దుల్కర్ సల్మాన్
‘మహానటి’ సినిమాలో జెమినీ గణేశన్‌గా అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్ అన్న విషయం తెలిసిందే. నటుడిగా తనయుడు ఎంచుకుంటున్న పాత్రలు చూసి తండ్రి మమ్ముట్టి చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నారట. ఈ విషయాన్ని దుల్కర్ షేర్ చేసుకుంటూ – ‘‘యాక్టర్‌గా నా చాయిస్‌లు చూసి డాడ్ చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నారు. ఇదివరకు అందరూ మమ్ముట్టి అబ్బాయిగా గుర్తించేవారు. కానీ ఇప్పుడు నన్నూ ఓ నటుడిగా ఆడియన్స్ గుర్తిస్తున్నారు. కెరీర్ స్టార్టింగ్‌లో ప్రతి విషయాన్ని నాన్నగారితో పోలుస్తారేమో అని కంగారు పడేవాణ్ణి. కానీ మెల్లిగా యాక్టర్‌గా నా ప్రతిభని ఆడియన్సే గుర్తిస్తారని అర్థం చేసుకున్నాను’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment