
అక్రమ కట్టడాలను తొలగిస్తున్న అధికారులు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో.. అండదండలతో విజయవాడ నగర నడి»ొడ్డున రూ.200 కోట్ల విలువ చేసే 5.10 ఎకరాలను కబ్జా చేసిన రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు, ఆయన సోదరుల ఆట కట్టించింది రెవెన్యూ శాఖ. ఆ కుటుంబీకుల కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూమిని అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఏకకాలంలో పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టాన్ని, భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించి మోసానికి పాల్పడిన కుటుంబరావు, ఆయన సోదరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
చంద్రబాబు అండతో కబ్జా :ప్రతి సోమవారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘స్పందన’ కార్యక్రమంలో వచి్చన ఫిర్యాదు మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ చేపట్టిన విచారణలో కుటుంబరావు సోదరుల బండారం బట్టబయలైంది. దీనిపై ‘కుటుంబరావు ఖాతాలో రూ.200 కోట్లు’ శీర్షికన ఈ నెల 8న ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించగా.. రెవె న్యూ అధికారులు చేపట్టిన విచారణలో విస్మయకర వాస్తవాలు వెలుగు చూశాయి. కుటుంబరావు, ఆయన సోదరులు పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టాన్ని, భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించి విజయవాడ బీఆర్‌టీఎస్ రోడ్డుకు సమీపంలోని భూమిని కబ్జా చేశారని నిర్ధారించారు. రెవెన్యూ, రైల్వే శాఖలను మోసం చేయడంతోపాటు న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించారని నిర్ధారించారు. దీన్ని అడ్డుకోవాల్సిన అప్పటి చంద్రబాబు ప్రభు త్వం ఉద్దేశపూర్వకంగా ఉదాసీనంగా వ్యవహరించి కుటుంబరావు కుటుంబానికి పూర్తిగా సహకరించింది. దాంతో ప్రస్తుత రూ.200 కోట్లకు పైగా ఉన్న 5.10 ఎకరాలను కుటుంబరావు కుటుంబం దర్జాగా ఆక్రమించి ప్రహరీ గోడతోపాటు దాని లోపల నిర్మాణాలు చేపట్టింది. జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవీలత శుక్రవారం రెవెన్యూ సిబ్బందితో వెళ్లి ఆ భూమిని పరిశీలించారు. వెంటనే ఆక్ర మణలను తొలగించాలని ఆదేశాలివ్వడంతో ప్రహ రీ గోడను, లోపలి నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూలి్చవేయించారు. ఆ భూమి ప్రభుత్వానికి చెందినదని పేర్కొంటూ బోర్డు ఏర్పాటు చేశారు.
కబ్జాదారులపై క్రిమినల్ కేసులు..
కుటుంబరావు, ఆయన సోదరులు చట్టాలను ఉల్లంఘించి 5.10 ఎకరాల భూమిని కబ్జా చేసినట్టు విచారణలో వెల్లడైందని కృష్ణాజిల్లా జేసీ మాధవీలత చెప్పారు. కుటుంబరావు, ఆయన సోదరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తహసీల్దార్‌ను ఆదేశించామని ఆమె తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment