వ్యోమగావిునవుతా | Kaluva Joshita Reddy completed the NASA IASP course | Sakshi
Sakshi News home page

వ్యోమగావిునవుతా

Published Tue, Nov 28 2023 6:07 AM | Last Updated on Tue, Nov 28 2023 6:07 AM

Kaluva Joshita Reddy completed the NASA IASP course - Sakshi

తిరుపతి సిటీ: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో తిరుపతికి చెందిన ఓ విద్యార్థిని వ్యోమగామి కావాలన్న తన కలను నెరవేర్చుకునే దిశగా ఓ అడుగు ముందుకేసింది. ‘నాసా’ అందిస్తున్న ఐఏఎస్‌పీ కోర్సును విజయవంతంగా పూర్తి చేసింది. ఔత్సాహిక విద్యార్థులను ప్రోత్సహించేందుకు అమెరికాలోని ఎయిర్‌ స్పేస్‌ అండ్‌ రాకెట్‌ సెంటర్, నాసా సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నవంబర్‌ నెలలో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రాం(ఐఏఎస్‌పీ) అందిస్తోంది. విద్యార్థులకు పది రోజులపాటు వ్యోమ గావిుకి సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు శిక్షణ ఇస్తారు.

ప్రపంచవ్యాప్తంగా ఏటా 50 మందికే ఈ అవకాశం లభిస్తుంది. ఈ ఏడాది భారత్‌ నుంచి కేవలం నలుగురే ఎంపికయ్యారు. ఇందులో తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీలో బీటెక్‌ ఈసీఈ సెకండియర్‌ చదువుతున్న కాలువ జోషితారెడ్డికి అవకాశం దక్కింది. కానీ తగినంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో.. ఎంపీ మిథున్‌రెడ్డి ద్వారా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం దృష్టికి తన సమస్యను తీసుకెళ్లింది.

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి.. రూ.25 లక్షల ఆర్థిక సాయం చేయడంతో జోషితా అమెరికా వెళ్లింది. ఈనెల 11 నుంచి ప్రారంభమైన ఐఏఎస్‌పీ శిక్షణను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. నాసా నుంచి ధ్రువపత్రంతో పాటు శిక్షణలో ప్రతిభ కనబరిచినందుకు యూఎస్‌ స్పేస్‌ అండ్‌ రాకెట్‌ సెంటర్‌ ప్రతినిధుల నుంచి బెస్ట్‌ ట్రైనర్‌ అవార్డు కూడా అందుకుంది. అమెరికా నుంచి తిరుపతికి వచ్చిన ఆమె ఆదివారం తల్లి శ్రీలతారెడ్డితో కలసి ‘సాక్షి’తో మాట్లాడారు. 

సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటా
‘నాకు చిన్న వయసు నుంచి వ్యోమగామి కావాలని కోరిక ఉంది. అందుకు సంబంధించిన వీడియోలు, ఆర్టికల్స్‌ చదువుతూ ఉండేదాన్ని. యూఎస్‌ స్పేస్‌ సెంటర్, నాసా ఏటా ప్రపంచవ్యాప్తంగా 50 మందిని ఐఏఎస్‌పీ ప్రోగ్రామ్‌కు ఎంపిక చేస్తుందని తెలియడంతో దరఖాస్తు చేశాను. అన్ని ఇంటర్వూ్యల్లో సెలెక్ట్‌ అయ్యాను. కానీ తగినంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో అమ్మతో పాటు స్థానిక నాయకుడు ప్రతాప్‌రెడ్డి సహకారంతో ఎంపీ మిథున్‌రెడ్డి దృష్టికి నా సమస్య తీసుకెళ్లాను. ఆ తర్వాత నాకు సీఎం జగన్‌ రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించారు.

 దీంతో అమెరికా స్పేస్‌ సెంటర్‌లో శిక్షణ పూర్తి చేశాను. శిక్షణ పూర్తిగా వ్యోమగాములు, శాస్త్రవేత్తల పర్యవేక్షణలో జరిగింది. ఇందులో ముఖ్యంగా పైలెట్‌ డ్రైవింగ్, మూన్‌ గ్రావిటీ, స్కూబా డైవింగ్, మల్టీయాక్సిస్‌ చైర్, స్పేస్‌ రిలేటెడ్‌ వర్క్‌షాప్‌ తదితరాలపై శిక్షణలిచ్చారు. ఈ అరుదైన అవకాశం కల్పించిన జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటా. భవిష్యత్‌లో వ్యోమగామిగా ప్రపంచానికి సేవలందించాలని ఉంది’ అని జోషిత చెప్పారు.

 ప్రభుత్వ సాయం మరువలేనిది..
జోషితా తల్లి శ్రీలతారెడ్డి మాట్లాడుతూ.. ‘మా స్వస్థలం అన్నమయ్య జిల్లా కలికిరి. భర్త లేకున్నా.. పిల్లల చదువు కోసం తిరుపతిలో ఉంటున్నాం. చిన్నప్పటి నుంచి జోషితకు స్పేస్‌పై ఆసక్తిగా ఉండడంతో ప్రోత్సహించాను. నాసా ఐఏఎస్‌పీ ప్రొగ్రామ్‌కు పాప ఎంపికైన విషయం తెలియగానే.. ఖర్చు విషయాన్ని ఎంపీ మిథున్‌రెడ్డి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశాం. ఆ వెంటనే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద మనస్సుతో రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఆయన అందించిన సాయం మరువలేనిది. చదువులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం’ అని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement