ఆయనతో మరో సినిమా చేయాలని ఆశపడుతున్నా : సూర్య | Suriya Ngk Movie Trailer Launch Event | Sakshi
Sakshi News home page

ఆయనతో మరో సినిమా చేయాలని ఆశపడుతున్నా : సూర్య

Published Tue, Apr 30 2019 4:47 PM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

Suriya Ngk Movie Trailer Launch Event - Sakshi

డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, రిలయెన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బేనర్‌లపై సూర్య హీరోగా నిర్మిస్తున్న చిత్రం ‘ఎన్‌.జి.కె’ (నంద గోపాలకృష్ణ). ఈ సినిమా ఆడియో, ట్రైలర్‌ విడుదల కార్యకమ్రం చిత్ర యూనిట్‌ సభ్యుల నడుమ వైభవంగా జరిగింది. యూనిట్‌తోపాటు హీరో సూర్య తండ్రి, సీనియర్‌ నటుడు శివకుమార్‌, 2డి టర్‌టైన్‌మెంట్స్‌ రాజా ఈ వేడుకలో పాల్గొన్నారు. 

నా కల నిజమైన భావన కలుగుతోంది 
ఈ సం‍దర్భంగా హీరో సూర్య మాట్లాడుతూ - ‘ఎన్‌.జి.కె’ చిత్రాన్ని పొటిలికల్‌ డ్రామా, థ్రిల్లర్‌ అని అందరూ అంటున్నారు. కానీ, మరో యాంగిల్‌లో ఉండే సినిమా ఇది. 2000 సంవత్సరం తర్వాత రాజకీయ ఘటనలను అబ్జర్వ్‌ చేసిన డైరెక్టర్‌ శ్రీరాఘవగారి దృక్కోణంలో సాగే సినిమా ఇది. ఇప్పటివరకు ఏ దర్శకుడినైనా అడిగానో లేదో తెలియదు కానీ.. తొలిసారి శ్రీరాఘవగారిని నాతో సినిమా చేస్తారా? అని 2002లో అడిగాను. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయనతో సినిమా చేసే అవకాశం రావడం ఆనందాన్ని కలిగించింది. అంతేకాదు నా కల నిజమైన భావనను కలిగిస్తోంది. ఆయనతో మరో సినిమా చేయాలని ఆశపడుతున్నాను.

సూర్య అద్భుతమైన నటుడు
దర్శకుడు శ్రీరాఘవ మాట్లాడుతూ ‘నేను చేసిన సినిమాల్లో ఇది చాలా సంక్లిష్టమైన స్క్రిప్ట్‌. స్క్రిప్ట్‌ దశలో ఈ కథకు ఎవరు సరిపోతారా? అని నేను, నిర్మాతలు ప్రకాశ్‌, ప్రభు ఆలోచించుకుని సూర్య అయితేనే న్యాయం చేస్తాడని భావించి చేసిన సినిమా ఇది. సూర్య అద్భుతమైన నటుడు. చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌ను కూడా చక్కగా ఇచ్చారు. తను డైరెక్టర్స్‌ యాక్టర్‌. ఇక ప్రొడ్యూసర్స్‌ ప్రకాశ్‌, ప్రభు నుండి నిర్మాతలుగా ఎలాంటి సహకారం రావాలో.. ఆ సహకారం అందింది. సాయిపల్లవి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చక్కగా నటించారు. యువన్‌ సంగీతం, శివకుమార్‌ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్‌ ఎడిటింగ్‌ వర్క్‌ ఇలా ఓ వండర్‌ఫుల్‌ టీం కుదిరింది. సపోర్ట్‌ చేసిన అందరికీ థాంక్స్‌’ అన్నారు.

‘ఎన్‌.జి.కె.’ను మే 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నాం
నిర్మాత ఎస్‌.ఆర్‌.ప్రభు మాట్లాడుతూ - ‘ఎన్‌.జి.కె’ విషయంలో చాలా ఎగ్జయిట్‌మెంట్‌తో ఉన్నాం. తొలిరోజు కథ ఎంత ఎక్సయిట్‌ అయ్యామో.. ఇప్పుడూ అదే ఎక్సయిట్‌మెంట్‌తో ఉన్నాం. ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ స్ట్రయిక్‌ సహా పలు కారణాలతో బ్రేక్‌ అవుతూ వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకులు ముందుకు వస్తోంది. రకుల్‌, సాయిపల్లవి, యువన్‌ శంకర్‌ రాజా, శివకుమార్‌, ప్రవీణ్‌ ఇలా .. ఈ సినిమా విషయంలో టీం అందించిన సపోర్ట్‌ మరచిపోలేను. ఏం టైంలో అడిగినా కాదనకుండా సహకారం అందించారు. మంచి రిలీజ్‌ డేట్‌ కుదిరింది. యువన్‌, శ్రీరాఘవగారి కాంబినేషన్‌లో మూవీ అంటే సంగీతం ఎలా ఉంటుందోనని ఆసక్తి అందరిలోనూ ఉంది. పాటలు అద్భుతంగా కుదిరాయి. రీరికార్డింగ్‌ జరుగుతోంది. మే 31న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.

శ్రీరాఘవగారు ఇన్‌స్టిట్యూట్‌లాంటి వ్యక్తి
సాయిపల్లవి మాట్లాడుతూ - ‘ఈ సినిమాలో పనిచేయడం స్కూల్‌కి వెళ్లినట్లుగా అనిపించింది. సాధారణంగా ఓ సీన్‌ను షూట్‌ చేస్తారనుకుంటే నేను ప్రిపేర్‌ అయి వెళతాను. కానీ ఎలాంటి ప్రిపేరేషన్‌ లేకుండా రమ్మన్నారు. అలా ఎందుకు అన్నారో నాకు తొలి రెండు రోజుల్లోనే అర్థమైంది. సీన్‌ను మనం ఒకలా అనుకుని వెళితే శ్రీరాఘవగారు దాన్ని మరో లెవల్‌లో తెరకెక్కించేవారు. మన ఆలోచన గ్రౌండ్‌ లెవల్లో ఉంటే ఆయన ఆలోచన ఆకాశం రేంజ్‌లో ఉంటుంది. శ్రీరాఘవగారు ఇన్‌స్టిట్యూట్‌లాంటి వ్యక్తి. నేను ఇప్పటివరకు నేర్చుకున్నది ఏమీ లేదని ఆయనతో సినిమా చేసిన తర్వాతే అర్థమైంది. నాకు ఇప్పటివరకు తెలిసింది అంతా వదిలేసి నటించాలని నేర్చుకున్నాను. ఆయన్ని ఫాలో అయ్యాను. సూర్యగారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. సెట్స్‌లో ప్రతి ఒక్కరినీ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు. ఆయనలో సగం నేర్చుకుంటే చాలు. ఆయన మిలియన్స్‌లో ఒకరు. ఇక యువన్‌గారితో నేను చేస్తోన్న రెండో సినిమా. పాటలు బాగున్నాయి. రీరికార్డింగ్‌తో సినిమా నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళతారు’ అన్నారు.

ప్రతి సినిమా ఓ ఎక్స్‌పెరిమెంట్‌లా చేశాం
సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌రాజా మాట్లాడుతూ - ‘శ్రీరాఘవతో చేసిన ప్రతి సినిమాతో ఏదో ఒకటి బ్రేక్‌ చేస్తూ వచ్చాం. అలా మేం చేసిన ప్రతి సినిమానూ ఓ ఎక్స్‌పెరిమెంట్‌లా చేశాం. ఈ సినిమా విషయానికి వస్తే సినిమా చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చేస్తున్నాను’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement