ఏపీలో రాజ్యాంగ విరుద్ధ పాలన సాగుతోంది: విజయసాయిరెడ్డి | YSRCP MP Vijaya Sai Reddy Serious Comments ON TDP | Sakshi
Sakshi News home page

ఏపీలో రాజ్యాంగ విరుద్ధ పాలన సాగుతోంది: విజయసాయిరెడ్డి

Published Mon, Dec 16 2024 11:41 AM | Last Updated on Mon, Dec 16 2024 3:28 PM

YSRCP MP Vijaya Sai Reddy Serious Comments ON TDP

సాక్షి,ఢిల్లీ: ఏపీలో రాజ్యాంగ విరుద్ధ పాలన సాగుతోందని, కూటమి ప్రభుత్వం రాజ్యాంగాన్ని అసలు పట్టించుకోవడం లేదని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. సోమవారం(డిసెంబర్‌ 16) రాజ్యాంగంపై రాజ్యసభలో జరిగిన చర్చలో విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆదేశసూత్రాలను ఉల్లంఘిస్తున్న టీడీపీ ప్రభుత్వం రూ.86 వేల కోట్లు దారి మళ్లించిందని ఆరోపించారు. తామెప్పుడూ నిధులను మళ్లించలేదన్నారు. అనేక స్కీమ్‌ల ద్వారా పేద ప్రజలకు నిధులు చేరవేశామని గుర్తు చేశారు.

రాజ్యసభలో విజయసాయిరెడ్డి పూర్తి స్పీచ్‌..

  • టీడీపీ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది
  • 86 వేల కోట్ల రూపాయలు దారి మళ్ళించారని తప్పుడు ఆరోపణలు చేశారు
  • టీడీపీ లోక్‌సభ తప్పుడు ప్రచారం చేసింది
  • మేము ఎప్పుడు ఎక్కడ నిధులు మళ్లించలేదు
  • విద్యా దీవెన, వసతి దీవెన, కళ్యాణమస్తు, పెన్షన్ కానుక, అమ్మ ఒడి, చేయూత, జగనన్న తోడు  ద్వారా   కోట్లాదిమంది ఎస్సీ ఎస్టీలు , బీసీలు ప్రయోజనం పొందారు
  • విజయవంతంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లు అమలు చేసింది
  • టీడీపీ రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాలను ఉల్లంఘిస్తోంది
  • మేము ఎక్కడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించలేదు
  • చట్టబద్ధంగా పోలీసులు చంద్రబాబునాయుడును అరెస్టు చేశారు
  • కోర్టు చంద్రబాబు నాయుడును రిమాండ్ చేసింది
  • ప్రభుత్వం కేవలం కేసు ఫైల్ చేసింది
  • కేసు పెట్టడం రాజ్యాంగ విరుద్ధం ఎలా అవుతుంది
  • రాజ్యాంగ విరుద్ధం అయితే కోర్టు ఆయనను రిమాండ్ ఎందుకు పంపుతారు
  • స్టిల్స్ స్కాంలో 370 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు
  • షెల్ కంపెనీల ద్వారా ఈ డబ్బును స్వాహా చేశారు
  • ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధం  
  • రైతు భరోసాను అమలు చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధం
  • ఇంగ్లీష్ మీడియంను నిషేధించారు
  • ప్రజలకు కాకుండా కేవలం బంధువుల కోసమే  దీన్ని అమలు చేస్తున్నారు
  • ఎన్టీఆర్‌ను  వెన్నుపోటుపోవడమే రాజ్యాంగ విరుద్ధం
  • ఆర్టికల్ 46 ప్రకారం అణగారిన వర్గాలకు  విద్యను ప్రోత్సహించాలని ఉంది
  • మేము అమలు చేసిన పథకాలను టీడీపీ ఆపివేసింది
  • కులం మతం ఆధారంగా ప్రజలను తీయడమే రాజ్యాంగ విరుద్ధం
  • ఇది టీడీపీ కొనసాగిస్తుంది
  • నాటి కేసులను ఉపసంహరించుకుంటున్నారు..ఇది రాజ్యాంగ విరుద్దమే
  • ముఖ్యమంత్రి తనపై కేసులను విత్ డ్రా చేసుకుంటున్నారు
  • అధికారం ఉంది కదా అని కేసులను విత్ డ్రా చేసుకుంటున్నారు
  • మహిళలపై నేరాలు పెరిగిపోతున్న పట్టించుకోవడం లేదంటే అది రాజ్యాంగ విరుద్ధమే
  • విజయవాడలో వరద నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది
  • 24 గంటల సమయం ఉందని వరదలు వదిలేయడంతో అనేకమంది చనిపోయారు
  • ప్రజలను కాపాడకుండా వారిని గాలికి వదిలేసారు

కాగా, సోమవారం ఉదయం రాజ్యసభలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీలో కూటమి నేతల ప్రలోభాలపై ప్రశ్నల వర్షం కురిపించారు విజయసాయిరెడ్డి. వైఎస్సార్‌సీపీ నేతలను కుట్రపూరితంగా, ప్రలోభాలకు గురి చేసి తమ పార్టీలోకి లాక్కురని టీడీపీపై విమర్శలు చేశారు.

నేడు రాజ్యసభలో ఎంపీలుగా సాన సతీష్‌, బీద మస్తాన్‌ రావు, ఆర్‌.కృష్ణయ్యలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా నూతన ఎంపీల ప్రమాణం నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీ ప్రలోభాలపై రాజ్యసభలో ఆయన ప్రశ్నించారు. ప్రలోభాలతోనే వైఎస్సార్‌సీపీకి చెందిన నేతలను టీడీపీ లాక్కుందని అన్నారు. టీడీపీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. ఈ క్రమంలో కల్పించుకున్న రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్కర్‌.. ఈ వ్యాఖ్యలు రికార్డుల్లోకి వెళ్లవని చెప్పారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement