సమంత
సమంత మాట్లాడితే ఎలా ఉంటుంది? ఆమె గొంతు విన్నవాళ్లైతే టకీమని స్వీట్‌గా ఉంటుందని చెప్పేస్తారు. సిల్వర్ స్క్రీన్‌పై ఇప్పటివరకూ సమంత సొంత గొంతు వినిపించలేదు. ‘మహానటి’ ద్వారా వినిపించనున్నారట. మహానటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందుతోన్న ‘మహానటి’లో సమంత కీలక పాత్ర చేసిన విషయం తెలిసిందే.
ఈ పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలనుకున్నారని సమాచారమ్. నిజానికి సమంత చక్కగా తెలుగు మాట్లాడతారు. ఆ చిలక పలుకులు వినడం అభిమానులకు వీనుల విందుగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్‌పై ప్రియాంకా దత్ నిర్మించిన ఈ చిత్రం మే 9న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment