own Dubbing
-
డబ్బింగ్ డన్
‘భోళా శంకర్’కు సొంత డబ్బింగ్ చెప్పారు తమన్నా. చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘భోళా శంకర్’.ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా తమన్నా నటించగా, ఆయన చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ నటించారు. కాగా ఈ సినిమాలో తమన్నా డబ్బింగ్ వర్క్ పూర్తయింది. తన పాత్రకు తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారామె. అనిల్ సుంకర సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. -
సొంత గొంతుతో హిట్ హీరోయిన్
ఛలో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన బ్యూటీ రష్మిక మందన్న. తొలి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల గీత గోవిందం సినిమాతో మరో బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న రష్మిక, ప్రస్తుతం ఓ క్రేజీ మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తున్నారు. కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నానిలు హీరోలుగా తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ మూవీ దేవదాస్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం రష్మిక సొంతంగా డబ్బింగ్ చెప్పుకునేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. గీత గోవిందంకే డబ్బింగ్ చెప్పుకోవాలని భావించినా డేట్స్ అడ్జస్ట్ కాక చెప్పలేకపోయారు. అందుకే ఈ సారి ఎలాగైన దేవదాస్‌లో సొంత గొంతు వినిపించేందుకు రెడీ అవుతున్నారు రష్మిక. -
స్వీట్ వాయిస్
సమంత మాట్లాడితే ఎలా ఉంటుంది? ఆమె గొంతు విన్నవాళ్లైతే టకీమని స్వీట్‌గా ఉంటుందని చెప్పేస్తారు. సిల్వర్ స్క్రీన్‌పై ఇప్పటివరకూ సమంత సొంత గొంతు వినిపించలేదు. ‘మహానటి’ ద్వారా వినిపించనున్నారట. మహానటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందుతోన్న ‘మహానటి’లో సమంత కీలక పాత్ర చేసిన విషయం తెలిసిందే. ఈ పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలనుకున్నారని సమాచారమ్. నిజానికి సమంత చక్కగా తెలుగు మాట్లాడతారు. ఆ చిలక పలుకులు వినడం అభిమానులకు వీనుల విందుగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్‌పై ప్రియాంకా దత్ నిర్మించిన ఈ చిత్రం మే 9న విడుదల కానుంది. -
‘మహానటి’కి సమంత సొంత వాయిస్
తెలుగు తెరపై బయోపిక్‌ల హవా కొనసాగుతున్న ఈ తరుణంలో మన ముందుకు రాబోతున్న క్రేజీ చిత్రం మహానటి. సావిత్రి నిజ జీవితం ఆధారంగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో సావిత్రిగా కీర్తి సురేశ్ నటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తైంది. ఈ చిత్రంలో మరో హీరోయిన్ సమంత కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాతో అభిమానులకు సమంత తన గొంతును వినిపించబోతున్నారు. మొదటిసారిగా తెలుగులో ఈ సినిమాకు డబ్బింగ్ చెబుతున్నారు. సమంత వాయిస్ అంటే అందరికీ గుర్తొచ్చేది చిన్మయి శ్రీపాదే. సమంతకు అంతగా ఆ వాయిస్ సెట్ అయింది. అయితే తమిళంలో ఇది వరకే సమంత డబ్బింగ్ చెప్పుకున్నారు. ఈ సినిమాలో తన పాత్ర ఏమిటన్న సస్పెన్స్‌ను మాత్రం ఇప్పుడే బ్రేక్ చేయనని సమంత అన్నారు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా సంస్థలుసంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగఅశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, షాలిని పాండే, మాళవిక నాయర్, భానుప్రియ, దివ్యవాణి, శ్రీనివాస్ అవసరాల, దర్శకులు క్రిష్, తరుణ్ భాస్కర్ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. మే 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మాట నిలబెట్టుకున్న సూర్య
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు తెలుగు నాట కూడా మంచి మార్కెట్ ఉంది. అందుకే సూర్య హీరోగా తెరకెక్కిన సినిమాలు తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతుంటాయి. ప్రస్తుతం సూర్య బాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన స్పెషల్ 26 రీమేక్ లో నటిస్తున్నాడు. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో గ్యాంగ్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రచారం కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. మాస్ లుక్ లో ఇరగదీసిన సూర్య అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇచ్చాడు. తెలుగు వర్షన్ లోనూ తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు సూర్య. డైలాగ్స్ చెప్పిన తీరు కాస్త డిఫరెంట్ గా అనిపించినా.. సూర్య ప్రయత్నానికి మాత్రం మంచి రెస్పాన్స్ వస్తోంది. -
మాట నిలబెట్టుకున్న సూర్య
-
ఒక్క సినిమా..రెండు కోట్లు!
ఇన్నాళ్లకు... ఇన్నేళ్లకు నయనతార సొంత గొంతుని వినే అదృష్టం ప్రేక్షకులకు కలగనుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ పదేళ్లలో ఎన్నో సినిమాలు చేసిన నయనకు ఇంతవరకూ ఎవరెవరో డబ్బింగ్ చెప్పారు. తెలుగులో వచ్చిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’లో మాత్రం తొలిసారిగా డబ్బింగ్ చెప్పుకున్నారామె. ఆమె డబ్బింగ్‌కి మంచి మార్కులే పడ్డాయి. అయితే ఇప్పటివరకు తమిళ ప్రేక్షకులకు మాత్రం నయనతార గొంతు వినే భాగ్యం కలగలేదు. ఈ ఏడాది అక్కడి ప్రేక్షకులకు కూడా తన మధురమైన కంఠస్వరాన్ని వినిపించాలని నయనతార నిర్ణయించుకున్నారు. మాజీ ప్రియుడు శింబు సరసన నయనతార ‘ఇదు నమ్మ ఆళు’ అనే చిత్రంలో నటిస్తున్నారు. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత ఈ జంట నటిస్తున్న సినిమా ఇది. ఈ కథ, పాత్ర చెప్పి, ఈ సినిమా మీరు చేస్తే బాగుంటుందని అటు శింబు... ఇటు నయన్‌కి చెప్పి, జత కలిపారు ఈ చిత్రదర్శకుడు పాండిరాజ్. ఆ విషయంలో విజయం సాధించిన పాండిరాజ్, నయనతారతో డబ్బింగ్ కూడా చెప్పించేస్తున్నారు. ‘మీ గొంతు వినిపిస్తేనే పాత్ర ఎలివేట్ అవుతుంది’ అని నయనకి చెప్పడం, ఆమె ఒప్పుకోవడం జరిగింది. శింబు, నయనతార నటించడంవల్ల ఇప్పటికే ఈ చిత్రానికి భారీ ఎత్తున క్రేజ్ ఏర్పడింది. ఇక, నయనతార గొంతు అదనపు ఆకర్షణ అవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొసమెరుపు ఏంటంటే.. తమ కలయికలో సినిమా అంటే.. బిజినెస్‌పరంగా చాలా క్రేజ్ ఉంటుందని గ్రహించిన నయనతార, ఇప్పటివరకూ ఏ సినిమాకీ తీసుకోనంత భారీ పారితోషికం తీసుకున్నారట. మామూలుగా ఒక సినిమా కోటి నుంచి కోటిన్నర రూపాయల లోపు తీసుకుంటారు. అంతకన్నా భారీ అంటే.. రెండు కోట్ల దాకా తీసుకొని ఉంటారని కోలీవుడ్ టాక్.