
సమంత (ఫైల్)
తెలుగు తెరపై బయోపిక్‌ల హవా కొనసాగుతున్న ఈ తరుణంలో మన ముందుకు రాబోతున్న క్రేజీ చిత్రం మహానటి. సావిత్రి నిజ జీవితం ఆధారంగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో సావిత్రిగా కీర్తి సురేశ్ నటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తైంది. ఈ చిత్రంలో మరో హీరోయిన్ సమంత కీలక పాత్ర పోషించారు.
ఈ సినిమాతో అభిమానులకు సమంత తన గొంతును వినిపించబోతున్నారు. మొదటిసారిగా తెలుగులో ఈ సినిమాకు డబ్బింగ్ చెబుతున్నారు. సమంత వాయిస్ అంటే అందరికీ గుర్తొచ్చేది చిన్మయి శ్రీపాదే. సమంతకు అంతగా ఆ వాయిస్ సెట్ అయింది. అయితే తమిళంలో ఇది వరకే సమంత డబ్బింగ్ చెప్పుకున్నారు. ఈ సినిమాలో తన పాత్ర ఏమిటన్న సస్పెన్స్‌ను మాత్రం ఇప్పుడే బ్రేక్ చేయనని సమంత అన్నారు.
వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా సంస్థలుసంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగఅశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, షాలిని పాండే, మాళవిక నాయర్, భానుప్రియ, దివ్యవాణి, శ్రీనివాస్ అవసరాల, దర్శకులు క్రిష్, తరుణ్ భాస్కర్ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. మే 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment