మంచు లక్ష్మితో రాములమ్మ... - దాసరి | Lakshmi Bomb Latest Telugu Movie Theatrical Trailer on Telugu Filmnagar. | Sakshi
Sakshi News home page

మంచు లక్ష్మితో రాములమ్మ... - దాసరి

Published Sun, Oct 9 2016 12:09 AM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM

మంచు లక్ష్మితో రాములమ్మ...  - దాసరి

మంచు లక్ష్మితో రాములమ్మ... - దాసరి

‘‘మంచు లక్ష్మి స్పాంటేనియస్ యాక్టర్. నటిగానే కాదు, సామాజిక సేవలోనూ ముందుంది. ‘ప్రేమమ్’ ప్రచార చిత్రాలు చూసి పెద్ద హిట్టవుతుందని చెప్పా. ఆ సినిమా రిజల్ట్ వచ్చేసింది. ఇప్పుడీ ‘లక్ష్మీబాంబ్’ ప్రచార చిత్రాలు చూస్తుంటే సేమ్ ఫీలింగ్. ఈ ట్రైలర్ చూడగానే లక్ష్మితో రాములమ్మ తరహా సినిమా చేయాలనిపించింది. దీపావళికి ‘లక్ష్మీబాంబ్’ పేలనుంది’’ అని దర్శకరత్న దాసరి అన్నారు. మంచు లక్ష్మీప్రసన్న ప్రధాన పాత్రధారిగా కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనికా చంద్రశేఖర్, ఉమా లక్ష్మీనరసింహ నిర్మించిన సినిమా ‘లక్ష్మీబాంబ్’. సునీల్ కశ్యప్ స్వరపరచిన పాటల సీడీలను దాసరి విడుదల చేసి, నటుడు-నిర్మాత మోహన్‌బాబుకు అందజేశారు.

‘‘గుండెల్లో గోదారి’లో లక్ష్మి చక్కగా నటించింది. ఇందులో ఇంకా బాగా చేసింది’’ అని మోహన్‌బాబు అన్నారు. ‘‘ఈ చిత్రంలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌తో పాటు బాగా డ్యాన్సులు చేశా. టీమ్ అంతా కష్టపడి చేశారు. నిర్మాతలు రాజీ పడలేదు’’ అన్నారు మంచు లక్ష్మి. దీపావళికి చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. చిత్ర సమర్పకులు గునపాటి సురేశ్‌రెడ్డి, దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ, సునీల్ కశ్యప్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement