
సాక్షి, అమరావతి: తాను బ్రోకర్‌నే అని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, టీడీపీ నాయకుడు కుటుంబరావు అంగీకరించారు. ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద బుధవారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మాట్లాడారు. తాను స్టాక్ బ్రోకర్‌గా 15 ఏళ్లు పని చేశానని, ఆ పని చేయడం తప్పు కాదన్నారు.
తాను ఎప్పుడూ ఆర్థిక శాఖ సమావేశాల్లో పాల్గొనలేదని చెప్పారు. తాను 12 కమిటీల్లో సభ్యునిగా ఉన్నానని, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షునిగా తనకు ఆహ్వానం ఉన్న సమావేశాల్లోనే పాల్గొన్నానని తెలిపారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడిని విమర్శించడం సరికాదన్నారు. విజయసాయిరెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment