సూర్యకి విలన్‌గా టాలీవుడ్‌ సీనియర్‌ స్టార్ | Jagapathi babu to play Villain in Suriyas Next | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 30 2018 10:19 AM | Last Updated on Tue, Jan 30 2018 10:21 AM

Suriya - Sakshi

సూర్య (పాత చిత్రం)

‘గ్యాంగ్’ సినిమాతో మరో విజయాన్ని అందుకున్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, ప్రస్తుతం సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభమైన ఈ సినిమాలో ఓ టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు ప్రతినాయక పాత్రలో నటించనున్నాడట. లెజెండ్‌ సినిమాతో విలన్‌ గా మారిన సీనియర్‌ హీరో జగపతి బాబు, తెలుగుతో పాటు మాలీవుడ్‌, కోలీవుడ్‌లలోనూ వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. ఇప్పటికే తమిళ నటుడు విజయ్‌ హీరోగా తెరకెక్కిన ‘భైరవ’, రజనీకాంత్‌ ‘లింగా’ సినిమాలలో విలన్‌గా నటించిన జగ్గుభాయ్‌.. మరో తమిళ హీరో సూర్య నెక్ట్స్ సినిమాలోనూ ప్రతినాయక పాత్రలో నటించనున్నాడు.

రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్‌ పాత్రలో ప్రముఖ నటుడు అవసరమని భావించిన చిత్రయూనిట్ జగపతిబాబును సంప్రదించారు. క్యారెక్టర్‌ నచ్చటంతో ఆయన కూడా ఓకె చెప్పారన్న టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతానికి జగపతిబాబు నటించటంపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. సూర్య సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సాయి పల్లవిలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్‌ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి రెండో వారంలో రెండో షెడ్యూల్‌ ప్రారంభం కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement