
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు తెలుగు నాట కూడా మంచి మార్కెట్ ఉంది. అందుకే సూర్య హీరోగా తెరకెక్కిన సినిమాలు తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతుంటాయి. ప్రస్తుతం సూర్య బాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన స్పెషల్ 26 రీమేక్ లో నటిస్తున్నాడు. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో గ్యాంగ్ పేరుతో రిలీజ్ చేస‍్తున్నారు.
ఇప్పటికే ప్రచారం కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. మాస్ లుక్ లో ఇరగదీసిన సూర్య అభిమానులకు మరో సర్‌ప్రైజ్ ఇచ్చాడు. తెలుగు వర్షన్ లోనూ తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు సూర్య. డైలాగ్స్ చెప్పిన తీరు కాస్త డిఫరెంట్ గా అనిపించినా.. సూర్య ప్రయత్నానికి మాత్రం మంచి రెస్పాన్స్ వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment