కిక్‌ ఇచ్చే లుక్‌లో | Rakul Preet joins Sai Pallavi and Suriya in Suriya | Sakshi
Sakshi News home page

కిక్‌ ఇచ్చే లుక్‌లో

Published Tue, Jan 23 2018 1:38 AM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

Rakul Preet joins Sai Pallavi and Suriya in Suriya - Sakshi

‘గ్యాంగ్‌’ సినిమా సక్సెస్‌ను పూర్తీగా ఎంజాయ్‌ చేయకముందే తదుపరి చిత్రాన్ని పట్టాలు ఎక్కించేశారు సూర్య.  ‘7/జి బృందావన కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ ఫేమ్‌ సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో  సూర్య ఓ సినిమా ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ నిన్న మొదలైంది. సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో సూర్య నటించడం ఇదే తొలిసారి.

ఈ సినిమాలో సాయి పల్లవి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సూర్య క్యారెక్టరైజేషన్, లుక్‌ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని చిత్రబృందం పేర్కొన్నారు. ఫ్యాన్స్‌కైతే ఆయన లుక్‌ కిక్‌ ఇచ్చే విధంగా ఉంటుందట. ఎస్‌ ఆర్‌ ప్రభు, ఎస్‌.ఆర్‌. ప్రకాష్‌ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను దీపావళికి విడుదల చేయాలనుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement