డూప్‌ లేకుండానే... | Sathyaraj mind-boggling performance Theerpugal Virkkapadum | Sakshi
Sakshi News home page

డూప్‌ లేకుండానే...

Published Sun, Jul 28 2019 6:28 AM | Last Updated on Sun, Jul 28 2019 6:28 AM

Sathyaraj mind-boggling performance Theerpugal Virkkapadum - Sakshi

సత్యరాజ్‌

‘బాహుబలి’లో ప్రభాస్, రానాకు యుద్ధ విద్యలు నేర్పించే కట్టప్ప పాత్ర చేశారు సత్యరాజ్‌. అరవై ఏళ్లకు పైబడినా ఆ పాత్రను నమ్మశక్యంగా అనిపించేలా చేశారు సత్యరాజ్‌. ఇప్పుడు మరో యాక్షన్‌ సినిమా చేస్తున్నారాయన. ఇందులో డూప్‌ సహాయం లేకుండా ఫైట్స్‌ కూడా చేస్తున్నారు. ‘తీర్పుగళ్‌ విర్కపడుమ్‌’ అనే టైటిల్‌తో ధీరన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులోని యాక్షన్‌ సన్నివేశాలను సత్యరాజ్‌ స్వయంగా చేస్తున్నారు. ‘‘సెట్లో సత్యరాజ్‌ సార్‌ ఎనర్జీ అద్భుతం. ఆయన లాంటి యాక్టర్‌తో చేయడం మంచి ఎక్స్‌పీరియన్స్‌. ఇందులో హై వోల్టేజ్‌ యాక్షన్‌ సన్నివేశాలున్నాయి. సత్యరాజ్‌గారు చేస్తారా? లేదా అనుకున్నాం. డూప్‌ అవసరం లేకుండా ఫైట్స్‌ చేసి మా అందర్నీ ఆశ్చర్యపరిచారు’’ అన్నారు ధీరన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement