కమెడియన్‌ కొడుకు సబ్‌ కలెక్టర్‌ అయిన వేళ! | Tamil Comedy Actor Chinni Jayanth Son Posted as Sub Collector | Sakshi
Sakshi News home page

Chinni Jayanth: సబ్‌ కలెక్టర్‌గా కమెడియన్‌ కొడుకు

Published Tue, Aug 3 2021 2:18 PM | Last Updated on Tue, Aug 3 2021 3:53 PM

Tamil Comedy Actor Chinni Jayanth Son Posted as Sub Collector - Sakshi

Chinni Jayanth Son: చిన్ని జయంత్‌.. ఈ కమెడియన్‌ గురించి మనకు పెద్దగా తెలియదు కానీ తమిళంలో మాత్రం బాగా ఫేమస్‌. శివాజీ గణేశన్‌, రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, విజయకాంత్‌, ప్రభు, కార్తీక్‌, అజిత్‌, విజయ్‌.. ఇలా కోలీవుడ్‌లో పెద్ద పెద్ద హీరోలందరి సినిమాల్లోనూ నటించాడితడు. తాజాగా ఆయన పేరు సోషల్‌ మీడియాలో మార్మోగిపోతోంది. కారణం.. అతడి కొడుకు ఏకంగా సబ్‌ కలెక్టర్‌ కొలువు సంపాదించాడు. చిన్ని జయంత్‌ కుమారుడు శృతన్‌ జై నారాయణన్‌ 2020లో ఐఏఎస్‌ పూర్తి చేశాడు.

ఆలిండియా లెవల్లో 75వ ర్యాంకు సంపాదించిన అతడు తాజాగా ట్యుటికోరన్‌ జిల్లాకు సబ్‌ కలెక్టర్‌గా నియామకమయ్యాడు. ఈ సందర్భంగా శృతన్‌ మాట్లాడుతూ.. విద్య, జీవనోపాధి, మహిళా సాధికారత పెరుగుదలకు తనవంతు కృషి చేస్తానని చెప్తున్నాడు. తండ్రికి తగ్గ కొడుకు, తండ్రి గర్వపడేలా చేశాడు అంటూ నెటిజన్లు శృతన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా వుంటే చిన్ని జయంత్‌ ప్రస్తుతం విజయ్‌ సేతుపతి 'యాదుమ్‌ ఊరేఘెవరుమ్‌ కెలిర్‌' సినిమాలో నటిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement