జనవరి 26న ‘ఎన్‌జీకే’ రిలీజ్‌ | Suriya New Movie NGK Release Date Confirmed | Sakshi
Sakshi News home page

Nov 15 2018 3:46 PM | Updated on Nov 15 2018 3:46 PM

Suriya New Movie NGK Release Date Confirmed - Sakshi

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఎన్జీకే. ఈ సినిమాకు సెల్వ రాఘవన్‌ దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ మరో వారం రోజుల్లో పూర్తి కానుంది. ఇప్పటికే నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో చిత్ర నిర్మాతలు రిలీజ్‌పై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది.

వీలైనంత త్వరగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి రిపబ్లిక్‌ డే సందర్భంగా జనవరి 26న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. డిసెంబర్‌లోనే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు చిత్రయూనిట్. పొలిటికల్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌సింగ్‌, సాయి పల్లవిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీకి యువన్‌ శంకర్‌ రాజా సంగీతమందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement