన సొమ్ముతో అన్న నిజాన్ని తెలుసుకో. అనుమానం ఉంటే ఆదాయపు పన్ను పత్రాలు పరీక్షించుకో. ఇది ఓపెన్ చాలెంజ్. ఇది అడ్డదారి డబ్బు కాదు.. ప్రజలు మోసం చేసి సంపాదించిన సొమ్ము అంతకంటే కాదు. ఏదో పార్టీ తరఫున మాట్లాడుతున్నామని, పార్టీ టికెట్లు అడిగామని లేనిపోని నిందలు వేస్తున్నారు. నేను, మా అక్క రాజకీయ టికెట్టు కాదు కదా.. సినిమా టికెట్లు కూడా అడగలేదు’ అని మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చంద్రబాబు సర్కారు చెల్లించకపోవడంపై మోహన్‌బాబు విద్యార్థులతో కలిసి శుక్రవారం రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపిన విషయం తెలిసిందే. దివంగత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజురీయంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను అమలుచేయను, రద్దు చేస్తున్నానని చెప్పి ఎన్నికల్లోకి రాగలవా? అని ఈ సందర్భంగా ఆయన చంద్రబాబును నిలదీశారు. చదవండి: చంద్రబాబు పాపం పండింది! -
నా వాదన తప్పని నిరూపిస్తే క్షమాపణ చెబుతా
సాక్షి, రాజమహేంద్రవరం: అమరావతి బాండ్లు, పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ ఎత్తిపోతల పథకం, ఇళ్ల నిర్మాణాలు, రూ.18 లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు తదితర అంశాలపై చర్చకు రావాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మరోసారి సవాల్ విసిరారు. తన వాదన తప్పని నిరూపిస్తే బహిరంగంగా క్షమాపణ చెబుతానని పునరుద్ఘాటించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటాల్లోనే.. ఈ అంశాలపై స్పష్టత ఇవ్వండి... - అమరావతి బాండ్ల ద్వారా రూ.2 వేల కోట్ల అప్పుకు 10.36 శాతం వడ్డీ ఎలా ఇస్తారు? ఆరు నెలల ముందు 8 శాతం కన్నా ఎక్కువ వడ్డీకి రుణాలు తీసుకోకూడదని మీరే జీవో నంబర్ 68 జారీ చేశారు. మరి 10.36 శాతం వడ్డీకి ఎలా రుణం తీసుకుంటారు. అమరావతి బాండ్ల విషయంలో స్పష్టత ఇవ్వండి. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో చెప్పండి. అధిక వడ్డీకి బాండ్లు జారీ చేసే కన్నా బ్యాంక్ ఇచ్చే వడ్డీకి పావలా అధికంగా ఇచ్చినా రూ.2 వేల కోట్లను రాష్ట్ర ప్రజలు ఇస్తారు కదా. అధిక వడ్డీకి అప్పులు చేయడమే కాకుండా బీఎస్ఈలో గంట కొట్టేందుకు రూ.1.8 కోట్లు ఖర్చు చేస్తారా? - పోలవరం ప్రాజెక్టులో పనులు చేయకుండానే బిల్లులు తీసుకుంటున్నారని గతంలోనే చెప్పా. ఇప్పుడు అదే విషయంపై గొడవ జరుగుతోంది. పనులు లేకుండానే, ఎం బుక్స్‌లో రాయకుండానే బిల్లులు చేసుకున్నారు. - పట్టిసీమ ప్రాజెక్టులో 22% అదనపు చెల్లింపులు ఎలా చేస్తారు? వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో అదనపు చెల్లింపులు 5 శాతం కన్నా ఎక్కువ చేయలేదు. ఎత్తిపోతల పథకాల్లో చెల్లింపులపై చర్చించేందుకు సిద్ధమా? - పేదలకు అపార్ట్మెంట్లలో నిర్మించి ఇచ్చే ఇళ్ల చదరపు గజం ధర రూ.2,939ని మంత్రి నారాయణ చెబుతున్నారు. రాజమహేంద్రవరంలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరేమో చదరపు గజానికి రూ.1,500తో హై క్లాస్‌లో అపార్ట్మెంట్ నిర్మిస్తున్నారు. మరి పేదలకు ఇచ్చే ప్లాట్లకు అంత పెద్ద మొత్తం ఎలా ఇస్తున్నారో చెప్పండి. - విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సుల ద్వారా రూ.18 లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు వచ్చాయని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు చెబుతున్నారు. అవి ఎక్కడ ఉన్నాయో చూపించండి. - మీరు ప్రచురించిన ‘రాజా ఆఫ్ కరప్షన్’ పుస్తకంపై చర్చిద్దాం రండి. వైఎస్ ఎక్కడ అవినీతి చేశారో చూపించండి. అప్పు కోసం ప్రత్యేక విమానాల్లో వెళతారా? అప్పు కోసం ఆడీ కార్లలో, ప్రత్యేక విమానాల్లో వెళతారా? అలా వెళితే ఎవరైనా అప్పిస్తారా? సీఆర్డీఏను రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థగా కాదు, కంపెనీగా పేరు మార్చుకోండి. కుటుంబరావు చెప్పినట్లు మార్గదర్శిలో తప్పులేకపోతే డబ్బులు తిరిగి ఎందుకు ఇచ్చారు? కోర్టులో ఉన్న మార్గదర్శి కేసును మళ్లీ కదిలిస్తా. 30 ఏళ్లలో హెరిటేజ్ విలువ ఎప్పుడెప్పుడు పెరిగిందో నేను చెబుతా. ఆయా సమయాల్లో ఏఏ ప్రభుత్వ డెయిరీలు మూత పడ్డాయో కూడా చూపిస్తా. చర్చకు రావాలి’ అని కుటుంబరావుకు ఉండవల్లి సవాల్ విసిరారు. సమావేశంలో అశోక్‌కుమార్ జైన్, చెరుకూరి రామారావు, అల్లుబాబి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఏ చర్చకైనా సిద్ధం: ఉండవల్లి
సాక్షి, రాజమండ్రి: అమరావతి బాండ్ల విషయంపై గొడవ రాజుకుంది. ఇప్పటికే ప్రతిపక్షాలు అమరావతి బాండ్ల అవకతవకలపై ప్రశ్నిస్తుండగానే మాజీ ఎంపీ ఉండవల్లి ఆరుణ్ కుమార్ సవాల్‌తో మరింత రాజుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు విసిరిన సవాల్‌పై గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉండవల్లి స్పందించారు. ‘రాజా ఆఫ్ కరప్షన్’ పుస్తకంపై చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. కానీ ప్రజలకు బహిరంగ చర్చలపై నమ్మకం పోయిందని, ఒక గదిలో రెండు కెమెరాల సమక్షంలో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఆ ఒక్క పుస్తకంపైనే కాకుండా చాలా అంశాలపై కుటుంబరావు మాట్లాడాలని డిమాండ్ చేశారు. ప్రజలు కట్టే పన్నుల ద్వారా వచ్చిన డబ్బుతో కుటుంబరావు జీతం తీసుకుంటున్న విషయం గుర్తుపెట్టుకోవాలని సూచించారు. టీడీపీ నేతగా కుటుంబరావు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయనని ఉండవల్లి పేర్కొన్నారు. తప్పు చేస్తే నిర్భయంగా ఒప్పుకునే మనస్తత్వం తనదని తెలిపారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వ్యక్తిగత ఆరోపణలకు దిగటం సరికాదన్నారు. చంద్రబాబుపై ఈర్ష్యతో మాట్లాడుతున్నానడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన తనకు రాజకీయ ప్రత్యర్థిని కాదన్న విషయం తెలుసుకోవాలని సూచించారు. కుటుంబరావు తనను పేపర్ టైగర్ అంటున్నారని, కానీ రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి సభలో కనీసం ప్రస్తావించలేని టీడీపీ ఎంపీలు పేపర్ టైగర్లు కాదా అని ప్రశ్నించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదని ఉండవల్లి స్పష్టం చేశారు. -
‘ఉండవల్లి పేపర్ టైగర్, యాక్షన్ టైగర్ కాదు’
సాక్షి, అమరావతి : ఉండవల్లి లాంటి వారంతా పేపర్ టైగర్లు, యాక్షన్ టైగర్లు కాదని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఎద్దేవా చేశారు. అమరావతి బాండ్లపై ఉండవల్లి చాలా హేళనగా మాట్లాడటం దారుణమన్నారు. 2 వేల కోట్ల రూపాయల బాండ్లు ఇష్యూ కావడంతో చాలా మందికి ఈర్ష్య, ద్వేషాలు పెరిగాయని.. అందుకే ఇలా చవకబారు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము తెచ్చిన వడ్డీ రేటు కన్నా తక్కువ వడ్డీ రేటుకు ఎవరు బాండ్లు తెచ్చినా అరేంజ్డ్ ఫీజు భారీగా ఇస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం 2 లక్షల కోట్ల అప్పు చేసిందని ఉండవల్లి ఆరోపించడం తగదన్నారు. ప్రజలకు ఆర్థిక అంశాల మీద ఉండదనుకొని... అబద్ధాలతో వారిని పక్కదోవ పట్టించాలని చూస్తున్నారని కుటుంబరావు ఆరోపించారు. సెబీ కింద గుర్తింపు పొందిన సంస్థలే బిడ్డింగ్‌లో కోట్ చేశాయని స్పష్టం చేశారు. -
రిప్లై ఇవ్వకపోతే పరువు నష్టం దావా వేస్తా
అమరావతి: తనను దూషించిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజులకు నోటీసులు పంపానని, రిప్లై ఇవ్వకపోతే పరువు నష్టం దావా వేస్తానని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు చెప్పారు. విలేకరులతో మాట్లాడుతూ..ప్రత్యేక ప్యాకేజీ తాము అడగలేదని, అందులో 90:10 నిష్పత్తిలో నిధులు అడిగినట్లు ఎక్కడుందో బీజేపీ నేతలు చెప్పాలన్నారు. సాగరమాల ప్రాజెక్టులో ఇప్పటి వరకు రూ.5 కోట్లు మాత్రమే ఇచ్చారని, కానీ రూ.1800 కోట్లు ఇచ్చినట్లు అబద్ధం చెబుతున్నారని ఆరోపించారు. సాగరమాల ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం రూ.3 వేల కోట్లు ఖర్చు పెట్టిందని అన్నారు. బీజేపీ జుమ్లా పార్టీ, జోకర్స్ పార్టీ అని ఎద్దేవా చేశారు. ఏపీకి ఇచ్చింది రూ.82 కోట్లు మాత్రమేనని తెలిపారు. రూ.12 వేల కోట్ల విలువ చేసే ప్రాజెక్టులు ప్రత్యేక ప్యాకేజీ కంటే ముందే ఇచ్చినవని, రూ.17 వేల కోట్ల విలువ చేసే ప్రాజెక్టులు అదనపు ప్రాజెక్టుల ప్రతిపాదనలని వివరించారు. ఎన్డీఏ నుంచి బయటికొచ్చాక ప్రధాని నోరు ఎందుకు విప్పడం లేదని ప్రశ్నించారు. బీజేపీ నేతలవి అబద్ధాలు కాబట్టే ప్రధాని మాట్లాడటం లేదని విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు, లోకేష్‌లు ఎవరి దగ్గరకు బ్రోకర్లను పంపారో జీవీఎల్ నరసింహారావు చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రమే మా దగ్గరకు కన్సల్టన్సీ బ్రోకర్లను రిఫైనరీ ప్రాజెక్ట్ కోసం పంపారని ఆరోపించారు. -
ఆ స్కాం బయటకు రాగానే టీడీపీ నేతలు..!
సాక్షి, విజయవాడ : ఎయిర్ ఏషియా స్కాంలో వాస్తవాలు త్వరలో వెలుగులోకి వస్తాయని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. దర్యాప్తు సంస్థలు తమ పనిని తాము చేసుకుపోతాయని చెప్పారు. కుటుంబరావు షేర్ మార్కెట్ నిపుణుడు.. కాగా ఆయనను తీసుకొచ్చి ప్రణాళికా సంఘంలో పెట్టారని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయాలు మానుకొని అభివృద్ధికి పాటుపడాలని జీవీఎల్ హితవు పలికారు. ఏపీ ప్రభుత్వం నిరాధార ఆరోపణలు చేస్తుదంటూ విమర్శించారు. ‘ఎయిర్ ఏషియా కుంభకోణం బయటకు రాగానే టీడీపీ నేతలు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు. ఈ స్కాంలో సింగపూర్‌కు చెందిన వారు అరెస్టయ్యారు. అయినా టీడీపీ నేతల ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మాకు లేదు. ఫోన్ ట్యాపింగ్‌లు చేసే నీచ సంస్కృతి టీడీపీదే. చంద్రబాబు ప్రభుత్వమే కన్నా లక్ష్మీనారాయణ ఫోన్‌ను ట్యాప్ చేస్తోంది. దీనికి సంబంధించిన ఆధారాలు మా వద్ద ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వం అభద్రతా భావంలో ఉంది. చంద్రబాబు బెదిరింపులకు మేం భయపడం. మీ దగ్గర ఏ ఆధారాలుంటే అవి బయటపెట్టండి. మేం సమాధానం చెబుతాం. అయినా కుంభకోణాలు బయటపెట్టడానికి ముహుర్తాలు ఎందుకు అని చంద్రబాబును ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలను సీఎం చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారని, టీడీపీ ప్రభుత్వం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తోందంటూ ధ్వజమెత్తారు. అవినీతి, అక్రమాల్లో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. కృష్ణపట్నం ఇండస్ట్రియల్ హబ్‌కి ఇప్పటివరకు రాష్ట్రం భూమి ఇవ్వలేదు. అభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వం ఏపీకి నిధులిచ్చిందని.. అయితే అడ్డగోలుగా ఖర్చు చేయడం సబబు కాదన్నారు. కాగా, ‘చంద్రబాబును పట్టుకుంటే మనకు కావాల్సిన పని అయిపోతుంది. ఆయన మనిషే కేంద్రంలో విమానాయాన శాఖ మంత్రి. అసలు దారిలో వెళ్తే చాలా సమయం పడుతుంది. అడ్డదారిలో వెళ్లి పని చేయించుకోవాలి. చంద్రబాబును మన వైపు తిప్పుకుంటే ఏ పనైనా పూర్తవుతుందని గతంలో అశోక్ గజపతి రాజే చెప్పారన్న’ ఆడియో టేపులు సీబీఐ చేతికి చిక్కిన విషయం తెలిసిందే. -
టీడీపీలో ఎయిర్ ఏషియా కలవరం
సాక్షి, అమరావతి : ఎయిర్ ఏషియా స్కాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావనకు రావడంతో టీడీపీలో కలవరం మొదలైంది. ఆ పార్టీ నాయకుడు ఆశోక్ గజపతి రాజు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఎయిర్ ఏషియా ప్రతినిధుల మధ్య జరిగిన సంభాషణల ఆడియో టేపు సీబీఐ చేతికి చిక్కిన సంగతి తెలిసిందే. ఆ టేపులో చంద్రబాబు మనిషే కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు.. ఆయన్ని పట్టుకుంటే మనకు కావాల్సిన పని అవుతుందని వారి మధ్య సంబాషణ నడిచింది. దీంతో సమస్యను పక్కదోవ పట్టించడానికి టీడీపీ రంగం సిద్ధం చేసింది. టీడీపీ గతంలో ఓటుకు కోట్లులో విషయంపై వివరణ ఇవ్వకుండా సమస్యను దాటవేసే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఈ స్కాంలో టీడీపీ నాయకుల పేర్లు రావడంపై ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఎదురుదాడికి దిగారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తమ నేతల గురించి వచ్చిన ఆరోపణలపై స్పందించకుండా ఎయిర్ ఏషియాలో స్కాం నిజమైతే కేంద్రమంత్రులంతా డబ్బులు తిన్నట్టే అంటూ వింత రాగం అందుకున్నారు. చంద్రబాబు ప్రస్తావన ఎలా బయటకి వచ్చిందంటూ ప్రశ్నించారు. భారత్‌లో ఫోన్ ట్యాపింగ్ అనుమతిస్తున్నారా అంటూ టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఎవరో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నవి బయటకెలా వచ్చాయన్నారు. ఈ అంశాన్ని కేంద్రానికి ముడిపెడుతూ.. ప్రతిపక్షాల ఫోన్లు ట్యాపింగ్ చేసి కేంద్రం నియంత పాలన చేస్తుందని కుటుంబరావు ఆరోపించారు. -
రాజధాని ప్రాంతం రైస్ భౌల్ కాదు
-
రాజధాని ప్రాంతం రైస్ బౌల్ కాదు
హైదరాబాద్: రాజధాని ప్రాంతం రైస్ బౌల్ కాదని ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు అన్నారు. శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదిక తప్పు అని ఆయన అన్నారు. అక్కడ పండే పంటలపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. చక్కటి ఆహార పంటలు పండే ప్రాంతాలను రాజధాని భూములుగా సేకరించి పొరపాటు చేస్తున్నారని శివరామకృష్ణన్ పేర్కొంటూ ఓ వ్యాసం రాసిన విషయం తెలిసిందే. దీనిపై కుటుంబరావు స్పందిస్తూ రాజధాని ప్రాంతంలో పండే పంటలపై జాతీయ స్థాయిలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. బహుళ పంటు పండే వ్యవసాయం లాభసాటిగా ఉంటే 75శాతం మంది రైతులు ఎందుకు తమ భూములను కౌలుకు ఇస్తారని ప్రశ్నించారు. చిన్న సమస్యలు పెద్దవిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. -
అక్టోబర్ 2 నుంచి రుణమాఫీ: కుటుంబరావు
హైదరాబాద్: అక్టోబర్ 1 తేదికల్లా రుణమాఫీ లబ్దిదారుల జాబితాను ప్రకటిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తెలిపారు. ఈనెల 15 తేదిలోగా రుణాల వివరాల్ని బ్యాంకర్లు అందచేస్తామన్నాయని ఆయన మీడియాకు వెల్లడించారు. రుణ మాఫీ అంశంలో గ్రీవెన్స్ కమిటీ 24 గంటలు పనిచేస్తోందన్నారు. అక్టోబర్ 2 తేది నుంచి రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు.