నెట్‌ఫ్లిక్స్‌లో పవన్‌ కల్యాణ్‌ ‘ఓజీ’.. రాబోయే తెలుగు సినిమాలివే! | OG, VD12, Thandel Other These Movies To Be Part Of Netflix 2025 Telugu OTT Release Slate | Sakshi
Sakshi News home page

నెట్‌ఫ్లిక్స్‌లో ఓజీ, తండేల్‌, మాస్‌ జాతర..రాబోయే తెలుగు సినిమాలివే!

Published Wed, Jan 15 2025 12:54 PM | Last Updated on Wed, Jan 15 2025 1:09 PM

OG, VD12, Thandel Other These Movies To Be Part Of Netflix 2025 Telugu OTT Release Slate

కరోనా తర్వాత ఓటీటీల వాడకం దేశవ్యాప్తంగా ఎక్కువైంది. థియేటర​్‌కి వెళ్లి సినిమా చూడడం తగ్గించి.. ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి ఓటీటీలో సినిమాను వీక్షిస్తున్నారు. అమెజాన్‌ ప్రైమ్‌, హాట్‌స్టార్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లోనూ ఇండియన్‌ సినిమాలు ఎక్కువగా రిలీజ్‌ అవుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్‌కి చెందిన స్టార్‌ హీరోల సినిమాలు ఎక్కువగా నెట్‌ఫ్లిక్స్‌లోనే స్క్రీమింగ్‌ అవుతున్నాయి. అయినప్పటికీ మిగతా భాషలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల నుంచి నెట్‌ఫ్లిక్స్‌ ఖాతాదారులు తక్కువగానే ఉన్నారు. అందుకే ఆ సంస్థ టాలీవుడ్‌పై ఫోకస్‌ చేసింది. అందుకే తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఏడాది మరింత మందిని తమ ఖాతాదారులుగా చేర్చుకునేందుకు గాను నెట్‌ఫ్లిక్స్ పదులకొద్ది సినిమాలను కొనుగోలు చేసింది. 

టాలీవుడ్‌ చిత్రాలపై ఫోకస్‌
ఒకప్పుడు నెట్‌ఫ్లిక్స్‌ టాలీవుడ్‌తో పాటు దక్షిణాది చిత్రాలకు కాస్త దూరంగా ఉండేది.ఏడాది మూడు నాలుగు చిత్రాలు మాత్రమే రిలీజ్‌ చేసేది. కానీ ఇప్పుడు దక్షిణాది చిత్రాలపై ఫుల్‌ ఫోకస్‌ చేసింది. ముఖ్యంగా టాలీవుడ్‌ చిత్రాలను వరుసగా రిలీజ్‌ చేస్తుంది. గతేడాది బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకున్న అనేక చిత్రాల స్ట్రీమింగ్‌ రైట్స్‌ దక్కించుకుంది.ఇక 2025లోనూ నెట్‌ఫ్లిక్స్‌ అదే ఒరవడి కొనసాగించనుంది. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న తెలుగు సినిమా జాబితాను ప్రకటించింది. ఈ సారి నెట్‌ఫ్లిక్స్‌ ఖాతాలో పవన్‌ కల్యాణ్‌ ‘ఓజీ’, నాగచైతన్య ‘తండేల్‌’తో సహా క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. దాదాపు రూ.1000 కోట్లు ఖర్చు పెట్టి ఈ చిత్రాలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. థియేటర్స్‌లో విడుదలైన తర్వాత ఒప్పందం చేసుకున్న ప్రకారం ఈ చిత్రాలు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతాయి. ఆ క్రేజీ ప్రాజెక్ట్స్‌పై ఓ లుక్కేద్దాం.

పవన్‌ ‘ఓజీ’.
పవన్‌ కల్యాణ్‌ నటించాల్సిన సినిమాల్లో ఓజీ ఒకటి. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ఎప్పుడో ప్రారంభం అయింది. అయితే రాజకీయాల్లో పవన్‌ బిజీ కావడంతో ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడుతూ వస్తోంది. ఈ ఏడాదిలో మాత్రం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్‌ భావిస్తున్నారు. ఆ దిశగా పనులు కూడా ప్రారంభించారు. ఈ చిత్రంతో ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా నటించగా.. ఇమ్రాన్‌ హష్మి కీలక పాత్ర పోషించబోతున్నారు.

నాగచైతన్య ‘తండేల్‌’

 

 నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన తండేల్‌ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ రైట్స్‌ సైతం నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. తండేల్‌ సినిమాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటకు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌ వస్తున్నాయి. ఫిబ్రవరి 7న ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదల కానుంది.

 

రవితేజ ‘మాస్‌ జాతర’
రవితేజ హీరోగా నటిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ ‘మాస్‌ జాతర’. రవితేజ కెరీర్‌లోని ఈ 75వ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ధమాకా’ వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత రవితేజ, శ్రీలీల మళ్లీ జంటగా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎస్‌ఐ లక్ష్మణ్‌ భేరీ పాత్రలో రవితేజ నటిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సినిమాకు భీమ్స్‌  సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.

 

వీడి12
విజయ్‌ దేవరకొండ హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ‘వీడీ 12’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమా తెరకెక్కుతుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే, రుక్మిణీ వసంత్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌ రైట్స్‌ని కూడా నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకుంది. దీంతో పాటు నాని హిట్‌ 3,  మ్యాడ్‌ స్క్వేర్‌,  జాక్‌, అనగనగా ఒక రాజు సినిమాలను సైతం నెట్‌ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement