ఆసక్తికరంగా ‘గాయత్రి’ ఫ్టస్ట్‌లుక్‌ | Mohanbabu latest movie First look | Sakshi
Sakshi News home page

ఆసక్తికరంగా ‘గాయత్రి’ ఫ్టస్ట్‌లుక్‌

Published Mon, Dec 25 2017 3:11 PM | Last Updated on Mon, Dec 25 2017 6:15 PM

Mohanbabu latest movie First look  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ నటుడు డా. మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'గాయత్రి'. క్రిస్మస్ సందర్భంగా సోమవారం ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ని మోహన్‌బాబు సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు . ‘ఆ రోజు రాముడు చేసింది తప్పయితే... నాదీ తప్పే’ అనే పవర్‌ఫుల్ క్యాప్షన్‌తో ఈ పోస్టర్ విడుదల చేశారు. దీంతో దీనిపై మరింత ఆసక్తికరంగా. ఈ క్యాప్షన్‌పై అప్పుడే సోషల్‌మీడియాలో చర్చ మొదలైంది. కాగా మోహన్‌బాబు- విష్ణు- శ్రేయ-నిఖిలా విమల్ కాంబినేషన్‌లో ఈ మూవీ తెరకెక్కుంది. ఇందులో మోహన్‌బాబు రోల్ ఎంతో వైవిధ్యభరితంగా ఉంటుందని అంటున్నాడు డైరెక్టర్ మదన్. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న తీసుకురావాలని చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేస్తోంది.   బ్రహ్మానందం, జర్నలిస్ట్‌గా అనసూయ  తదితరులు నటిస్తున్న ఈ సినిమాలో మోహన్‌బాబు కూతురిగా నిఖిలా విమల్‌ కనిపించనున్నారట. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement