
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం ఎన్జీకే సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. అందులో భాగంగా ట్వీటర్ ద్వారా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు సూర్య. అయితే అనూహ‍్యం భారత క్రికెటర్ సురేష్ రైనా, సూర్యని ట్విటర్ ద్వారా ఓ ప్రశ్నించాడు. చెన్నై సూపర్ కింగ్స్ టీంలో మీకు నచ్చిన ప్లేయర్ ఎవరు అంటూ ప్రశ్నించాడు రైనా.
అయితే ఈ ట్వీట్ స్పందించిన సూర్య ఫన్నీ రిప్లై ఇచ్చాడు. ‘మీరు, ధోని అంటే ఇష్టం. మంచి గాయకుడు సురేష్ రైనా.. గొప్ప చిత్రకారుడిగా ధోని అంటే ఇష్టం.ఎప్పటికీ సీఎస్‌కే ఫ్యాన్’ అంటూ రిప్లై ఇచ్చాడు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్జీకే మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్య సరసన సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Obviously it’s you and @msdhoni @ImRaina for the singing skills and @msdhoni for his drawing skill 😜 #CSK fan forever!! https://t.co/jnMv5KwjUR
— Suriya Sivakumar (@Suriya_offl) 20 May 2019