సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాల వారీగా అన్ని రంగాలకు చెందిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి బుధవారం కేంద్ర హోంశాఖకు పంపించారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖతో పాటు, వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు అడిగిన పూర్తి వివరాలను నివేదిక రూపంలో మహంతి రూపొందించారు. గతంలోనే కొంత సమాచారాన్ని ఈ-మెయిల్ ద్వారా కేంద్రానికి పంపించిన సీఎస్ బుధవారం ప్రత్యేక అధికారిద్వారా కేంద్ర హోంశాఖ కార్యదర్శికి వివరాలు పంపారు. అఖిల భారత సర్వీసు అధికారుల వివరాలను కేంద్రం ఇచ్చిన నమూనా పత్రంలో పంపించారు.