మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో జగ్గుభాయ్‌ | Jagapathi Babu In Suriya NGK | Sakshi
Sakshi News home page

Jun 27 2018 10:38 AM | Updated on Jun 27 2018 11:24 AM

Jagapathi Babu In Suriya NGK - Sakshi

విలన్‌ గా టర్న్‌ అయిన తరువాత సీనియర్‌ నటుడు జగపతి బాబు ఫుల్‌ బిజీ అయ్యారు. నెగెటివ్‌ రోల్స్ తో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ దూసుకుపోతున్నారు. అడపాదడపా లీడ్‌ రోల్స్‌లోనూ సత్తా చాటుతున్నారు. అంతేకాదు పరభాషా ప్రేక్షకులను కూడా తనదైన నటనతో ఆకట్టుకుంటున్నాడు జగ్గుభాయ్‌. ఇప్పటికే మోహన్‌ లాల్ హీరోగా తెరకెక్కిన పులిమురుగన్‌, విజయ్‌ హీరోగా తెరకెక్కిన భైరవ, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ లింగ సినిమాల్లో నటించిన జగపతి బాబు మరో క్రేజీ ప్రాజెక్ట్‌ కు ఓకె చెప్పారు.

కోలీవుడ్ స్టార్‌ సూర్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఎన్జీకే. విభిన్న చిత్రాల దర్శకుడు సెల్వ రాఘవన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే జగ్గుభాయ్‌కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ కూడా ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో జగపతిబాబు చేస్తోంది సపోర్టింగ్ రోలా..? లేక ప్రతినాయక పాత్రా.? అన్న సంగతి తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement