
తిరుత్తణి: నటుడు సూర్య నటించిన ఎన్‌జీకే చిత్రం శుక్రవారం విడుదలైన సందర్భంగా తిరుత్తణిలో ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. దీంతో సినిమా థియేటర్ల ముందు కోలాహలం చోటుచేసుకుంది.
ఉదయం ఏడు గంటలకే వందలాది మంది అభిమానులు సినిమా థియేటర్ వద్దకు చేరుకుని కటౌట్లు ఏర్పాటు చేసి పూజలు చేశారు. స్వీట్లు పంచిపెట్టారు. ఉత్సాహంగా మొదటి షో చూసి సంబరాలు జరుపుకున్నారు. తిరువళ్లూరు జిల్లా సూర్య ఫ్యాన్స్ సంఘం అధ్యక్షుడు ఎల్‌టీ.రాజ్‌కుమార్ అధ్యక్షతన రూ. ఏడు లక్షల వ్యయంతో 215 అడుగుల పొడవైన సూర్య కటౌట్ ఏర్పాటు చేశారు. అయితే పోలీసుల అనుమతి లేకపోవడంతో తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకోవడంతో తిరుత్తణిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment