
నాగచైతన్య-సాయిపల్లవి జంటగా నటించిన సినిమా 'తండేల్'. ఈ నెల 7న థియేటర్లలో రిలీజైంది. హిట్ టాక్ తెచ్చుకుని రూ.100 కోట్ల కలెక్షన్స్ మార్క్ కూడా అందుకుంది. తాజాగా టీమ్ అంతా కలిసి సక్సెస్ పార్టీ కూడా చేసుకున్నారు.
తండేల్ మూవీ రిలీజ్ రోజే పైరసీకి గురైంది. దీనిపై నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రస్తుతానికి థియేటర్లలో సినిమా రన్ అవుతోంది. కానీ ఇప్పుడు ఓటీటీ రిలీజ్ పై బజ్ వినిపిస్తోంది. అనుకున్న టైం కంటే ముందే డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
(ఇదీ చదవండి: సింగర్ పై 19 ఏళ్ల తర్వాత మరో కేసు పెట్టిన మొదటి భార్య!)
తండేల్ మూవీ డిజిటల్ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. రీసెంట్ టైంలో 'పుష్ప 2' తప్పితే చాలా సినిమాల్ని ఈ ఓటీటీ సంస్థ.. నెల రోజులకు అటు ఇటుగా స్ట్రీమింగ్ చేసేస్తోంది. అలానే ఈ సినిమాని కూడా నెలకే ఓటీటీలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మార్చి 6 నుంచే తండేల్.. ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. లేదంటే మార్చి 14న రావొచ్చని మాట్లాడుకుంటున్నారు.
తండేల్ విషయానికొస్తే.. శ్రీకాకుళంలోని మత్సలేశం అనే ఊరికి చెందిన కొందరు జాలర్లు.. గుజరాత్ తీరంలో చేపలు పడుతుండగా, అనుకోకుంగా పాకిస్థాన్ నేవి చేతికి చిక్కారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. తర్వాత పాకిస్థాన్ జైల్లో కొన్నాళ్ల పాటు ఉన్నారు. భారత ప్రభుత్వం జోక్యంతో తిరిగి ఇళ్లకు చేరారు. ఈ స్టోరీకి ప్రేమకథని జోడించిన డైరెక్టర్ చందూ మొండేటి.. తండేల్ తీశాడు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?)
Comments
Please login to add a commentAdd a comment