
మార్చి తొలివారం వచ్చేసింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల పరీక్షల హడావుడి నడుస్తోంది. అందుకే తెలుగు సినిమాలేం ఈసారి థియేటర్లలో రిలీజ్ కావట్లేదు. కానీ ఛావా, ఆఫీసర్ ఆన్ డ్యూటీ, కింగ్ స్టన్ లాంటి డబ్బింగ్ చిత్రాలు.. ఈ వీకెండ్ లో బిగ్ స్క్రీన్ పై రిలీజ్ కానున్నాయి.
(ఇదీ చదవండి: ఓటీటీలో సంక్రాంతికి వస్తున్నాం.. జీ5 చరిత్రలోనే రికార్డు)

మరోవైపు ఓటీటీలో కేవలం 11 సినిమాలు-వెబ్ సిరీసులే రాబోతున్నాయి. కానీ వీటిలో రేఖాచిత్రం అనే డబ్బింగ్ మూవీతో పాటు తండేల్, విడామయూర్చి, బాపు చిత్రాలు చూడదగ్గవే. ఇవి కాకుండా సర్ ప్రైజ్ రిలీజులు కూడా ఉండొచ్చు. ఇంతకీ ఈ వారం ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మార్చి 3-9వ తేదీ వరకు)
నెట్ ఫ్లిక్స్
విడామయూర్చి (తెలుగు డబ్బింగ్ మూవీ) - మార్చి 03
తండేల్ (తెలుగు సినిమా) - మార్చి 07
నదానియాన్ (హిందీ హిందీ మూవీ) - మార్చి 07
అమెజాన్ ప్రైమ్
దుఫాహియా (హిందీ సిరీస్) - మార్చి 07
సోనీ లివ్
రేఖాచిత్రం (తెలుగు డబ్బింగ్ మూవీ) - మార్చి 07
ద వాకింగ్ ఆఫ్ ఏ నేషన్ (హిందీ సిరీస్) - మార్చి 07
హాట్ స్టార్
డేర్ డెవిల్: బార్న్ ఎగైన్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 04
డెలి బాయ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 06
బాపు (తెలుగు సినిమా) - మార్చి 07
తగేష్ vs ద వరల్డ్ (హిందీ సిరీస్) - మార్చి 07
బుక్ మై షో
బారా బై బారా (హిందీ మూవీ) - మార్చి 07
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment