
ప్రేమం చిత్రంతో ప్రారంభమై మారి– 2లో రౌడీ బేబి పాట వరకు అదరగొట్టే డ్యాన్స్‌తో చురుకైన నటన ప్రదర్శించారు నటి సాయి పల్లవి. ప్రస్తుతం ఎన్‌జీకే చిత్రంలో సూర్యకు జంటగా నటిస్తున్నారు. చిత్రం ట్రైలర్ రిలీజ్‌కు వచ్చిన సాయిపల్లవి మాట్లాడుతూ తాను సూర్య అభిమానినన్నారు. చిత్రం షూటింగ్‌లో ఆయన కఠిన శ్రమను నేరుగా చూశానన్నారు.
తాను చిత్రాల్లో నటించే సమయంలో ఇంట్లోనే హోం వర్కు చేసి సిద్ధంగా వెళతానన్నారు. ఎన్‌జీకే చిత్రానికి హోంవర్కు చేయకుండా రమ్మన్నారని, దీంతో చిత్రం షూటింగ్‌లో పది టేకులు, ఇరవై టేకులు, అంతకు పైగా టేకులు తీసుకున్నట్లు తెలిపారు. ఒక దశలో తాను నటించగలనా? అనే అనుమానం రావడంతో తన వల్ల చిత్రం షూటింగ్ ఆలస్యమవుతున్నట్లు భావించానన్నారు.
నటుడు సూర్య మాట్లాడుతూ సాయి పల్లవి చక్కని నటి అనడంలో సందేహం లేదని ప్రశంసించారు. కొన్నిసార్లు సీన్ ముగించుకుని వెళ్లే సాయి పల్లవి కన్నీరు పెట్టున్నారు. తన వల్లే ఇంతగా టేకులు తీసుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసి బాధపడ్డారని, దీంతో ఆమెను సముదాయించాల్సి వచ్చిందన్నారు. సీన్‌లో చక్కగా నటించిన తర్వాత డైరెక్టర్ ఓకే చెప్పిన తర్వాత కూడా అంతటితో తృప్తి చెందని సాయి పల్లవి బాధగా ఉండడం నటనపై ఆమెకున్న అంకితభావాన్ని తెలియజేస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment