నేచురల్ స్టార్ నాని పెళ్లి.. లవ్‌ స్టోరీ మామూలుగా లేదుగా? | Natural Star Nani Marriage Anniversery With Anjana Post Goes Viral | Sakshi
Sakshi News home page

Natural Star Nani: అంజనాతో నాని పెళ్లి.. ఒప్పించడానికి ఐదేళ్లు పట్టిందా?

Published Fri, Oct 27 2023 7:20 PM | Last Updated on Fri, Oct 27 2023 7:34 PM

Natural Star Nani Marriage Anniversery With Anjana Post Goes Viral - Sakshi

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఎదిగిన హీరో నాని. కెరీర్ తొలినాళ్లలో రేడియో జాకీగా అలరించారు నాని. నాని పూర్తి పేరు ఘంటా నవీన్‌ బాబు. రాంబాబు, విజయ లక్ష్మీ దంపతులకు 1984 ఫిబ్రవరి 24న జన్మించారు. నానికి అక్క కూడా ఉన్నారు. పేరు దీప్తి. స్వస్థలం కృష్ణా జిల్లాలోని చల్లపల్లి గ్రామం. కొన్నాళ్లు బాపు, శ్రీను వైట్ల దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశారు. 

అష్టా చెమ్మా చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి స్టార్‌గా ఎదిగారు.  మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కించారు. అలా మొదలైంది నాని సినీ ప్రయాణం.  ఆ తర్వాత భీమిలి కబడ్డీ జట్టు, ఈగ, జెర్సీ, భలే భలే మగాడివోయ్, ఎంసీఏ, శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఈ ఏడాది దసరా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం హాయ్ నాన్న అనే చిత్రంలో నటిస్తోన్న నాని.. ఇటీవలే సరిపోదా శనివారం అనే టైటిల్‌లో కొత్త మూవీని ‍ప్రకటించారు.

(ఇది చదవండి: ఆట సందీప్‌ను కొట్టిన పల్లవి ప్రశాంత్‌ .. ఎమోషనల్‌ అయిన జ్యోతిరాజ్‌)

అయితే 2012లో అక్టోబర్ 27న అంజనా ఎలవర్తి అనే అమ్మాయిని పెళ్లి హీరోకు ఓ కుమారుడు కూడా ఉన్నారు. తాజాగా వీరిద్దరి పెళ్లి జరిగిన నేటికి 11 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా నాని తన ఇన్‌స్టాలో ఓ అరుదైన ఫోటోను పంచుకున్నారు. తన భార్య అంజనకు నుదుటిన బొట్టు పెడుతున్న పిక్‌ షేర్ చేశారు. మా బంధానికి 11 సంవత్సరాలు అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇది చూసిన అభిమానులు ఈ జంటకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

అయితే నానికి ఫేస్ బుక్ ద్వారా అంజనా పరిచయమైనట్లు తెలుస్తోంది. అయిదేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు పెద్దలను ఒప్పించి 2012లో పెళ్లి చేసుకున్నారు. కాగా.. విశాఖపట్నానికి చెందిన అంజనా కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా పనిచేస్తోంది. అయితే మొదట నానితో పెళ్లికి అంజనా ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదని సమాచారం. దీంతో ఐదేళ్ల పాటు రిలేషన్‌లో ఉన్న వీరు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఒక్కటయ్యారు. 

(ఇది చదవండి: పంట పండించేవాడికి.. పంచుకోవడం కూడా తెలియాలి: రైతుబిడ్డకు అమర్‌దీప్‌ కౌంటర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement