రాజధాని ప్రాంతం రైస్ బౌల్ కాదు | capital city land is not a rice bowl: kutumbarao | Sakshi
Sakshi News home page

రాజధాని ప్రాంతం రైస్ బౌల్ కాదు

Published Thu, Apr 23 2015 2:46 PM | Last Updated on Sun, Sep 3 2017 12:45 AM

capital city land is not a rice bowl: kutumbarao

హైదరాబాద్: రాజధాని ప్రాంతం రైస్ బౌల్ కాదని ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు అన్నారు. శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదిక తప్పు అని ఆయన అన్నారు. అక్కడ పండే పంటలపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. చక్కటి ఆహార పంటలు పండే ప్రాంతాలను రాజధాని భూములుగా సేకరించి పొరపాటు చేస్తున్నారని శివరామకృష్ణన్ పేర్కొంటూ ఓ వ్యాసం రాసిన విషయం తెలిసిందే. దీనిపై కుటుంబరావు స్పందిస్తూ రాజధాని ప్రాంతంలో పండే పంటలపై జాతీయ స్థాయిలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. బహుళ పంటు పండే వ్యవసాయం లాభసాటిగా ఉంటే 75శాతం మంది రైతులు ఎందుకు తమ భూములను కౌలుకు ఇస్తారని ప్రశ్నించారు. చిన్న సమస్యలు పెద్దవిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement