మంచులాంటి మనసు | First look of Mohan Babu in Mama Manchu Alludu Kanchu | Sakshi
Sakshi News home page

మంచులాంటి మనసు

Published Fri, Oct 23 2015 11:43 PM | Last Updated on Sun, Sep 3 2017 11:22 AM

మంచులాంటి మనసు

మంచులాంటి మనసు

మామది మంచులాంటి మనసు. అల్లుడేమో కంచులాంటివాడు. ఈ మంచులాంటి మామ, కంచులాంటి అల్లుడు చేసే సందడితో సాగే చిత్రం ‘మామ మంచు... అల్లుడు కంచు’. టైటిల్ రోల్స్‌లో మోహన్‌బాబు, అల్లరి నరేశ్ నటిస్తుండగా 24 ఫ్రేమ్స్ పతాకంపై శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అప్పటి ‘అల్లరి మొగుడు’లో మోహన్‌బాబు సరసన జతకట్టిన రమ్యకృష్ణ, మీనా ఈ చిత్రంలో ఆయన సరసన నటించడం విశేషం. నరేశ్ సరసన పూర్ణ కథానాయిక. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు.

మంచు విష్ణు మాట్లాడుతూ -‘‘నాయకునిగా, ప్రతినాయకునిగా, సహాయ నటునిగా నాన్నగారు ఇప్పటివరకూ 561 చిత్రాల్లో నటించారు. హీరోగా ఆయనకు ఇది 181వ చిత్రం. నరేశ్‌కు ఇది 50వ చిత్రం. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. డిసెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: శ్రీధర్ సీపాన, సంగీతం: అచ్చు-రఘు కుంచె, కెమెరా: బాలమురుగన్, సమర్పణ: అరియాన, వివియాన, విద్యానిర్వాణ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement