
మనోబాల
చెన్నై : నటుడు వడివేలు స్నేహాన్ని వదలుకోనని దర్శకుడు, నటుడు మనోబాలా పేర్కొన్నారు. ఈయన ఇంతకుముందు తన యూట్యూబ్ చానల్ ద్వారా నటుడు సింగ ముత్తును ఇంటర్వ్యూ చేసిన నేపథ్యంలో నటుడు వడివేలుపై పలు ఆరోపణలు చేసినట్టు సమాచారం. దీనిపై స్పందించిన వడివేలు సింగముత్తు, మనోబాలాపై నడిగర్ సంఘంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ ఫిర్యాదుపై స్పందించిన మనోబాలా నటుడు వడివేలు తనకు 30 ఏళ్లుగా మంచి మిత్రుడని పేర్కొన్నారు. తనకు ఆయన్ను కించపరచాలనే ఉద్దేశం లేదన్నారు. అలాంటిది తనపై వడివేలు ఎందుకు ఫిర్యాదు చేశారో అర్థం కావడం లేదన్నారు. ప్రస్తుతం వడివేలు ఆగ్రహంతో ఉన్నారని, తర్వాత ఆయనకు అన్ని వివరిస్తారని తెలిపారు. వడివేలుతో స్నేహానికి దూరం కావడం తనకు ఇష్టం లేదని మనోబాలా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment