భార్యకు బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన మంచు విష్ణు.. వీడియో వైరల్! | Manchu Vishnu Special Surprise To His Wife Viranica Reddy On Their 15th Marriage Anniversary; Video Viral - Sakshi
Sakshi News home page

Manchu Vishnu: భార్య కోసం ప్రత్యేక హెలికాఫ్టర్.. ఎందుకో తెలుసా?

Mar 1 2024 7:49 PM | Updated on Mar 1 2024 8:00 PM

Manchu Vishnu Special Surprise To His Wife On Marriage Anniversery - Sakshi

టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి కాగా.. ఇటీవలే న్యూజిలాండ్‌కు బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం కన్నప్ప రెండో షెడ్యూల్‌ షూటింగ్‌ జరుగుతోంది. ఈ చిత్రంలో పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు నటిస్తున్నారు.

అయితే సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నప్పటికీ తన ఫ్యామిలీ కోసం సమయం కేటాయిస్తూ ఉంటారు. ఇవాళ తన 15వ వివాహా వార్షికోత్సవం సందర్భంగా భార్య విరానికా కోసం సర్‌ప్రైజ్‌ ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా హెలికాఫ్టర్‌లో ఆమెను తీసుకెళ్లి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో కన్నప్ప షూట్‌లో ఉన్న మంచు విష్ణు భార్య కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి సర్‌ ప్రైజ్‌ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను విరానికా తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇది చూసిన అభిమానులు టాలీవుడ్ జంటకు పెళ్లి రోజు విషెస్ చెబుతున్నారు. 

కాగా.. మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విష్ణు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విరానికా రెడ్డిని మార్చి 1, 2009న ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు అరియానా, వివియానా, ఐరా, అర్వం అనే నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. మరో వైపు.. విష్ణు భార్య విరానికా ఫ్యాషన్‌ డిజైనర్‌గా, వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement