Son Of India Movie Update: Mohan Babu Son Of India Movie Shooting Begins In Hyderabad - Sakshi
Sakshi News home page

‘సన్నాఫ్‌ ఇండియా’ షూటింగ్‌‌‌ ప్రారంభం

Published Fri, Oct 23 2020 3:44 PM | Last Updated on Fri, Oct 23 2020 6:07 PM

Mohan Babu Son Of India Movie Shoot Begins In Hyderabad - Sakshi

మంచు కుటుంబం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో విష్ణు సతీమణి విరానిక స్టైలిస్ట్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టనున్నారు. కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబుకు ఆమె స్టైలింగ్‌ చేయనున్నారు.

కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘సన్నాఫ్‌ ఇండియా’. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న ప్రకటించిన ఈ సినిమాకు సంబంధించి తాజా అప్‌డేట్‌ ఇచ్చింది మూవీ యూనిట్‌. డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌‌ నేడు లాంఛనంగా ప్రారంభమైనట్లు వెల్లడించింది. కాగా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ, ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై మోహ‌న్‌బాబు, ‘సన్నాఫ్‌ ఇండియా’ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మాస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. (చదవండి: 'బిల్లా-రంగా' రీమేక్‌‌లో వార‌సులు)

ఇక మంచు కుటుంబం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో విష్ణు సతీమణి విరానిక స్టైలిస్ట్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టనున్నారు. కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబుకు ఆమె స్టైలింగ్‌ చేయనున్నారు. కాగా ‘సన్నాఫ్‌ ఇండియా’ షూటింగ్‌ ప్రారంభమైన సందర్భంగా, మోహన్‌బాబు తనయ, నటి మంచు లక్ష్మి తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘కంగ్రాట్స్‌ డాడీ! ఈ సినిమా కోసం ఎంతో ఎగ్జయింట్‌గా ఎదురు చూస్తున్నా! బెస్ట్‌ ఆఫ్‌ లక్‌, నాకు తెలుసు మీ అత్యద్భుతమైన నటనతో అందరినీ అలరిస్తారు’’అంటూ ట్వీట్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement