mahanti
-
బీమా విస్తరణకు టెల్కోల సాయం
ముంబై: దేశంలో బీమాను అందరికీ చేర్చేందుకు టెలికం, ఈ–కామర్స్, ఫిన్‌టెక్ కంపెనీలతో భాగస్వామ్యం కావాలని ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ సీఈవో, ఎండీ సిద్ధార్థ మొహంతి అన్నారు. ‘ఏజెంట్లు, బ్రోకర్లు, బ్యాంక్–ఇన్సూరెన్స్‌తో సహా ప్రస్తుత ఛానెల్‌లు ప్రభావవంతంగా ఉన్నాయి. విస్తారమైన, మారుమూల గ్రామీణ మార్కెట్‌కు బీమాను విస్తరించడానికి ప్రస్తుతం అమలు చేస్తున్న విధానంలో పరిమితులు ఉన్నాయి. భవిష్యత్తులో సంప్రదాయేతర విధానాలను అమలు పర్చాల్సిందే. అందరికీ బీమాను చేర్చాలంటే పంపిణీ, మార్కెటింగ్ అంశాలను పునరాలోచించాలి. టెలికం, ఈ–కామర్స్, ఫిన్‌టెక్ వంటి సంప్రదాయేతర కంపెనీల సహకారంతోనే బీమా పాలసీలను పెద్ద ఎత్తున జారీ చేసేందుకు వీలవుతుంది. ఈ సంస్థలు దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకూ విస్తరించాయి. వీటితో భాగస్వామ్యం చేయడం ద్వారా సరసమైన, అందుబాటులో ఉండే కవరేజ్ అందరికీ లభిస్తుంది. కొత్త విధానాన్ని అనుసరించడం వల్ల వినియోగదారుల విభిన్న అవసరాలను తీర్చడానికి బీమా సంస్థలు పెద్ద ఎత్తున ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తాయి. 100 కోట్ల మందికిపైగా బీమా చేర్చడం అంత సులువు కాదు. గ్రామీణ, తక్కువ–ఆదాయ వర్గాలను చేరుకోవడానికి డిజిటల్ టెక్నాలజీ కీలకం. ఆరి్టఫీíÙయల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెరి్నంగ్, ఆటోమేషన్ వంటి సాంకేతికతలు, ప్లాట్‌ఫామ్‌లు మొత్తం బీమా రంగాన్ని విప్లవాత్మకంగా, మరింత కస్టమర్–ఫ్రెండ్లీగా మారుస్తున్నాయి’ అని సీఐఐ సదస్సులో వివరించారు. -
డాడీ ఈజ్ ప్రౌడ్
‘మహానటి’ సినిమాలో జెమినీ గణేశన్‌గా అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్ అన్న విషయం తెలిసిందే. నటుడిగా తనయుడు ఎంచుకుంటున్న పాత్రలు చూసి తండ్రి మమ్ముట్టి చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నారట. ఈ విషయాన్ని దుల్కర్ షేర్ చేసుకుంటూ – ‘‘యాక్టర్‌గా నా చాయిస్‌లు చూసి డాడ్ చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నారు. ఇదివరకు అందరూ మమ్ముట్టి అబ్బాయిగా గుర్తించేవారు. కానీ ఇప్పుడు నన్నూ ఓ నటుడిగా ఆడియన్స్ గుర్తిస్తున్నారు. కెరీర్ స్టార్టింగ్‌లో ప్రతి విషయాన్ని నాన్నగారితో పోలుస్తారేమో అని కంగారు పడేవాణ్ణి. కానీ మెల్లిగా యాక్టర్‌గా నా ప్రతిభని ఆడియన్సే గుర్తిస్తారని అర్థం చేసుకున్నాను’’ అని పేర్కొన్నారు. -
మహానటి కోసం.. ప్రత్యేకంగా
అందం, అభినయానికి చిరునామా సావిత్రి. ఆమె విలక్షణ నటనకే కాదు.. ఆమె ధరించే దుస్తులు, నగలకు కూడా ఎంతో మంది అభిమానులు ఉంటారు. అటువంటి లెజండరీ నటి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రం విషయంలో.. ప్రతీ అంశంలోనూ ఎంతో జాగ్రత్త వహించారు దర్శకుడు నాగ్ అశ్విన్. పాత్రధారుల ఎంపికకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో.. సావిత్రి పాత్ర పోషిస్తున్న కీర్తి సురేశ్ దుస్తులు, నగల విషయంలోనూ అంతే ప్రాధాన్యం ఇచ్చారు. సావిత్రి ధరించిన నగలను పోలిన డిజైన్లను రూపొందించడానికి ప్రత్యేకంగా డిజైనర్‌ను నియమించారు. ఈ సినిమా కోసం ఢిల్లీలోని ఎల్ భజరంగ్ పెర్షాద్ జువెల్లరీస్‌కు చెందిన నవీన్ సింగ్లీ, ఆయన టీమ్ 8 నెలల పాటు కష్టపడ్డారట. సావిత్రి నగలను రీక్రియేట్ చేయడానికి ఆమె నటించిన మాయాబజార్, దేవదాస్, పెళ్లిచేసి చూడు, మిస్సమ్మ వంటి సినిమాలను రెఫరెన్స్‌గా తీసుకున్నామని నవీన్ సింగ్లీ తెలిపారు. 60 ఏళ్ల క్రితం నాటి చందమామ, సూర్యుడు, వడ్డాణం డిజైన్లను రూబీలతో రూపొందించామన్నారు సింగ్లీ. ఈ డిజైన్ల కోసం ప్రత్యేకంగా 15 మంది స్వర్ణకారులు పనిచేసినట్లు తెలిపారు. బంగారం, కుందన్లు, వజ్రాలతో కూడిన నగలకు నగిషీలు దిద్దేందుకు ఐదుగురు చేతివృత్తి కళాకారులను ప్రత్యేకంగా నియమించామన్నారు. సుమారు 70 డిజైన్లను రూపొందించామని.. అందులో 35 డిజైన్లను దర్శకుడు ఫైనలైజ్ చేశారని డిజైనర్లు తెలిపారు. దుస్తులు, నగల ఎంపికలో వైవిధ్యంతో ప్రతీ వేడుకలోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సావిత్రి వంటి మహానటి పాత్ర కోసం ఆభరణాలు తయారు చేయడం సవాలుగా భావించామని.. పర్ఫెక్షన్ కోసం ఆమె కుటుంబ సభ్యులను కూడా సంప్రదించామని నవీన్ సింగ్లీ తెలిపారు. -
‘మహానటి’కి సమంత సొంత వాయిస్
తెలుగు తెరపై బయోపిక్‌ల హవా కొనసాగుతున్న ఈ తరుణంలో మన ముందుకు రాబోతున్న క్రేజీ చిత్రం మహానటి. సావిత్రి నిజ జీవితం ఆధారంగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో సావిత్రిగా కీర్తి సురేశ్ నటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తైంది. ఈ చిత్రంలో మరో హీరోయిన్ సమంత కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాతో అభిమానులకు సమంత తన గొంతును వినిపించబోతున్నారు. మొదటిసారిగా తెలుగులో ఈ సినిమాకు డబ్బింగ్ చెబుతున్నారు. సమంత వాయిస్ అంటే అందరికీ గుర్తొచ్చేది చిన్మయి శ్రీపాదే. సమంతకు అంతగా ఆ వాయిస్ సెట్ అయింది. అయితే తమిళంలో ఇది వరకే సమంత డబ్బింగ్ చెప్పుకున్నారు. ఈ సినిమాలో తన పాత్ర ఏమిటన్న సస్పెన్స్‌ను మాత్రం ఇప్పుడే బ్రేక్ చేయనని సమంత అన్నారు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా సంస్థలుసంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగఅశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, షాలిని పాండే, మాళవిక నాయర్, భానుప్రియ, దివ్యవాణి, శ్రీనివాస్ అవసరాల, దర్శకులు క్రిష్, తరుణ్ భాస్కర్ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. మే 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మాయాబజార్లో మిసెస్ నాగచైతన్య!
జస్ట్... తొమ్మిదంటే తొమ్మిది రోజుల క్రితమే సమంత రూత్ ప్రభు... అక్కినేని సమంతగా మారారు. పెళ్లి తర్వాత హనీమూన్‌కి చెక్కేయకుండా నాగచైతన్య, సమంత తమ తమ సినిమాల షూటింగ్స్‌కి డేట్స్ ఇచ్చేశారు. సమంత అయితే నిన్న మొన్నటి వరకు ‘రాజుగారి గది 2’ ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. సోమవారం ‘మహానటి’ షూటింగ్లో జాయిన్ అయ్యారు. ప్రొఫెషన్ మీద అంత శ్రద్ధ కాబట్టే్ట, ఆమె టాప్ హీరోయిన్ అయ్యారు. ‘మహానటి’ సంగతికొస్తే... అలనాటి గొప్ప నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్ నాగఅశ్విన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. నాటి క్లాసిక్ ‘మాయాబజార్’లో సావిత్రి చేసిన శశిరేఖ పాత్రకు సంబంధించిన సీన్స్‌ని తీస్తున్నారు. సావిత్రి పాత్రలో కీర్తీ సురేశ్ నటిస్తున్నారు. సమంత జర్నలిస్ట్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. ‘‘ఉదయాన్నే ‘మహానటి’ షూట్లో జాయిన్ అయ్యేందుకు స్టార్ట్ అయ్యాను. నెర్వస్‌గా, ఎగై్జట్‌మెంట్‌గా ఉంది. న్యూ బిగినింగ్’’ అని సమంత పేర్కొన్నారు. కథానాయిక అయ్యి దాదాపు ఏడేళ్లయింది. ఇప్పుడు న్యూ బిగినింగ్ ఏంటీ అనుకుంటున్నారా? అప్పుడు ‘కుమారి సమంత’గా సెట్స్‌కి వెళ్లేవారు. ఇప్పుడు ‘మిసెస్ నాగచైతన్య’గా వెళుతున్నారు కదా. అందుకే అలా అన్నారు. -
పట్టణాల నుంచి 75 శాతం జీడీపీ
రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.కె.మహంతి రాయదుర్గం: పట్టణాలు, నగరాల నుంచి 2030 నాటికి జీడీపీలో 75 శాతం వస్తుందని అంచనాలు చెబుతున్నాయని, పట్టణ ప్రాంతాలను ఆ స్థాయిలో అభివృద్ధి పరచాల్సిన అవసరాన్ని గుర్తించాలని రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.కె.మహంతి పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌లో మెట్రో పొలిస్ సదస్సును పురస్కరించుకొని ఏర్పాటు చేసిన అర్బన్ ఫైనాన్స్‌పై ప్రీ కాన్ఫరెన్స్‌లో సోమవారం ఆయన ప్రసంగించారు. మన దేశంలో 62 శాతం జాతీయ ఆదాయం పట్టణ ప్రాంతాల నుంచే వస్తోందని ఇటీవ ల అహ్లూవాలియా కమిటీ తన నివేదికలో పేర్కొన్నదని గుర్తు చేశారు. పట్ణణ ప్రాంతాలకు కేటాయిస్తున్న నిధులు, వసూలు చేస్తున్న పన్నులపై మరింత పరిశోధన అవసరం ఉందన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ వృత్తి పన్ను వసూలును గ్రేటర్ హైదరాబాద్‌కు ఇవ్వాలని, అలా చేస్తే మొదటి ఏడాదిలోనే నాలుగింతలు వసూలు చేసి చూపిస్తామని అర్థికమంత్రి ఈటెల రాజేందర్‌ను కోరారు. వాహనాల పన్నును ప్రస్తుతం వాణిజ్య పన్నుల శాఖ వసూలు చేస్తోందని తెలిపారు. ఏడాదికి రూ.100 కోట్లు వసూలవుతున్నాయని చెప్పారు. గ్రేటర్‌కు కేటాయిస్తే మొదటి ఏడాదే రూ.500 కోట్లు వసూలు చేసి చూపిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. గత ఏడాది గత ఏడాది రూ. 747 కోట్లు ఆస్తిపన్ను వసూలు కాగా ప్రస్తుతం రూ.1023 కోట్లు వసూలు చేశామని తెలిపారు. హైదరాబాద్‌కే అవకాశం మెట్రో పొలిస్ సదస్సు నిర్వహణకు జోహెన్నెస్‌బర్గ్ నగరం పోటీకి వచ్చినా హైదరాబాద్‌కే అవకాశం దక్కిందని స్పెషల్ కమిషనర్ ఎ.బాబు అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాలలోని 136 పట్టణాలకు చెందిన 1900 మంది ప్రతినిధులు సదస్సులో పాల్గొంటారన్నారు. 380 మంది అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులు ఉంటారని తెలిపారు. అక్టోబర్ 6 నుంచి 9 వరకు మెట్రో పోలిస్ సదస్సులో చర్చలు సాగుతాయని చెప్పారు. 10న ఔటర్ రింగు రోడ్డు, ఐటీ కారిడార్ తదితర ప్రాంతాలలో క్షేత్ర పర్యటన ఉంటుందన్నారు. సదస్సులో భాగంగా వరల్డ్ క్లాస్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తామన్నారు. ‘షహర్ నామా’ పేరిట జరిగే ఫిల్మ్ ఫెస్టివల్లో పట్టణ సమస్యలపై రూపొందించిన 40 సినిమాలు ప్రదర్శిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భార త రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్, రాజేంద్ర పచోరి వంటి ప్రముఖుల ప్రసంగాలు ఉంటాయన్నారు. 100 స్మార్ట్ సిటీస్ ఏర్పాటు చేసే అంశంపై చర్చ ఉంటుందన్నారు. ఈ సమావేశంలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డెరైక్టర్ జనరల్ కె.రామకృష్ణారావు, అదనపు డీజీ డాక్టర్ బి.గంగయ్య, డెరైక్టర్లు వి.శ్రీనివాసాచారి, షబ్బీర్ షేక్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎస్‌గా మహంతి పదవి విరమణ
-
విడిపోయినా కొట్లాటలు తప్పవు
హైదరాబాద్: తాత్కాలికంగానైనా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులను తెలంగాణకు కేటాయిస్తే ఒప్పుకునేదిలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయం ఇలానే ఉంటే విడిపోయాక కూడా కొట్లాటలు తప్పవన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతితో శ్రీనివాస్ గౌడ్, టీఎన్డీవో నేతలు సమావేశమయ్యారు. ఉద్యోగుల పంపకాల్లో అవకతవకలను అరికట్టాలని వారు మహంతికి విజ్ఞప్తి చేశారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు ఎవరి కార్యాలయాల్లో వారే పనిచేయాలని డిమాండ్ చేశారు. విభజన మొదలయ్యాక ఇచ్చిన జీవోలు, భూ కేటాయింపులు, ఉద్యోగుల ప్రమోషన్లను తిరగతోడతామని చెప్పారు. విభజన ముంగిట్లో తెలుగు అకాడమీకి 80 కోట్ల రూపాయల విలువైన పుస్తకాలను ప్రింటింగ్‌కు ఎలా అప్పగిస్తారని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన వార్ రూంపై టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయన్నారు. ఐఏఎస్‌లు ఒక ప్రాంతానికి కొమ్ముకాయకుండా అఖిల భారత ఉద్యోగులమని గుర్తుంచుకోవాలని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. -
గడువు పొడిగింపుపై రాత్రికి లేక రేపు నిర్ణయం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు(తెలంగాణ బిల్లు)పై శాసనసభలో చర్చకు గడువు పొడించే విషయంపై ఈ రాత్రికి గాని లేక రేపు ఉదయం గానీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయమై ఢిల్లీలో ఉన్న ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ (సీఎస్) పి.కె.మహంతితో ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ ఫోన్లో మాట్లాడారు. గడువు పెంపు విషయమై ఆరా తీశారు. ఈ రాత్రికి గాని రేపు గాని నిర్ణయం వెలువడే అవకాశం ఉందని మహంతి ఆయనకు చెప్పినట్లు తెలుస్తోంది. చర్చకు మరో నెల రోజులు గడువు పొడగించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోరిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ (సీఎస్) పి.కె.మహంతి కేంద్ర హోం శాఖకు లేఖ రాశారు. ఆ లేఖను హొం శాఖ రాష్ట్రపతికి పంపింది. రాష్ట్రపతి న్యాయసలహా కోరినట్లు హోంశాఖ వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ కార్యదర్శి శివశంకర్ గడువు పెంపుపై కేంద్ర హోంశాఖ అధికారులను కలిశారు. -
విభజన సకల సమాచారం ఢిల్లీకి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాల వారీగా అన్ని రంగాలకు చెందిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి బుధవారం కేంద్ర హోంశాఖకు పంపించారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖతో పాటు, వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు అడిగిన పూర్తి వివరాలను నివేదిక రూపంలో మహంతి రూపొందించారు. గతంలోనే కొంత సమాచారాన్ని ఈ-మెయిల్ ద్వారా కేంద్రానికి పంపించిన సీఎస్ బుధవారం ప్రత్యేక అధికారిద్వారా కేంద్ర హోంశాఖ కార్యదర్శికి వివరాలు పంపారు. అఖిల భారత సర్వీసు అధికారుల వివరాలను కేంద్రం ఇచ్చిన నమూనా పత్రంలో పంపించారు. -
ఐఏఎస్‌లు, ఐపిఎస్‌ల విభజనపై నివేదిక
ఢిల్లీ: రాష్ట్ర విభజన జరిగిన తరువాత రెండు రాష్ట్రాలకు ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల విభజనకు సంబంధించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కేంద్రానికి సమర్పించింది. ఏ ప్రాంతానికి ఎంతమంది వెళ్లాలో ఆ వివరాలు ఈ నివేదికలో పొందుపరిచారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఈరోజు కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి వి.నారాయణస్వామిని కలిసి ఈ నివేదిక అందజేశారు. రాష్ట్ర విభజన ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసిన నేపధ్యంలో అన్ని శాఖల నుంచి నివేదికలు తెప్పించుకుంటుంది. అందులో భాగంగానే ఈరోజు ఐఏఎస్, ఐపిఎస్ అధికారులకు సంబంధించిన నివేదిక అందుకుంది. -
పచ్చదనానికి జై
= 80 చెరువుల వద్ద గ్రీనరీ అభివృద్ధికి శ్రీకారం = పక్కా ప్రణాళికతో కదలిన అర్బన్ ఫారెస్ట్రీ = హెచ్ఎండీఏలో మొగ్గతొడిగిన పనులు సాక్షి, సిటీబ్యూరో : ప్రపంచ నగరాలకు దీటుగా గ్రేటర్ హైదరాబాద్‌ను ఆవిష్కరించేందుకు హెచ్ఎండీఏ కంకణం కట్టుకుంది. నగరంలో రోజురోజుకూ క్షీణిస్తున్న పర్యావరణాన్ని పరిరక్షించి, జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు వీలుగా వివిధ చెరువుల వద్ద సుందర నందన వనాలను సృష్టించేందుకు రంగంలోకి దిగింది. చీఫ్ సెక్రటరీ మహంతి ఆదేశాల మేరకు చెరువుల అభివృద్ధిపై హెచ్ఎండీఏ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఆక్రమణలకు గురవుతున్న చెరువులను గుర్తించి వాటిని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండీఏ కమిషనర్ నీరభ్‌కుమార్ ప్రసాద్ పకడ్బందీ ప్రణాళికను రూపొందించారు. పాత హుడా పరిధిలోని 80 చెరువుల వద్ద తాజాగా మొక్కలు నాటాలని, ఈ కార్యక్రమాన్ని వచ్చే డిసెంబర్‌లోగా పూర్తిచేయాలని ఆయన అధికారులకు గడువు నిర్దేశించారు. ఈ మేరకు అర్బన్ ఫారెస్ట్రీ/ ఇంజనీరింగ్ అధికారులు రంగంలోకి దిగి యుద్ధప్రాతిపదికన వివిధ పనులకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేకించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని రెండు దశల్లో నిర్వహించేందుకు అర్బన్ ఫారెస్ట్రీ అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు కదిలారు. ఇప్పటికే 35 చెరువుల వద్ద మొక్కలు నాటేందుకు అనువుగా గుంతలు (పిట్స్) సిద్ధం చేస్తున్నారు. తమ పరిధిలోని 80 జలాశయాల వద్ద పచ్చదనం పరిఢవిల్లేందుకు అందమైన, ఆకర్షణీయమైన పూల మొక్కలతో పాటు నీడనిచ్చే వృక్ష జాతులకు చెందిన మొక్కలను నాటుతున్నారు. ప్రధానంగా చెరువు కట్టపైన ఆకాశమల్లె, సిల్వర్‌ఓక్, బాటిబ్రష్, బోగన్ విలియా ఇతర పూల మొక్కలు నాటుతుండగా, చెరువుల ఎఫ్టీఎల్ ప్రాంతంలో తుమ్మ, కానుగ, నేరెడు, బరింగ్టోనియా, ఏరుమద్ది రకాల మొక్కలు నాటుతున్నారు. ఇవి నీటిలో సైతం ఎదుగుతాయని అధికారులు చెబుతున్నారు. మొత్తం 80 చెరువుల వద్ద సుమారు 5-6 లక్షల మొక్కలు నాటేందుకు సన్నద్ధమయ్యారు. తొలిదశలో భాగంగా మేడ్చెల్ చెరువు, తెల్లాపూర్, మేళ్ల చెరువు, వనంచెరువు తదితర చెరువుల వద్ద మొక్కలు నాటే కార్యక్రమం ఇప్పటికే మొదలైందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. చెరువుల వద్ద పచ్చని వనాలను అభివృద్ధి చేయడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించడమే గాక వలస పక్షులకు సైతం ఆవాసం కల్పించేందుకు ఇవి దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆక్రమణలకు అడ్డుకట్ట... చెరువుల ఎఫ్టీఎల్ బౌండ్రీస్ను ఖరారు చేసిన హెచ్ఎండీఏ ఇప్పుడు ఆక్రమణలను అడ్డుకొనేందుకు పక్కాగా చర్యలు చేపట్టింది. ఇందులో భాంగా ఇంజనీరింగ్ విభాగం పలు చెరువుల వద్ద ఫెన్సింగ్ ఏర్పాటుకు పూనుకొంది. ప్రధానంగా పాత హుడా పరిధిలో మొత్తం 501 చెరువులున్నట్లు రికార్డుల్లో గుర్తించగా.. ఇటీవల క్షేత్రస్థాయిలో సర్వే జరిపించగా ప్రస్తుతం 301 చెరువులు మాత్రమే భౌతికంగా ఉన్నట్లు లెక్క తేలింది. వీటిలో కొన్ని చెరువులను యుద్ధప్రాతిపదికన అభివృద్ధి చే యాలని ఇటీవల లేక్ ప్రొటెక్షన్ కమిటీ నిర్ణయించింది. ఆ మేరకు హెచ్ఎండీఏ పరిధిలో 80 చెరువులు, జీహెచ్ఎంసీ 128, ఇరిగేషన్ విభాగం 50 చెరువులను అభివృద్ధి చేసేందు కు నిర్ణయం తీసుకొన్నారు. ఇందులో భాగంగా హెచ్ఎండీఏ తన పరిధిలోని 80 చెరువుల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ఒక్కో చెరువు వద్ద గ్రీనరీ, ఫెన్సింగ్ వంటివి అభివృద్ధి చేసేందుకు రూ.15-20 లక్షల వరకు వెచ్చించాల్సి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే... పెద్ద చెరువులకు అంచనాలు పెరగవచ్చంటున్నారు. మేడ్చెల్ చెరువుకు ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు రూ.64.8 లక్షల అంచనా వ్యయంతో తాజాగా టెండర్లు ఆహ్వానించడం ఇందుకు నిదర్శనం. ఎలాంటి ప్రతికూల పరిస్థితి ఎదురైనా వచ్చే డిసెంబర్/మార్చి నాటికల్లా అన్ని పనులు పూర్తిచేసి మొత్తం 80 చెరువుల వద్ద పచ్చదనం పరిఢవిల్లేలా చేయాలన్నది హెచ్ఎండీఏ లక్ష్యంగా పెట్టుకొన్నట్లు అధికారులు చెబుతున్నారు.