కుటుంబరావు కబ్జా చేసిన ప్రభుత్వ భూమి స్వాధీనం | AP Government Hands Over Kutumbarao Grabs Land In Madhura Nagar | Sakshi
Sakshi News home page

కుటుంబరావు కబ్జా చేసిన ప్రభుత్వ భూమి స్వాధీనం

Published Fri, Sep 13 2019 3:48 PM | Last Updated on Fri, Sep 13 2019 4:41 PM

AP Government Hands Over Kutumbarao Grabs Land In Madhura Nagar - Sakshi

సాక్షి, విజయవాడ: గత చంద్రబాబు నాయుడుప్రభుత్వం అండదండలతో టీడీపీ నేతల కబ్జాల పర్వం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. విజయవాడ మధురానగర్‌లో టీడీపీ నేత, రాష్ట్ర్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు కుటుంబం కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని శుక్రవారం రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కబ్జా చేసిన స్థలానికి కుటుంబరావు సోదరుడు పెట్టిన బోర్డులను అధికారులు తొలగించారు.

చదవండి: కుటుంబరావు ఖాతాలో రూ.200 కోట్లు

కుటుంబరావు కుటుంబీకుల చేతుల్లో కబ్జాకు గురైన స్థలం గేటుకు జేసీ మాధవీలత నోటీసులు అంటించారు. టీడీపీ హయాంలో కుటుంబరావు కుటుంబీకులు రూ.200 కోట్లకు పైగా విలువ గల ప్రభుత్వ భూమిని చేజిక్కించుకున్నారు. న్యాయస్థానాలకు వాస్తవాలు తెలుపకుండా వివిధ శాఖలను మేనేజ్‌ చేసి భారీగా లబ్ధి పొందిన విషయం ఇటీవల ‘స్పందన’ కార్యక్రమానికి అందిన ఫిర్యాదుల ద్వారా వెలుగు చూసింది. నీతిమంతుడినని ప్రగల్భాలు పలికిన కుటుంబరావు కబ్జా వెలుగులోకి రావడంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

కలెక్టర్‌ ఆదేశాలతో రికార్డులు పరిశీలించి విచారణ జరిపినట్లు జేసీ మాధవీలత తెలిపారు. అర్బన్‌ ల్యాండ్‌ చట్టాన్ని ఉల్లంఘించి ప్రభుత్వ మిగులు భూమిని ఆక్రమించారని తేలిందన్నారు. రెవెన్యూ, రైల్వే అధికారులను తప్పుదారి పట్టించి పట్టాభూమిగా స్వాధీనం చేసుకున్నారన్నారు. కబ్జాదారులపై ఐపీసీ సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు పెట్టామని వెల్లడించారు. ఎవరైనా ఆ భూమిలోకి చొరబడాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని జేసీ హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement