సాక్షి, అమరావతి : ఎయిర్ ఏషియా స్కాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావనకు రావడంతో టీడీపీలో కలవరం మొదలైంది. ఆ పార్టీ నాయకుడు ఆశోక్ గజపతి రాజు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఎయిర్ ఏషియా ప్రతినిధుల మధ్య జరిగిన సంభాషణల ఆడియో టేపు సీబీఐ చేతికి చిక్కిన సంగతి తెలిసిందే. ఆ టేపులో చంద్రబాబు మనిషే కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు.. ఆయన్ని పట్టుకుంటే మనకు కావాల్సిన పని అవుతుందని వారి మధ్య సంబాషణ నడిచింది. దీంతో సమస్యను పక్కదోవ పట్టించడానికి టీడీపీ రంగం సిద్ధం చేసింది.
టీడీపీ గతంలో ఓటుకు కోట్లులో విషయంపై వివరణ ఇవ్వకుండా సమస్యను దాటవేసే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఈ స్కాంలో టీడీపీ నాయకుల పేర్లు రావడంపై ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఎదురుదాడికి దిగారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తమ నేతల గురించి వచ్చిన ఆరోపణలపై స్పందించకుండా ఎయిర్ ఏషియాలో స్కాం నిజమైతే కేంద్రమంత్రులంతా డబ్బులు తిన్నట్టే అంటూ వింత రాగం అందుకున్నారు. చంద్రబాబు ప్రస్తావన ఎలా బయటకి వచ్చిందంటూ ప్రశ్నించారు. భారత్‌లో ఫోన్ ట్యాపింగ్ అనుమతిస్తున్నారా అంటూ టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఎవరో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నవి బయటకెలా వచ్చాయన్నారు. ఈ అంశాన్ని కేంద్రానికి ముడిపెడుతూ.. ప్రతిపక్షాల ఫోన్లు ట్యాపింగ్ చేసి కేంద్రం నియంత పాలన చేస్తుందని కుటుంబరావు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment