
రితేష్ దేశ్‌ముఖ్
‘‘ఏ వస్తువుని కొలవడానికి అయినా ఎత్తును ప్రమాణంగా చూస్తారు. ఇప్పుడు నా పగ ఎత్తెంతో చూపిస్తాను’’ అంటున్నారు రితేష్ దేశ్‌ముఖ్. ‘మర్జావాన్’ సినిమాలో మరుగుజ్జు పాత్రలో కనిపించనున్నారు రితేష్. ‘నా ఎత్తు సంగతి తర్వాత.. నేను వేసే ఎత్తుల గురించి చూడండి’ అన్నట్టు ఆయన పాత్ర ఉంటుందట. మిలాప్ జావేరి దర్శకత్వంలో సిద్ధార్థ్ మల్హోత్రా, రితేష్ దేశ్‌ముఖ్ ముఖ్యపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మర్జావాన్’. రకుల్‌ప్రీత్ సింగ్, తారా సుతారియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో రితేష్ మూడు అడుగుల ఎత్తు ఉండే విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను శుక్రవారం విడుదల చేశారు. నవంబర్ 22న ఈ చిత్రం రిలీజ్ కానుంది. గతంలో ఈ కాంబినేషన్‌లో (మిలాప్– సిద్ధార్థ్ – రితేష్) ‘ఏక్ విలన్’ సినిమా వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment