అది నిజం కావాలి | Actress Rakul Preet Singh Exclusive Interview About NGK Movie | Sakshi
Sakshi News home page

అది నిజం కావాలి

Published Mon, May 27 2019 2:37 AM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

Actress Rakul Preet Singh Exclusive Interview About NGK Movie - Sakshi

రకుల్‌ప్రీత్‌ సింగ్‌

‘‘నేను షూటింగ్‌ లొకేషన్‌కి వెళ్లే రోజు ఓ కొత్త ఎగై్జట్‌మెంట్‌ ఉండాలి. రెగ్యులర్‌గా కాకుండా నేనేదో కొత్తగా చేస్తున్నాను అనే ఫీల్‌ కలగాలి. అలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడతాను’’ అని రకుల్‌ప్రీత్‌ సింగ్‌ అన్నారు. సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో సూర్య, సాయిపల్లవి, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరో హీరోయిన్లుగా రూపొందిన తమిళ చిత్రం ‘ఎన్‌జీకే’ (నందగోపాలకృష్ణ). ఎస్‌ఆర్‌. ప్రభు నిర్మించిన ఈ సినిమాను తెలుగులో కేకే రాధామోహన్‌ విడుదల చేస్తున్నారు. ఈ నెల 31న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ చెప్పిన విశేషాలు.

► పొలిటికల్‌ థ్రిల్లర్‌ మూవీ ఇది.  వానతి అనే ఇండిపెండెంట్, పవర్‌ ఉమెన్‌ క్యారెక్టర్‌ చేశాను.  ఇలాంటి క్యారెక్టర్‌ నేను ఇంతవరకు చేయలేదు.  సూర్య మంచి కో–స్టార్‌. మంచి ప్రతిభాశాలి. సాయిపల్లవి టాలెంటెడ్‌ యాక్టర్‌.  హీరో క్యారెక్టర్‌ పాలిటిక్స్‌లోకి వస్తున్నప్పుడు హీరోయిన్లుగా నేను, పల్లవి ఏం చేశామన్నది కథలో కీలకం.

► చాలా సినిమాలు చేసిన తర్వాత సెట్‌లో ఓ ధోరణికి అలవాటు పడిపోతాం. కానీ సెల్వసార్‌ సెట్‌లో అలా ఉండదు. ఒకవేళ మనం ఏదైనా హోమ్‌వర్క్‌ చేసి ఓ మైండ్‌ సెట్‌తో సెట్‌లోకి వెళితే అంతా క్యాన్సిల్‌. అక్కడ అంతా కొత్తగా ఉంటుంది. ఎందుకంటే హోమ్‌వర్క్‌ అంతా సెల్వసార్‌ చేసేస్తారు. యాక్టర్స్‌ పెర్ఫార్మెన్స్‌ పట్ల ఆయన ఫుల్‌ క్లారిటీగా ఉంటారు. మల్టీఫుల్‌ థింగ్స్‌ని బ్రెయిన్‌లో పెట్టుకుని యాక్ట్‌ చేయాలి. సెల్వసార్‌తో వర్క్‌ చేయడం కొత్త ఎక్స్‌పీరియన్స్‌. యాక్ట ర్‌గా మరింత ఇంప్రూవ్‌ కావొచ్చు.

► ప్రస్తుతం ఇండియాలో అందరూ పాలిటిక్స్‌ గురించే మాట్లాడుతున్నారు.   బాధ్యతాయుతమైన పౌరులుగా మనం దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎమ్‌బీఏ, ఇంజినీరింగ్‌ చేయాలంటే ఏం చేయాలో తెలుసు మనకు. పాలిటిక్స్‌లో జాయిన్‌ అవ్వడానికి ఒక ప్రత్యేకమైన విధానం అంటూ ఏం లేదు. ప్రపంచంలో ఏం జరుగుతుంది? అనే విష యాలను నేటి యువత ఆసక్తికరంగా తెలుసుకుంటున్నారు. కామన్‌పీపుల్, చదువుకున్నవారు రాజకీయాలను ఎంచుకోవడం మంచిదే. చదువుకున్నవారి సంఖ్య పెరిగితే దేశంలోని సగం సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నది

► ఈ ఏడాదిలో నావి దాదాపు అరడజను సినిమాలు రీలీజ్‌ అవుతాయి. వీటి షూటింగ్‌కి ఎక్కువ టైమ్‌ పట్టింది. ‘దే దే ప్యార్‌ దే’ సినిమాకు దాదాపు ఏడు నెలల సమయం పట్టింది. అంత టైమ్‌ తీసుకున్నాం కాబట్టే ఆ   సినిమా సక్సెస్‌ గురించి  మాట్లాడుతున్నారు. బాలీవుడ్‌లో రకుల్‌కు మంచి భవిష్యత్‌ ఉందని అజయ్‌ దేవగణ్‌ అన్నారంటే చాలా సంతోషంగా ఉంది. అది నిజం కావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే తమిళంలో 3 సినిమాలు చేశాను.

► సినిమా అంతా ఒక హీరోయిన్‌ ఉంటేనే ఉమెన్‌ సెంట్రిక్‌ సినిమాలు కాదు. ‘రారండోయ్‌ వేడుక  చూద్దాం, జయ జానకి నాయక, దే దే ప్యార్‌ దే’ సినిమాల్లో హీరోయిన్‌ పాత్రకు మంచి ప్రాధాన్యం  ఉంది.

► బయోపిక్‌ చాన్స్‌ వస్తే నేను తప్పకుండా చేస్తాను. బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌ బయోపిక్‌లో నటించాలనుకున్నాను. కాస్టింగ్‌ అయిపోయింది. కొత్త కాన్సెప్ట్‌ ఉన్న వెబ్‌ సీరిస్‌లో నటించడానికి రెడీ.

► ప్రస్తుతం నాగార్జునగారి ‘మన్మథుడు 2’ సినిమా చేస్తున్నాను. హిందీలో చేసిన ‘మర్జవాన్‌’ సినిమా అక్టోబర్‌లో విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement