Baahubali Actor Sathyaraj Plays Villain Role in his Next Film - Sakshi
Sakshi News home page

Satyaraj : మరోసారి విలన్‌గా బాహుబలి కట్టప్ప సత్యరాజ్‌

Published Sat, Dec 17 2022 9:24 AM | Last Updated on Sat, Dec 17 2022 9:57 AM

Bahubali Actor Satyaraj Plays Villain Role In His Next Film - Sakshi

తమిళ సినిమా: తొలి రోజుల్లో ప్రతి నాయకుడిగా దుమ్ము రేపిన నటుడు సత్యరాజ్‌ తరువాత కథానాయకుడిగా అవతారం ఎత్తి స్టార్‌ హీరోగా రాణించారు. ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తమిళం, తెలుగు తదితర భాషల్లో నటిస్తూ బిజీ అయ్యారు. విలన్‌ పాత్రలు చేయనని చెప్పిన సత్యరాజ్‌ తాజాగా అలాంటి పాత్రలో నటిస్తుండడం విశేషం. ఈయన డేర్‌ పోలీస్‌ అధికారిగా నటిస్తున్న చిత్రం అంగారకన్‌. నటుడు శ్రీపతి కథానాయకుడిగా పరిచయం అవుతూ, స్క్రీన్‌ ప్లే, క్రియేటివ్‌ డైరెక్టర్‌ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

సాఫ్ట్‌వేర్‌ సంస్థ అధికారి అయిన ఈయన సినిమాపై ముఖ్యంగా నటనపై ఆసక్తితో ఈ రంగంలోకి ప్రవేశించారు. మోహన్‌ డచ్చు ఛాయాగ్రహణం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. మలయాళ నటి నియా కథానాయకిగా కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో నటుడు అంగాడితెరు మహే‹Ù, రైనాకారత్, రోషన్, అప్పు కుట్టి, దియా, నేహా రోస్, గురుచంద్రన్, కేసీపీ ప్రభాత్‌ తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

ఈ చిత్రాన్ని జూలియన్, జెరోమా ఇంటర్నేషనల్‌ పతాకంపై జోమోన్‌ పిలిప్, జీవా జోమోన్‌ నిర్మిస్తున్నారు. కె కార్తీక్‌ సంగీత దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఆర్‌.కలైవానన్‌ జాగ్రహం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ కార్యక్రమం ముమ్మరంగా జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని 2023 సమ్మర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement